![Dwayne Bravo Hits 5 Consecutive Sixes in an Over forTrinbago Knight Riders - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/2/Bravo1.jpg.webp?itok=DiwRMAZi)
సెయింట్‌కిట్స్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట తీరుతో అలరించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న బ్రేవో.. శనివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ప్రధానంగా 19 ఓవర్‌లో బ్రేవో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జోసెఫ్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికి పరుగులేమీ చేయని బ్రేవో.. ఆపై వరుస బంతుల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.
ఒక్కో సిక్సర్‌ను ఒక్కో తరహాలో పెవిలియన్‌లోకి కొట్టాడు. మొత్తంగా 11 బంతులు ఎదుర్కొన్న బ్రేవో.. 1 ఫోర్, 5 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment