Bravo
-
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
టీమిండియా మాజీ క్రికెటర్, ముంబై ఇండియన్స్ వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా పీయూష్ చావ్లా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్‌ను ఔట్ చేసిన చావ్లా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 189 మ్యాచ్‌లు ఆడిన చావ్లా.. 184 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం డ్వెన్ బ్రావో(183) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును పీయూష్ బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. చాహల్ ఇప్పటివరకు 155 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(70) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మనీష్ పాండే(42) పరుగులతో రాణించాడు. ఇక ముంబై బౌలర్లలో తుషారా, బుమ్రా తలా 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు. -
ధోని సేనకు భారీ షాక్.. ఒకేసారి నలుగురు విదేశీ స్టార్లు దూరం..!
దుబాయ్: ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఇద్దరు గాయాల బారిన పడగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ప్రస్తుతం సీపీఎల్ 2021లో ఆడుతున్న బ్రావో, డుప్లెసిస్ గాయపడగా.. ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, మొయిన్ అలీలు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌కు దూరం కానున్నారు. గాయం కారణంగా బ్రావో కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కానుండగా, పాకిస్తాన్ ప్రిమియర్ లీగ్‌లో తగిలిన గాయం తిరగబెట్టడంతో డుప్లెసిస్ ఐపీఎల్ మొత్తానికే దూరమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్, మొయిన్ అలీలు ఐపీఎల్ అనంతరం రెండు రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం బయో బబుల్‌లోకి వెళ్లిపోనున్నారు. ఈసీబీ నిబంధనల ప్రకారం వారు మెగా టోర్నీ ప్రారంభానికి మందే ఇంగ్లండ్ బృందంలో చేరాల్సి ఉంది. ఇలా ఒకేసారి నలుగురు స్టార్ ఆటగాళ్లు దూరం కానుండడంతో సీఎస్కే టైటిల్ గెలవాలన్న ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ తొలి సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. అయితే మొదటి దశలో కీలకపాత్ర పోషించిన డుప్లెసిస్, మొయిన్ అలీ, సామ్ కరన్‌లు కీలక దశలో జట్టును వీడితే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా, సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. చదవండి: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి.. రోహిత్‌కు పగ్గాలు..? -
చెన్నై తదుపరి మ్యాచ్‌లకు బ్రేవో దూరం
షార్జా: ఐపీఎల్ తాజా సీజన్లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడి డీలాపడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జట్టు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్, ఆల్‌రౌండర్ బ్రేవో కుడి కాలి తొడ కండరాల గాయంతో చెన్నై ఆడే తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. అయితే ఎంత కాలం అతడు డగౌట్‌కే పరిమితమవుతాడనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. అతడు కోలుకోవడానికి కొద్ది రోజులు లేదా రెండు, మూడు వారాలు పట్టే అవకాశం ఉందని ఫ్లెమింగ్ వెల్లడించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో బ్రేవో గాయపడ్డాడు. దాంతో తన ఓవర్ల కోటాను పూర్తి చేయకుండానే మైదానాన్ని వీడాడు. -
రజనీకాంత్‌ను కలవాలనుంది!
టీ.నగర్: నటుడు రజనీకాంత్‌ను కలవాలని ఉందని క్రికెటర్ బ్రావో వెల్లడించారు. వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రావో ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కోసం ఆటాడుతున్నారు. చాలాకాలంగా ఆయన చెన్నై జట్టులో ఆడుతున్నందున ఇక్కడి సంస్కృతి, ఆహార పదార్థాలు ఎంతగానో నచ్చుతున్నాయి. ఇలావుండగా నటుడు రజనీకాంత్‌ను కలవాలనుందని బ్రావో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు రజనీకాంత్ గురించి విన్నానని, అయితే ఆయన నటించిన చిత్రాలను చూడలేదన్నారు. త్వరలో చూస్తానని, రజనీకాంత్‌ను కలుసుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
డ్వేన్ బ్రేవో షాకింగ్ నిర్ణయం
ఆంటిగ్వా: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 35 ఏళ్ల బ్రావో 2016 సెప్టెంబర్‌లో చివరిసారిగా విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2012, 2016 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రేవో.. 270 మ్యాచ్‌ల్లో విండీస్ తరఫున బరిలో దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా తప్పుకుంటున్నట్టు బ్రేవో బుధవారం రాత్రి ప్రకటించాడు. ‘14 ఏళ్ల క్రితం వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాను. నాకు ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తున్నాయి. 2004లో ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్ ఆడటానికి లార్డ్స్‌లోకి అడుగుపెట్టే ముందు మెరూన్ క్యాప్ అందుకున్నాను. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాను. తర్వాతి తరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం రిటైర్ అవుతున్నా’ అని బ్రేవో తన ప్రకటనలో స్పష్టం చేశాడు. అయితే క్రికెటర్‌గా ప్రొఫెషనల్ కెరీర్‌ను కొనసాగిస్తానని బ్రేవో తెలిపాడు. దాంతో ఐపీఎల్ వంటి లీగ్‌ల్లో ఆడతానని బ్రేవో చెప్పకనే చెప్పేశాడు. 40 టెస్టులు ఆడిన బ్రావో 31.43 సగటుతో 2200 పరుగులు చేయడంతోపాటు 86 వికెట్లు తీశాడు. 164 వన్డేలు ఆడిన ఈ కరేబియన్ ప్లేయర్ 2968 రన్స్ చేయడంతోపాటు 199 వికెట్లు పడగొట్టాడు. 66 టీ20ల్లో 1142 పరుగులు చేసి, 52 వికెట్లు తీశాడు. చివరిసారిగా 2010లో శ్రీలంకపై చివరి టెస్ట్ ఆడాడు. 2014లో భారత్‌పై ఆఖరి వన్డే ఆడిన బ్రావో.. 2016లో పాక్‌పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. -
ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు
-
ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు
సెయింట్‌కిట్స్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట తీరుతో అలరించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న బ్రేవో.. శనివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ప్రధానంగా 19 ఓవర్లో బ్రేవో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జోసెఫ్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికి పరుగులేమీ చేయని బ్రేవో.. ఆపై వరుస బంతుల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒక్కో సిక్సర్‌ను ఒక్కో తరహాలో పెవిలియన్‌లోకి కొట్టాడు. మొత్తంగా 11 బంతులు ఎదుర్కొన్న బ్రేవో.. 1 ఫోర్, 5 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి ఓటమి పాలైంది. -
ధోనితో బ్రావో త్రీ రన్స్ చాలెంజ్
-
ధోనీ vs బ్రేవో : గెలిచిందెవరు?
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ -11వ సీజన్లో త్రీ రన్స్ చాలెంజ్ బాగా పాపులర్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనితో ఆ జట్టు ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో ఈ పోటీలో పాల్గొన్నారు. మరి ఇద్దరిలో గెలిచిందెవరూ?. ఇంకెవరు వయసు మీద పడుతున్నా యువ ఆటగాళ్లకు సవాలు విసురుతున్న ధోనినే నెగ్గాడు. అవును. ధోని, బ్రేవోలు ఇద్దరు హోరాహోరీగా వికెట్ల మధ్య పరుగులు తీశారు. అయితే, బ్రేవో కంటే కొన్ని ఇంచ్‌ల ముందు క్రీజులో బ్యాట్‌ను పెట్టిన ధోని గెలుపొందాడు. అవార్డుల ప్రధానోత్సవం తర్వాత చాలాసేపు చెన్నై ఆటగాళ్లంతా మైదానంలో సందడి చేస్తూ గడిపారు. ఈ సమయంలోనే బ్రేవో-ధోనిల మధ్య త్రీ రన్స్ ఛాలెంజ్ నిర్వహించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను చూసేయ్యండి. -
బ్రావోతో కలసి స్టెప్పులేసిన ధోని కూతురు
-
ధోని కూతురితో బ్రావో స్టెప్పులు..!!
సాక్షి, హైదరాబాద్ : అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ తన వంతు వచ్చినప్పుడు ఆటలో సత్తా చూపించే ఆల్రౌండర్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో కూడా ఒకరు. 2016లో బ్రావో పాడిన ‘చాంపియన్స్’పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రావో ఆ పాటను ధోని, రైనా కూతుళ్లు జీవా, గ్రేసియాల కోసం మళ్లీ పాడారు. దీంతో ఈ పాటకు జీవా, బ్రావోతో కలసి స్టెప్పులేసింది. కేవలం జీవానే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరికొంత మంది పిల్లలు కూడా డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్టు చేసింది. -
ఐపీఎల్- 11 లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి
-
చెన్నై చమక్
ఐపీఎల్ సీజన్ తొలి పోరు. తలపడుతున్నది దిగ్గజ జట్లు. అటు ఇటు మంచి హిట్టర్లు. అయినా సాదాసీదా ప్రదర్శన. ‘ఇదేం ఆట’ అంటూ నిట్టూర్పులో అభిమానులు! కానీ ఒకే ఒక్కడు మలుపు తిప్పాడు. ప్రేక్షకులను రంజింపజేశాడు. పేలవంగా సాగుతున్న మ్యాచ్‌ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చాడు. ఓటమి ఖాయమనుకున్న తన జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అతడే డ్వేన్ బ్రేవో. అతడి దెబ్బకు ముంబై విసిరిన లక్ష్యం ‘బ్రేవ్ బ్రేవ్’మంటూ కరిగిపోయింది. చెన్నైకు అనూహ్య గెలుపు దక్కింది. ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఘన పునరాగమనం. మొదట బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసిన డ్వేన్ బ్రేవో (0/25), అనంతరం బ్యాటింగ్ (30 బంతుల్లో 69; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు)లోనూ విరుచుకుపడటంతో శనివారం ఇక్కడ జరిగిన ఐపీఎల్–11వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై ఆ జట్టు వికెట్ తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై... సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. బ్రేవో దూకుడుతో చెన్నై 19.5 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. బ్రేవోకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓపెనర్లు వాట్సన్ (16), రాయుడు (22) చెన్నై ఇన్నింగ్స్‌ను కొంత మెరుగ్గానే ఆరంభించారు. వీరితో పాటు రైనా (4), ధోని (5) తర్వగా అవుటవడంతో జట్టు కష్టాల్లో పడింది. ముందుగా వచ్చిన జడేజా (12) నిరాశపరిచాడు. ఈలోగా కేదార్ జాదవ్ (22 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా బ్రేవో ధైర్యంగా ఆడాడు. చివరి 3 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో రెండే వికెట్లున్నాయి. మెక్లనగన్ వేసిన 18వ ఓవర్లో బ్రేవో రెండు సిక్స్‌లు, 1 ఫోర్‌తో, బుమ్రా వేసిన 19వ ఓవర్లో 3 సిక్స్‌లు సహా 20 చొప్పున పరుగులు పిండుకున్నాడు. 19వ ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా తిరిగి క్రీజులోకి వచ్చిన జాదవ్... ముస్తఫిజుర్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో ముగించాడు. అంతకుముందు ఐపీఎల్ ఆరంభ వేడుకలు శనివారం అట్టహాసంగా సాగాయి. సినీ తారలు హృతిక్ రోషన్, ప్రభుదేవా, వరుణ్ ధావన్, జాక్లిన్ ఫెర్నాండెజ్, తమన్నాలు ప్రత్యేక నృత్యాలతో అలరించారు. -
లెక్క తప్పుతోంది!
⇒ లక్ పోతుంది ⇒ ధోనికి దూరమవుతున్న ఫినిషింగ్ టచ్ ⇒ ఇకపై ఆ ‘మ్యాజిక్’ ముగింపులు చూడలేమా? ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్ ఎవరు..? ఎలాంటి సందేహం లేకుండా ఈ ప్రశ్నకు వినిపించే సమాధానం ధోని. అతను క్రీజులో ఉన్నాడంటే భారత్‌కు విజయం ఖాయమనే ధీమా అందరిలోనూ ఉండేది. చివరి ఓవర్లో ఎన్ని పరుగులు అవసరమైనా... చివరికి రెండు బంతుల్లో 12 పరుగులు కావాలన్నా ధోని ఆడుతున్నాడంటే విజయం ఖాయమనే నమ్మకం ఉండేది. కానీ క్రమంగా ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. అదృష్టాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని తిరుగుతాడనే పేరున్న ధోనిని... ఇప్పుడు అదే అదృష్టం వెక్కిరిస్తోంది. ఇటీవల కాలంలో తరచుగా అతను ఆఖరి ఓవర్ల ‘మ్యాజిక్’ను మిస్ అవుతున్నాడు. తాజాగా అమెరికాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో ఆఖరి బంతికి విజయానికి కావాల్సిన రెండు పరుగులను చేయలేక అవుటయ్యాడు. ఎందుకిలా..? రెండో ఎండ్‌లో క్రీజులో ఎంత పేరున్న బ్యాట్స్‌మన్ అరుునా... ధోని సింగిల్స్ తీయకుండా భారీ షాట్లతో మ్యాచ్‌లు ముగించడం చాలాసార్లు చూశాం. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో జరిగిన టి20లో రెండో ఎండ్‌లో అంబటి రాయుడు రూపంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఉన్నా ధోని కనీసం సింగిల్స్ తీయకుండా ఒక్కడే మ్యాచ్‌ను ముగించే ప్రయత్నం చేశాడు. ధోని గత చరిత్ర తెలిసిన వాళ్లకు ఇది కొత్తగా అనిపించలేదు. గతంలో ఇదే తరహాలో మ్యాచ్‌లు గెలిపించినందున... ఒక్క మ్యాచ్ ఓడిపోతే విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అందరూ సరిపెట్టుకున్నారు. తర్వాత కాస్త తడబడ్డా మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్లో వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ధోని చివరి ఓవర్లో తన విశ్వరూపం చూపించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లో విజయానికి 23 పరుగులు అవసరం కాగా... ఒక్కడే బాదేశాడు. ముఖ్యంగా చివరి మూడు బంతులకు 16 పరుగులు అవసరం కాగా... అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్, సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రెండు నెలల క్రితం జింబాబ్వే సిరీస్‌లో ఆఖరి ఓవర్లో విజయానికి 8 పరుగులు అవసరం కాగా... ధోని క్రీజులో ఉన్నా భారత్ ఓడిపోరుుంది. చివరి బంతికి ఫోర్ కొడితే గెలిచే స్థితిలో ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. తాజాగా వెస్టిండీస్‌తో టి20 మ్యాచ్‌లో 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ విజయానికి చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం అయ్యారుు. ఇంత భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఎనిమిది పరుగులు విషయమే కాదు. రెండో ఎండ్‌లో కేఎల్ రాహుల్ అప్పటికే సెంచరీ చేసి సంచలనాత్మకంగా హిట్టింగ్ చేస్తున్నాడు. కాబట్టి ధోని రెండో ఎండ్‌లో ఉన్న రాహుల్‌ను నమ్ముకోవచ్చు. అరుుతే వెస్టిండీస్ బౌలర్ బ్రేవో చాలా తెలివిగా వ్యవహరించాడు. ధోనితో కలిసి చెన్నై తరఫున ఆడిన బ్రేవోకు భారత కెప్టెన్ ఏం చేస్తాడో తెలుసు. ఇలాంటి ఓవర్లలో సహజంగా తొలి బంతిని బౌండరీకి పంపి బౌలర్‌పై ఒత్తిడి పెంచుతాడు. కాబట్టి బ్రేవో తెలివిగా వ్యవహరించడం తొలి నాలుగు బంతులకు నాలుగు సింగిల్స్ మాత్రమే వచ్చారుు. చివరి రెండు బంతుల్లో విజయానికి నాలుగు పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి రెండు పరుగుల తీసి, ఆఖరి బంతికి భారత కెప్టెన్ అవుటయ్యాడు. తన జీవితంలోనే మరచిపోలేని ఇన్నింగ్స ఆడి సెంచరీ చేసిన రాహుల్ ఆ క్షణంలో పడిన బాధను చూస్తే... ధోని కూడా కచ్చితంగా ఫీలయ్యే ఉంటాడు. బౌలర్లు హోమ్‌వర్క్ చేస్తున్నారు ధోని మంచి ఫినిషర్ అని ప్రపంచంలో ఉన్న బౌలర్లందరికీ తెలుసు. బంతి వేసేది తెలివైన బౌలర్ అరుుతే ధోనిని నియంత్రించవచ్చని గతేడాది దక్షిణాఫ్రికా బౌలర్ రబడ ప్రపంచానికి చూపించాడు. కాన్పూర్‌లో జరిగిన వన్డేలో ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా... రబడ భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. ధోని కదలికలను బట్టి బంతుల్లో వైవిధ్యం చూపించాడు. ఈసారి వెస్టిండీస్ బౌలర్ బ్రేవో కూడా అదే చేశాడు. ధోని క్రీజులో కదులుతున్న విషయాన్ని గమనించి స్లో బంతితో బోల్తా కొట్టించాడు. అంటే... అన్ని జట్ల బౌలర్లు హోమ్ వర్క్ చేసే బరిలోకి దిగుతున్నారు. విశ్రాంతి వల్ల ఇబ్బందా? ధోని కెరీర్ ఆరంభం నుంచి ఎప్పుడూ సుదీర్ఘంగా విశ్రాంతి తీసుకోలేదు. అన్ని ఫార్మాట్లలోనూ అలుపెరగకుండా ఆడాడు. దీంతో ఎప్పుడూ ‘టచ్’ కోల్పోలేదు. కానీ ఇప్పుడు ధోని టెస్టులు ఆడటం లేదు. కేవలం వన్డేలు, టి20లకు పరిమితమయ్యాడు. వాస్తవానికి జింబాబ్వే పర్యటన తర్వాత భారత్‌కు అన్నీ టెస్టు మ్యాచ్‌లే ఉన్నారుు. అనుకోకుండా అమెరికాలో రెండు టి20లు ఆడాల్సి రావడం వల్ల ధోని వచ్చాడు. లేదంటే దాదాపు మరో రెండు మూడు నెలలు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగానే ఉండేవాడు. ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత ఫిట్నెస్ కోసం శ్రమించినా మ్యాచ్ ప్రాక్టీస్ ఉన్న ఆటగాళ్లే మెరుగ్గా రాణిస్తారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. దీనిని ధోని ఎలా అధిగమిస్తాడో చూడాలి. ఆర్డర్ మారడం మేలేమో..! ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, అంచనాల ప్రకారం ధోని ఇంగ్లండ్‌లో వన్డే ప్రపంచకప్ (2019) వరకు కొనసాగాలని అనుకుంటున్నాడు. గతంతో పోలిస్తే ధోనిలో ఫినిషింగ్ పవర్, భారీ హిట్టింగ్ పవర్ తగ్గిందనేదీ వాస్తవం. ఈ నేపథ్యంలో మరో మూడేళ్లు క్రికెట్ ఆడాలంటే ధోని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవడం మేలు. ఆఖరి ఓవర్లలో హిట్టింగ్ చేయగల ఆటగాడిని చూసుకుని ధోని మిడిలార్డర్లో నాలుగు, ఐదు స్థానాల్లో ఆడటం వల్ల క్రీజులో కుదురుకోవడానికి సమయం దొరుకుతుంది. వెస్టిండీస్‌తో ఆఖరి బంతికి అవుటైనా ఆ మ్యాచ్‌లో ధోని బాగా ఆడాడు. ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన ధోనిని విమర్శించడం కరెక్ట్ కాదు. కానీ గతంలోలాగా ఆఖరి ఓవర్లలో ఒక్కడే షో చేయడం ఇకపై సాధ్యం కాకపోవచ్చు. అదృష్టం కూడా ప్రతిసారీ వెంట ఉండదు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని మార్పులు, చేర్పులు చేసుకుంటే భారత క్రికెట్‌కు మంచి జరుగుతుంది. -
‘చాంపియన్’లో ఏముంది!
► ఉర్రూతలూగిస్తున్న బ్రేవో పాట ► యూ ట్యూబ్‌లో రికార్డ్ హిట్స్ సాక్షి క్రీడావిభాగం ‘అందరికీ తెలుసు గేల్ చాంపియన్, లారా కూడా చాంపియన్... ఒబామా చాంపియన్, మండేలా చాంపియన్’... ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో సింగిల్ ‘చాంపియన్’ సాహిత్యమిది! సాధారణ పదాలతో, వినేవారికి పెద్దగా శ్రమ కల్పించకుండా ఉంటూ అప్పటికప్పుడు అల్లుకున్న పాటలాగా ఇది అనిపిస్తుంది. క్రికెటర్‌గా బ్రేవోకున్న గుర్తింపు వల్ల పాట అందరికీ పరిచయమైతే... వెస్టిండీస్ వరల్డ్ కప్ విజయం ఇప్పుడు దానిని సూపర్‌హిట్ చేసింది. ‘చాంపియన్’ వీడియోకు యూ ట్యూబ్‌లో వారం వ్యవధిలోనే 4.5 మిలియన్ల హిట్స్ రావడం విశేషం. విండీస్ ఆటగాళ్లయితే దానిని తమ టీమ్ థీమ్ సాంగ్‌గా మార్చుకోగా... ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ పాట డ్యాన్స్ కదలికలను చాలా మంది క్రికెటర్లు, బాలీవుడ్ నటులు అనుకరించారు. రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లుగా పెట్టుకోవడంతో పాటు లెక్క లేనంత మంది అద్దం ముందు ఈ డ్యాన్స్‌ను చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. మొదటి సారేం కాదు క్రికెట్‌తో పాటు వినోద ప్రపంచంలో కూడా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న బ్రేవో ఆ క్రమంలో రూపొందించిన మూడో సింగిల్ చాంపియన్. ‘గో గ్యాల్ గో’ పేరుతో తొలి పాట అనంతరం 2013 ఐపీఎల్ సమయంలో చలో చలో అంటూ ఒక హింగ్లీష్ సాంగ్‌ను తయారు చేశాడు. ‘ఉలా’ అనే తమిళ చిత్రంలోనూ అతను ఒక పాట పాడాడు. చాంపియన్ పూర్తి వీడియో సాంగ్‌ను టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఇటీవల విడుదల చేయడానికి మూడు నెలల ముందే అతను మెల్బోర్న్లో బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా దీనిని వేదికపై ప్రదర్శించాడు. నాడు ప్రవాస భారత గాయని పల్లవి శారద అతనితో పదం కలిపింది. దీనిని ప్రమోట్ చేసేందుకు బ్రేవో లాస్ ఏంజెల్స్‌కు చెందిన వీనస్ మ్యూజిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత్‌లో ‘వేగ’ ఈ వీడియోను విడుదల చేసింది. జోసెఫ్ ఫెర్నాండో దీనికి దర్శకత్వం వహించాడు. చాలెంజ్ కూడా... మన ‘స్టాలిన్’ సినిమాలాగా, సరిగ్గా చెప్పాలంటే ‘స్వచ్ఛ భారత్’ ప్రచారం లాగా ‘చాంపియన్’ పాటకు కూడా ఇలా చేయగలరా అంటూ చాలెంజ్ విసిరాడు. అందరికంటే ముందుగా స్పందిం చిన గేల్ అలాగే డ్యాన్స్ చేసి మరో మూడు పేర్లు అమితాబ్, డివిలియర్స్, కోహ్లిను డ్యాన్స్ చేయాలంటూ నామినేట్ చేశాడు. హర్భజన్ సింగ్ కూడా ఈ పాటకు నర్తించి తన భార్య గీతా బస్రాతో పాటు సచిన్‌కు కూడా సవాల్ విసిరాడు. ‘కరీబియన్ సంస్కృతిలోనే సంగీతం ఉంది. ప్రపంచంలోని చాలా మంది పేరున్న సంగీతకర్తలు ఇక్కడి నుంచి వచ్చారు. క్రికెట్‌తోనే కాకుండా నా అభిమానులను వినోదంతో కూడా ఆనందపరచాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను. చాంపియన్ ఇంత పెద్ద హిట్ అయి నా నమ్మకాన్ని నిలబెట్టింది’ అని బ్రేవో గర్వంగా చెప్పుకున్నాడు. మొత్తంగా ఆటతో పాటు విండీస్ పాట కూడా ఇప్పుడు సరికొత్త సంచలనంగా మారింది. ప్రముఖుల పేర్లతో... చాంపియన్’ పాటలో డ్యాన్స్ మొత్తం దాదాపు ఒకే తరహాలో సాగుతుంది. అది సునాయాసంగా కూడా ఉండటంతో చాలా మందికి ఎక్కేసింది. ఈ పాటలో బ్రేవో తనతో పాటు గేల్, పొలార్డ్, లారా, రిచర్డ్స్, మార్షల్‌లాంటి వెస్టిండీస్ ఆటగాళ్ల పేర్లు తీసుకున్నాడు. ఇతర క్రీడా రంగాలకు చెందిన సెరెనా, ఉసేన్ బోల్ట్, జోర్డాన్‌లను చాంపియన్లుగా ప్రస్తుతిస్తూ ఒబామా, మండేలాలాంటి ప్రపంచ ప్రముఖుల పేర్లు కూడా చేర్చాడు. ట్రినిడాడ్ వాళ్ళంతా చాంపియన్లే అని కూడా అతను లైన్‌ను చేర్చాడు. డ్వేవో ఎక్కడా బహిరంగంగా చెప్పకపోయినా... పరిశీలిస్తే ఈ పాటలో పేర్లన్నీ నల్ల జాతివారివే కనిపిస్తాయి. వారి గొప్పతనం చెప్పడం కూడా అతని ఉద్దేశం కావచ్చు. -
చాంపియన్... షాంపేన్
► మిన్నంటిన వెస్టిండీస్ క్రికెటర్ల సంబరాలు విజయాన్ని ఎలా వేడుకగా జరుపుకోవాలో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అదే ప్రపంచకప్ గెలిస్తే ఇక వారి సంబరాలకు పట్టపగ్గాలు ఉండవు. 2012లో గంగ్నమ్ డ్యాన్స్‌తో విండీస్ హోరెత్తిస్తే ఈ సారి చాంపియన్ పాట వారితో నాట్యమాడించింది. మైదానంలో గెలుపు తర్వాత మొదలైన సంబరాలు సోమవారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కొనసాగాయి. స్టేడియంలో ఫైనల్ ముగిసిన తర్వాతే విండీస్ క్రికెటర్లు పట్టరాని ఆనందంతో చిందులు వేశారు. అక్కడ అలసిపోయేంత వరకు ఆడిపాడిన బృందం హోటల్‌కు చేరగానే మళ్లీ కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుంది. ఎంట్రన్స్నుంచే చాంపియన్ డ్యాన్స్ చేసుకుంటూ వారు లోపలికి వచ్చారు. అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరిన అభిమానులు కూడా డ్యాన్స్ చేస్తూ ఉత్సాహపరచడంతో స్యామీ, బ్రేవో చెలరేగిపోయారు. మధ్యలో సెల్ఫీల కోసం సంబరపడిన ఎవరినీ వారు నిరాశ పర్చలేదు. స్పెషల్ నైట్ వేడుకలకు విరామం ఇవ్వకుండా హోటళ్లో మళ్లీ అంతా ఒక్కచోటికి చేరారు. అక్కడ షాంపేన్ వరదలా పారింది. అప్పటికే హోటల్ ప్రతినిధులు సిద్ధం చేసిన కేక్‌ను కట్ చేయడంతో మరో రౌండ్ సంబరాలు మొదలయ్యాయి. చాంపియన్ పాటతో జోష్ మొదలైనా... తర్వాత హాలీవుడ్ సంగీతం అక్కడ హోరెత్తింది. ప్రపంచ విజేతలు ఈ ప్రపంచాన్ని మరచిపోయి డ్యాన్స్‌తో చెలరేగిపోయారు. మధ్యలో విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ కూడా వారితో జత కలవడం ఆటగాళ్ల ఉత్సాహాన్ని మరింత పెంచింది. అభినందించేందుకు రూమ్‌కు వచ్చిన లాయిడ్ కూడా చాంపియన్ డ్యాన్స్ చేయడం విశేషం. విండీస్ ఫైనల్‌ను టీవీలో వీక్షించిన అనంతరం ఇదే డ్యాన్స్ చేసి జట్టుకు అభినందనలు పలికిన విఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆ వీడియోను జట్టు సభ్యులకు పంపించగా... వారంతా ఆసక్తిగా తిలకించారు. సోమవారం మధ్యాహ్నం విక్టోరియా ప్యాలెస్ వద్ద ఫోటో సెషన్‌కు స్యామీ, బ్రాత్‌వైట్ హాజరు కాగా, సాయంత్రంనుంచి ఆటగాళ్లు బయల్దేరి వెళ్లారు. వీరిలో కొందరు నేరుగా తమ ఐపీఎల్ జట్లతో చేరగా, ఇతర ఆటగాళ్లు విండీస్ పయనమయ్యారు. ► కోల్‌కతాలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ భవనం ముందు ప్రపంచకప్ ట్రోఫీలతో వెస్టిండీస్ మహిళల కెప్టెన్ స్టెఫానీ టేలర్, పురుషుల జట్టు కెప్టెన్ స్యామీ చూస్తున్నవాళ్లం అలసిపోయాం మామూలుగానే విండీస్ క్రికెటర్లు చిన్న చిన్న సంతోషాలను కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఈ విజయం తర్వాత చెప్పేదేముంది. చూస్తున్నవాళ్లం అలసిపోయాం కానీ వారు మాత్రం ఆట, పాటతో అలసిపోలేదు. ప్రాక్టీస్ సమయంలో, ఆడే సమయంలో కూడా వాళ్లు తీవ్రంగా శ్రమిస్తారు. వంద శాతం కష్టపడతారు. అదే మైదానం దాటితే సంబరాలు కూడా అదే తరహాలో రెట్టింపు స్థాయిలో ఉంటాయి. హోటల్లోని టీమ్ రూమ్‌లో అడుగు పెట్టిన తర్వాత వారో కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో గేల్ అయినా, మరే జూనియర్ ఆటగాడైనా ఒక్కటే. ఇలాంటి గొప్ప జట్టుతో టోర్నీకి పని చేయడం నా అదృష్టం - విక్రమ్ మాన్సింగ్, వెస్టిండీస్ టీమ్ లైజన్ మేనేజర్ -
క్రిస్ గేల్.. స్నేహా ఉల్లాల్...
విధ్వంసానికి పరాకాష్ట క్రిస్‌గేల్ బుధవారం జరిగిన టీ20 మ్యాచ్ లో సెంచరీ కొట్టిన తరువాత స్టేడియంలో వేసిన స్టెప్పులు క్రికెట్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు. సహచరులంతా కలిసి గేల్ ను అనుకరిస్తూ రెస్ట్ రూంలో హంగామా సృష్టించారు. స్టేడియంలో అభిమానులకి పరిచయం చేసిన ఆ సరికొత్త స్టెప్ బ్రేవో డీజెగా మారి కంపోజ్ చేసిన 'చాంపియన్' పాటకు సంబంధించింది. ప్రస్తుతం గేల్ ఇంట్రడ్యూస్ చేసిన 'చాంపియన్' స్టెప్ కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంది. మ్యాచ్ కంటే ముందే బ్రేవో, గేల్ కలిసి ఓ పార్టీలో చాంపియన్ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. వీరికి నటి స్నేహా ఉల్లాల్ కూడా తోడవడంతో పార్టీ పీక్స్‌కు చేరింది. సల్మాన్ ఖాన్ సహకారంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహా ఉల్లాల్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో కనిపించింది తక్కువే. అయితే తాజాగా గేల్ తో కలిసి స్నేహా పార్టీలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టి20ల్లో తను ఎంత ప్రమాదకరమో క్రిస్ గేల్ (48 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 11 సిక్సర్లు) మరోసారి నిరూపించాడు. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా... పూనకం వచ్చినోడిలా ఇంగ్లిష్ బౌలర్ల భరతం పట్టాడు. సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపిస్తూ టి20 ప్రపంచకప్‌లో అజేయ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. -
విండీస్ లక్ష్యం 192
బ్రిడ్జిటౌన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు విజయం వైపు పయనిస్తోంది. కుక్ సేన విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ మూడో రోజు ఆదివారం కడపటి వార్తలందేసరికి 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో బ్రేవో (15), శామ్యూల్స్ (12) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 42.1 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. టేలర్, హోల్డర్, పెరుమాళ్ మూడేసి వికెట్లు తీశారు. -
ప్రపంచ కప్: పొలార్డ్, బ్రావో అవుట్
సెయింట్ జాన్స్: వన్డే ప్రపంచ కప్‌లో పొల్గొనే వెస్టిండీస్ క్రికెట్ జట్టులో సీనియర్లు డ్వెన్ బ్రావో, కీరన్ పొలార్డ్‌లకు చోటు దక్కలేదు. విండీస్ సెలక్టర్లు సీనియర్లయిన వీరిద్దరినీ పక్కనబెట్టడం వివాదాస్పదమైంది. ప్రపంచ కప్‌నకు 15 మందితో కూడిన విండీస్ జట్టును ఆదివారం ప్రకటించారు. జాసన్ హోల్డర్, మార్టోన్ శామ్యూల్స్‌ను కెప్టెన్, వైఎస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ మెగా ఈవెంట్‌కు తాము అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని విండీస్ చీఫ్ సెలెక్టర్ క్లయివ్ లాయిడ్ అన్నాడు. జీతాల విషయంలో బ్రావో, పొలార్డ్.. విండీస్ బోర్డుల మధ్య గతంలో వివాదం ఏర్పడటం, ఇటీవల వీరిద్దరూ వన్డేల్లో అంతగా రాణించకపోవడంతో పక్కనబెట్టినట్టు భావిస్తున్నారు. వచ్చే నెల 14 నుంచి జరిగే ప్రపంచ కప్‌నకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. విండీస్ జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), మార్లోన్ శామ్యల్స్ (వైఎస్ కెప్టెన్), బెన్, డారెన్ బ్రావో, కార్టెర్, కాట్రెల్, క్రిస్టోఫర్ గేల్, సునీల్ నరైన్, రాందిన్, రోచ్, రసెల్, సమీ, సిమన్స్, డ్వెన్ స్మిత్, జెరోమీ టేలర్, -
విండీస్ విధ్వంసం
హామిల్టన్: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన వెస్టిండీస్ జట్టు... న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలో 203 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. సెడాన్ పార్క్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. వన్డేల్లో కరీబియన్ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఇప్పటిదాకా 1987లో శ్రీలంకపై చేసిన 360 పరుగులు అత్యధికంగా ఉంది. ఎడ్వర్డ్స్ (108 బంతుల్లో 123 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (81 బంతుల్లో 106; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేశారు. పావెల్ (44 బంతుల్లో 73; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), చార్లెస్ (45 బంతుల్లో 31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. బ్రేవో, ఎడ్వర్డ్స్ నాలుగో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 29.5 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. అండర్సన్ (24 బంతుల్లో 29; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. మిల్స్ (31 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఓ దశలో 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్ ఇక కోలుకోలేకపోయింది. మిల్లర్ 4, హోల్డర్, రస్సెల్ చెరో 2 వికెట్లు తీశారు. బ్రేవోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. క్యాచ్ పట్టాడు... లక్షాధికారి అయ్యాడు మ్యాచ్ సందర్భంగా ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన కివీస్ అభిమాని మైకేల్ మార్టన్ 83 వేల అమెరికా డాలర్లు (భారత కరెన్సీలో రూ. 51 లక్షల 50 వేలు) గెలుచుకున్నాడు. ఓ బీర్ కంపెనీ స్పాన్సర్షిప్ ప్రమోషన్లో భాగంగా ఈ అవకాశాన్ని కల్పించింది. గ్యాలరీలోని అభిమానుల మధ్య ఆరెంజ్ టీ షర్ట్ ధరించి ఉన్న వ్యక్తులెవరైనా ఇలాంటి క్యాచ్‌ను అందుకోవచ్చు. ఐదో వన్డేలో పావెల్ కొట్టిన భారీ సిక్సర్‌ను మార్టన్ అద్భుతంగా ఒంటి చేత్తో అందుకుని లక్షాధికారి అయ్యాడు. ‘దీన్ని నమ్మలేకపోతున్నా. మా నాన్న పక్కన కూర్చుని ఉన్నప్పుడు పక్కకు జంప్ చేస్తూ చేయి చాపా. బంతి చేతిలోకి వచ్చేసింది’ అని మార్టన్ వ్యాఖ్యానించాడు.