చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో రెండో బౌలర్‌గా | Piyush Chawla overtakes Dwayne Bravo to achieve this incredible milestone | Sakshi
Sakshi News home page

IPL 2024: చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో రెండో బౌలర్‌గా

Published Fri, May 3 2024 10:43 PM | Last Updated on Sat, May 4 2024 8:58 AM

Piyush Chawla overtakes Dwayne Bravo to achieve this incredible milestone

టీమిండియా మాజీ క్రికెట‌ర్‌, ముంబై ఇండియ‌న్స్ వెట‌ర‌న్ స్పిన్న‌ర్ పీయూష్ చావ్లా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన రెండో బౌల‌ర్‌గా పీయూష్ చావ్లా రికార్డుల‌కెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్‌ను ఔట్ చేసిన చావ్లా.. ఈ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 189 మ్యాచ్‌లు ఆడిన చావ్లా.. 184 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం డ్వెన్ బ్రావో(183) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును పీయూష్ బ్రేక్ చేశాడు. ఈ అరుదైన  ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ ఉన్నాడు.  

చాహ‌ల్ ఇప్ప‌టివ‌ర‌కు 155 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక   ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 169 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(70) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. మ‌నీష్ పాండే(42) ప‌రుగుల‌తో రాణించాడు.  ఇక ముంబై బౌల‌ర్ల‌లో తుషారా, బుమ్రా త‌లా 3 వికెట్లతో చెల‌రేగ‌గా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement