‘‘నాకు తెలిసి అతడు పూర్తిగా అలసిపోయాడు. టీమిండియా కెప్టెన్‌గా, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిగా విరామం లేని షెడ్యూల్‌తో బిజీగా గడుపుతున్నాడు.
అతడికి కాస్త విశ్రాంతి అవసరం. బ్రేక్ తీసుకుని తిరిగి వస్తే తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్‌కు ముందు అతడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు గమనించాను.
వెన్నునొప్పితో బాధపడుతున్నట్లుగా అనిపించింది. అతడు పూర్తి ఫిట్‌గా, సంతోషంగా ఉంటేనే ముంబైకి, టీమిండియాకు శుభసూచకం. విశ్రాంతి లేకుండా ఆడితే మాత్రం ఇబ్బందులు తప్పవు.
నిజానికి బ్యాటింగ్ పరంగా తనకు సమస్య లేదు. బ్రేక్ మాత్రం అవసరం’’ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ క్లార్క్ అన్నాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
అదొక్కటి తప్ప
కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆరంభంలో బాగానే ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సునామీ సెంచరీతో విరుచుకుపడ్డాడు కూడా!
కానీ గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లలో రోహిత్ సాధించిన పరుగులు కేవలం 33. ఇందులో నాలుగుసార్లు అతడు సింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశాడు.
మరోసారి వైఫల్యం
ఇక సన్‌రైజర్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ రోహిత్ వైఫల్యం కొనసాగింది. ఐదు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు రోహిత్. టైమింగ్ మిస్ అయి వికెట్ పారేసుకున్నాడు.
అలా అయితే తిరిగి ఫామ్‌లోకి
ఈ నేపథ్యంలో మైకేల్ క్లార్క్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ఓవైపు టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో జట్టు ఎంపిక, కూర్పు, ప్రెస్‌మీట్లు.. మరోవైపు ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లతో రోహిత్ అలసిపోయాడని పేర్కొన్నాడు.
అందుకే కాస్త బ్రేక్ ఇస్తే తిరిగి పుంజుకోగలడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆడిన 12 మ్యాచ్‌లలో కలిపి 330 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment