టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011.. టీమిండియా ట్రోఫీ గెలిచిన రెండు సందర్బాల్లోనూ జట్టులో భాగంగా ఉన్నాడు స్పిన్నర్ పీయూశ్ చావ్లా. ఏకంగా రెండుసార్లు ట్రోఫీని ముద్దాడే అదృష్టం దక్కించుకున్నాడు.
2006లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ యూపీ స్పిన్నర్ తన కెరీర్ మొత్తంలో 3 టెస్టులు, 25 వన్డేలు, ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 7, 32, 4 వికెట్లు తీశాడు.
అయితే, ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్‌కు ఐపీఎల్‌లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్‌లో 192 మ్యాచ్‌లు ఆడిన పీయూశ్ 192 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున 11 మ్యాచ్‌లలో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ టూర్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ బృందంతో కలిసి పీయూశ్ చావ్లా హైదరాబాద్‌లోని సాక్షి మీడియా ఆఫీస్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా ట్రోఫీని ఆవిష్కరించి టీమిండియాకు విష్ చేశాడు.
ఈ క్రమంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలియజేశాడు. ‘‘రోహిత్ శర్మ నా ఆల్‌టైమ్ ఫేవరెట్. తను నాకు స్నేహితుడు. ఐపీఎల్-2024లో ఆఖరి మ్యాచ్ సందర్భంగా అతడు ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈసారి వరల్డ్‌కప్‌లో రోహిత్ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పీయూశ్ చావ్లా పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ చేసిన హిట్‌మ్యాన్.. లీగ్ దశలో ఆఖరిదైన లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ అర్ధ శతకం(38 బంతుల్లో 68)తో సత్తా చాటాడు.
Comments
Please login to add a commentAdd a comment