ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మరోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో గుయానా అమెజాన్ వారియర్స్ జట్టుపై గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫలితంగా ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను చేజిక్కించుకుంది.
తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నైట్‌రైడర్స్ ఓపెనర్లు దినేశ్ రామ్‌దిన్(24), బ్రెండన్ మెకల్లమ్(39)లు మంచి ఆరంభాన్నివ్వగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు కొలిన్ మున్రో(68; 39 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టు టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment