Colin Munro
-
డస్సెన్, మున్రో సిక్సర్ల వర్షం
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో టొరంటో నేషనల్స్ బోణీ కొట్టింది. నిన్న (జులై 25) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో వాంకోవర్ నైట్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాంకోవర్.. జునైద్ సిద్దిఖీ (3.3-0-24-4), రోహిద్ ఖాన్ (4-0-29-2), సాద్ బిన్ జాఫర్ (4-0-11-2), బెహ్రెన్‌డార్ఫ్ (4-0-20-1) ధాటికి 19.3 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. వాంకోవర్ ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ (23), మునీర్ అహ్మద్ (22) మాత్రమే అతి కష్టం మీద 20 పరుగుల మార్కును దాట గలిగారు. కెప్టెన్ ఉస్మాన్ ఖ్వాజా 3, హర్ష్ థాకెర్ 0, నితీశ్ కుమార్ 0, ప్రిటోరియస్ 16, రిప్పన్ 1, సందీప్ లామిచ్చేన్ 15, ఆమిర్ 0, వాన్ మీకెరెన్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టొరొంటో.. కొలిన్ మున్రో (44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ డెర్ డస్సెన్ (31 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో 14.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉన్ముక్త్ చంద్ 23 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వాంకోవర్ బౌలర్లలో వాన్ మీకెరెన్, సందీప్ లామిచ్చేన్ తలో వికెట్ పడగొట్టారు. ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో మాంట్రియల్ టైగర్స్, బంగ్లా టైగర్స్ పోటీ పడతాయి. -
T20 WC 2024: అతడిని వదిలేశారు... కివీస్‌కు తగినశాస్తి!
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్-2024 సెమీస్ ఫేవరెట్లలో ఒకటైన కివీస్ టీమ్ కనీసం గ్రూప్ దశ దాటకుండానే.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.గ్రూప్ ‘సి’లో భాగంగా గురువారం జరిగిన పోరులో వెస్టిండీస్ చేతిలో 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయింది. ఫలితంగా ‘హ్యాట్రిక్’ విజయాలతో కరేబియన్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించింది. ఈ గెలుపుతో విండీస్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.ట్రినిడాడ్ వేదికగా టాస్ నెగ్గిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఆర్డర్లో బ్రాండన్ కింగ్ (9), చార్లెస్ (0), నికోలస్ పూరన్ (12 బంతుల్లో 17; 3 ఫోర్లు), చేజ్ (0), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (1) ఇలా ఐదో వరుస బ్యాటర్దాకా అంతా చేతులెత్తేశారు.దీంతో 30 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన ఆతిథ్య జట్టును.. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్ (39 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరోచిత మెరుపులతో నిలబెట్టాడు. 33 బంతుల్లో ఫిఫ్టీతో అతను తన కెరీర్ బెస్ట్ స్కోరు సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లు బౌల్ట్, సౌతీ, ఫెర్గూసన్ తలా 2 వికెట్లు తీశారు.అనంతరం కష్టమైన లక్ష్యం కాకపోయినా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ (33 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, ఫిన్ అలెన్ (23 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), సాన్‌ట్నర్ (12 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.విండీస్ పేసర్ అల్జారి జోసెఫ్ (4/19), స్పిన్నర్ గుడకేశ్ మోతి (3/25) కివీస్‌ను దెబ్బ తీశారు. ఇక గ్రూప్-సిలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కివీస్ ఇంకా పాయింట్ల ఖాతానే తెరువలేదు. మరోవైపు.. ఇదే గ్రూపులో ఉన్న అఫ్గనిస్తాన్ పపువా న్యూగినియాను ఓడించి సూపర్-8 బెర్తును ఖరారు చేసుకుంది.ఫలితంగా 2021 రన్నరప్ న్యూజిలాండ్ ఈసారి లీగ్ దశ నుంచే ఇంటిముఖం పట్టడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మిచెల్ మెక్లెన్‌గన్ కివీస్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరేబియన్ దీవుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న కొలిన్ మున్రోను వెనక్కి పిలిచి.. టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.‘‘కరేబియన్ గడ్డపై టీ20లలో 2146 పరుగులు సాధించిన ఆటగాడిని వాళ్లు పక్కనపెట్టారు. అతడు ఇప్పుడు న్యూజిలాండ్‌లో ఏం చేస్తున్నాడు? అని మాత్రమే మిమ్మల్ని ప్రశ్నించగలను.నాకు తెలిసి 2014లో బంగ్లాదేశ్‌లోని వరల్డ్‌కప్ తర్వాత ఇదే అత్యంత ప్రపంచకప్ టోర్నీ’’ అని మిచెల్ మెక్లెన్‌గన్ కివీస్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈఎస్పీక్రిక్ఇన్పోతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.కాగా 37 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ కొలిన్ మున్రో.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో గత కొన్నేళ్లుగా ఆడుతున్నాడు. ట్రింబాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు మొత్తంగా 79 మ్యాచ్‌లలో కలిపి 2353 పరుగులు సాధించాడు.బిగ్‌బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ సూపర్ లీగ్‌లోనూ పరుగుల వరద పారించాడు. న్యూజిలాండ్ తరఫున మొత్తం 57 వన్డేలు, 65 టీ20లు ఆడిన అతడు ఆయా ఫార్మాట్లలో 1271, 1724 పరుగులు చేశాడు. ఆడిన ఒకే ఒక టెస్టులో 15 రన్స్ సాధించాడు.ఈ క్రమంలో 2020లో కివీస్ తరఫున ఆఖరి టీ20 ఆడిన మున్రో గత నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా ఈ మెగా టోర్నీకి అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. -
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ విధ్వంంసకర ఓపెనర్ కోలిన్ మున్రో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2024 కివీస్ జట్టులో చోటు ఆశించిన మున్రోకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో జట్టులో చోటు దక్కకపోవడంతోనే మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. "అత్యున్నత స్ధాయిలో న్యూజిలాండ్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అన్ని ఫార్మాట్లలోనూ బ్లాక్ క్యాప్స్ జెర్సీని నేను ధరించాను. అది నేను నా జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం. మళ్లీ న్యూజిలాండ్ తరపున ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ టీ20 వరల్డ్‌కప్‌లో జట్టులో నా పేరు లేదు. కాబట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని భావించానని మున్రో పేర్కొన్నట్లు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.న్యూజిలాండ్ క్రికెట్లో మున్రోకు అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంటర్ననేషనల్ క్రికెట్లో మున్రో కివీస్ తరపున 100కు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లలో న్యూజిలాండ్ జట్టులో మున్రో భాగమయ్యాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మూడు పైగా సెంచరీలు చేసిన ఏడు మంది ఆటగాళ్లలో మున్రో ఒకడిగా కొనసాగుతున్నాడు. 2012 లో అంతర్జాతీయ క్రికెటలో అడుగుపెట్టిన మున్రో. . తన కెరీర్లో 57 వన్డేలు, 65 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 1271 పరుగులు, టీ20ల్లో 1724 పరుగులు చేశాడు. అదే విధంగా ఎకైక టెస్టులో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20ల్లో 47 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు అతడి పేరిట ఉంది. 2018లో వెస్టిండీస్ పై ఈ ఘనత సాధించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మున్రో.. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగననున్నాడు. -
కొలిన్ మున్రో విధ్వంసం.. ఉస్మాన్ ఖాన్ మెరుపు శతకం వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య ఇవాళ (మార్చి 10) జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 460 పరుగులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ 228 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్ చివరి బంతికి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ చేసిన స్కోర్ సీజన్ మొత్తానికే అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. పీఎస్ఎల్ చరిత్రలో ఇస్లామాబాద్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇస్లామాబాద్.. ప్లే ఆఫ్స్ బెర్త్‌ను సైతం ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ ఇదివరకే నాకౌట్ దశకు క్వాలిఫై కాగా.. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు ఉస్మాన్ కేవలం 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15 బౌండరీలు, 3 సిక్సర్లు బాదాడు. ఉస్మాన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. మార్చి 3న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఉస్మాన్ సెంచరీలు చేసిన ఈ రెండు సందర్భాల్లో నాటౌట్‌గా మిగిలాడు. ఉస్మాన్‌తో పాటు జాన్సన్ చార్లెస్ (18 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), యాసిర్ ఖాన్ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మున్రో విధ్వంసం.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. కొలిన్ మున్రో (40 బంతుల్లో 84; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (31 బంతుల్లో 54; 6 ఫోర్, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి విజయం సాధించింది. ఇమాద్ వసీం (13 బంతుల్లో 30) చివరి రెండు బంతులకు సిక్సర్, బౌండరీ బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
సూపర్ క్యాచ్ పట్టిన బాల్ బాయ్.. హగ్ చేసుకున్న స్టార్ బ్యాటర్! వీడియో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం రావల్పిండి వేదికగా పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడ్డాయి. ఈ హైలోల్టేజ్ పోరులో పెషావర్‌ను 29 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ చిత్తు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు, కివీస్ స్టార్ కోలిన్ మున్రో ఓ బాల్ బాయ్‌ను ఎత్తుకున్నాడు. ఏం జరిగిందంటే? పెషావర్ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లో అమీర్ జమాల్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ అవతల ఉన్న ఓ బాల్ బాయ్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది గమనించిన మున్రో అతడి దగ్గరకు వెళ్లి బంతిని ఎలా పట్టుకోవాలో కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లో పెషావర్ బ్యాటర్ ఆరిఫ్ యూకుడ్ అదే పొజిషన్లో సిక్సర్ బాదాడు. ఈ సారి మాత్రం బాల్‌బాయ్ ఎటువంటి తప్పిదం చేయలేదు. అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన మున్రో వెంటనే అతడి దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2024: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్!? From drop to dazzling catch! 😲 Ball boy redeems himself in #IUvPZ match and gets a warm hug from Colin Munro. #HBLPSL9 | #KhulKeKhel pic.twitter.com/ncTKJ0xPfr — PakistanSuperLeague (@thePSLt20) March 4, 2024 -
న్యూజిలాండ్ ఓపెనర్ ఊచకోత.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ఇస్లామాబాద్ యునైటెడ్ రెండో విజయం నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇస్లామాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కరాచీ బ్యాటర్లలో కిరాన్ పొలార్డ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో ఇమాడ్ వసీం, నసీం షా, సల్మాన్, హునైన్ షా తలా వికెట్ సాధించారు. మున్రో ఊచకోత.. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో కొలిన్ మున్రో విధ్వంసం సృష్టించాడు. 47 బంతులు ఎదుర్కొన్న మున్రో.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేశాడు. అతడితో పాటు అలెక్స్ హేల్స్(47), అఘా సల్మాన్(25) పరుగులతో రాణించారు. చదవండి: BAN vs SL: హసరంగాపై వేటు.. శ్రీలంక కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ -
ఇది కదా క్రీడా స్పూర్తి అంటే? రనౌట్ అయినా కూడా వెనుక్కి! వీడియో
ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం షార్జా వేదికగా డెసర్ట్ వైపర్స్, షార్జా వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ కోలిన్ మున్రో మాత్రం అభిమానులు మనసును గెలుచకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. రనౌట్ రూపంలో వికెట్ పొందే అవకాశం ఉన్నప్పటకీ మున్రో మాత్రం తన నిర్ణయంతో అందరని ఆశ్చర్యపరిచాడు. ఏం జరిగిందంటే? షార్జా వారియర్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో జో డెన్లీ స్ట్రైట్‌గా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మార్టిన్ గప్టిల్‌కు బలంగా తాకి బౌలర్ చేతికి వెళ్లింది. బంతి తగిలిన వెంటనే గప్టిల్ నొప్పితో కిందపడిపోయాడు. అప్పటికే గప్టిల్ క్రీజు బయట ఉండడం గమనించిన షాదాబ్ ఖాన్.. స్టంప్స్‌ను పడగొట్టి రనౌట్‌కు అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా ఔట్ ఇచ్చేశాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. మాన్రో షాదాబ్తో మాట్లాడి రనౌట్ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. ప్టిల్కు తన ఇన్నింగ్స్‌ను కొనసాగించే అవకాశాన్ని మున్రో కల్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మున్రోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా గప్టిల్, మున్రో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నసంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో డెసర్ట్ వైపర్స్ ఓటమి పాలైంది. చదవండి: అతి జాగ్రత్తే కొంపముంచింది.. రోహిత్ కూడా సచిన్‌లా ఆడాలి: మాజీ క్రికెటర్ Being a good sport goes above being good at the sport. Hats off to the @TheDesertVipers skipper for playing a fair game 🫡🫡#DPWorldILT20 #AllInForCricket #DVvSW pic.twitter.com/IotodgnKs7 — International League T20 (@ILT20Official) January 28, 2024 -
కొలిన్ మున్రో ఊచకోత.. తృటిలో సెంచరీ మిస్.. ఎందుకంటే?
బిగ్ బాష్ లీగ్ 2023 సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గురువారం (డిసెంబర్ 7) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై బ్రిస్బేన్ హీట్ 103 పరుగుల భారీ విజయం సాధించింది. బ్రిస్బేన్ గెలుపులో కొలిన్ మున్రో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న మున్రో.. 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయంగా 99 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో మున్రోకు సెంచరీ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. మ్యాక్స్ బ్రయాంట్ (7 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) కారణంగా ఆ అవకాశం చేజారింది. ఆఖరి ఓవర్ మూడో బంతికి సింగిల్ తీశాక మున్రో స్కోర్ 99కి చేరింది. అయితే ఆతర్వాత మూడు బంతులను బ్రయాంట్ బౌండరీలుగా తరలించడంతో మున్రోకు సెంచరీ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్.. మున్రో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (28), లబూషేన్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మెల్బోర్న్ బౌలర్లు జోయెల్ పారిస్, మ్యాక్స్‌వెల్, కౌల్డర్‌నైల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ను బ్రిస్బేన్ బౌలర్లు 111 పరుగులకే (15.1 ఓవర్లలో) కుప్పకూల్చారు. మిచెల్ స్వెప్సన్ 3, మైఖేల్ నెసర్, జేవియర్ బార్ట్లెట్ చెరో 2 వికెట్లు, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కున్హేమన్, పాల్ వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో హిల్టన్ కార్ట్‌వైట్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
చెలరేగిన శ్రీలంక వికెట్‌కీపర్.. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో వీరవిహారం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గయనా అమెజాన్ వారియర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. సెయింట్ లూసియా కింగ్స్.. వారియర్స్‌కు తొలి ఓటమి రుచి చూపించింది. భారతకాలమానం ప్రకారం వారియర్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 15) ఉదయం జరిగిన మ్యాచ్‌లో లూసియా కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక వికెట్‌కీపర్ భానుక రాజపక్స (49 బంతుల్లో 86; 9 ఫోర్లు, 5 సిక్సర్లు).. కొలిన్ మున్రో (43 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో లూసియా కింగ్స్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పాక్ ఆటగాడు ఆజమ్ ఖాన్ (25 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షాయ్ హోప్ (35 బంతుల్లో 38; 5 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సైమ్ అయూబ్ 16, మాథ్యూ నందు 3, హెట్‌మైర్ 19 నాటౌట్, రొమారియో షెపర్డ్ 10 నాటౌట్, కీమో పాల్ 19 పరుగులు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ ఫోర్డ్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకన్నారు. మాథ్యూ నందు రనౌటయ్యాడు. అనంతరం 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. రాజపక్స (86), మున్రో (55) రాణించడంతో 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (1) విఫలం కాగా.. సీన్ విలియమ్స్ (8), సికందర్ రజా (12) అజేయంగా నిలిచారు. అమెజాన్ వారియర్స్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, కీమో పాల్, కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ గెలుపుతో లూసియా కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది. గయానా వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. -
మున్రో మెరుపు ఇన్నింగ్స్ వృధా.. తుక్కు రేగ్గొట్టిన రసెల్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 11) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్.. ఓపెనర్ కొలిన్ మున్రో (51 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన అజేయ అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. మార్క్ దెయాల్ (45 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో, ఆఖర్లో ఆండ్రీ రసెల్ (13 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నైట్‌రైడర్స్ మరో 7 బంతులు మిగిలుండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. మున్రో మెరుపు ఇన్నింగ్స్ వృధా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్‌ను మున్రో బాధ్యతాయుతమైన అజేయ అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. అతను చివరి వరకు క్రీజ్‌లో ఉండటంతో లూసియా కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా (167/3) చేయగలిగింది. మున్రోకు రోస్టన్ ఛేజ్ (31 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), సీన్ విలియమ్స్ (17 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) సహకరించగా.. జాన్సన్ చార్లెస్ (13), సికందర్ రజా (8) విఫలమయ్యారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో జేడన్ సీల్స్, సునీల్ నరైన్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. రాణించిన మార్క్ దెయాల్, రఫ్ఫాడించిన రసెల్ 168 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ ఓపెనర్ మార్క్ దెయాల్, ఆఖర్లో ఆండ్రీ రసెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించడంతో 18.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో మార్టిన్ గప్తిల్ (16), నికోలస్ పూరన్ (15) విఫలం కాగా.. దెయాల్, రసెల్‌తో పాటు లోర్కాన్ టక్కర్ (38 నాటౌట్) రాణించాడు. లూసియా బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
చెలరేగిన కొలిన్ మున్రో.. చేతులెత్తేసిన మలాన్, హేల్స్, రూట్
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. కొలిన్ మున్రో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మున్రో మినహా రాకెట్స్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. రాకెట్స్ టీమ్‌లో డేవిడ్ మలాన్ (10), అలెక్స్ హేల్స్ (4), జో రూట్ (14), డేనియల్ సామ్స్ (17) లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో డేవిడ్ విల్లే, జేక్ బాల్, వాన్ డర్ మెర్వ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. రాణించిన జో క్లార్క్.. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్‌ఫైర్.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జో క్లార్క్ (54), కెప్టెన్ టామ్ ఎబెల్ (32) వెల్ష్ఫైర్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వెల్ష్ ఫైర్ స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో (9 బంతుల్లో 3), గ్లెన్ ఫిలప్స్ (12) విఫలమయ్యారు. స్టెఫెన్ ఎస్కినాజీ (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. రాకెట్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్ 2, జాన్ టర్నర్, ఐష్ సోధి తలో వికెట్ పడగొట్టారు. -
మున్రో విధ్వంసం.. చెలరేగిన ఆజమ్ ఖాన్, ఆఖర్లో ఫహీమ్ మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో లాహోర్ ఖలందర్స్ తర్వాత ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన రెండో జట్టుగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్‌పై గెలుపుతో ఖలందర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్‌పై ఇస్లామాబాద్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. మహ్మద్ నవాజ్ (44 బంతుల్లో 52; 6 ఫోర్లు), నజీబుల్లా (34 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆఖర్లో ఉమర్ అక్మల్ (14 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో గ్లాడియేటర్స్ ఈ స్కోర్ సాధించగలిగింది. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ 3 వికెట్లు పడగొట్టగా.. ఫహీమ్ అష్రాఫ్ 2, రయీస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కొలిన్ మున్రో.. 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేయగా.. ఆజమ్ ఖాన్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (31 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) హ్యాట్రిక్ బౌండరీలు బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో ఉమైద్ ఆసిఫ్ 3, మహ్మద్ నవాజ్ 2, నసీం షా, నవీన్ ఉల్ హక్, ఇఫ్తికార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో ఇవాళ జరిగే మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్.. కరాచీ కింగ్స్‌తో తలపడనుంది. -
కొలిన్ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 27వ సెంచరీ
Colin Munro Smash Century In BBL 2021.. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్ ఓపెనర్ కొలిన్ మున్రో సెంచరీతో చెలరేగాడు. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మున్రో 73 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 114 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో కొలిన్ మున్రోది 27వ సెంచరీ. అతని ధాటికి పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 195 పరుగులు భారీ స్కోరు చేసింది. మరో ఓపెనర్ బెన్కాఫ్ట్ర్ 45 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: BBL 2021: సూపర్ క్యాచ్ పట్టాననే సంతోషం లేకుండా చేశారు అనంతరం బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 17.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటై 49 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. మాథ్యూ షార్ట్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ.. మిగతావారు విఫలమయ్యారు. జాసన్ బెండార్ఫ్ , ఆండ్రూ టై చెరో 3 వికెట్లు తీశారు. చదవండి: Big Bash League 2021: కసిగా 213 పరుగులు కొట్టారు.. ప్రత్యర్థి జట్టు మాత్రం That is absolutely MASSIVE from Colin Munro. 114no from 73 deliveries 👏 #BBL11 pic.twitter.com/4t9fIxBC3s — KFC Big Bash League (@BBL) December 11, 2021 -
తాహీర్ ఓవరాక్షన్ చూడలేకపోతున్నా!
రావల్పిండి: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన లెగ్ బ్రేక్‌లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే తాహీర్.. వికెట్ తీసిన సందర్భంలో సంబరాలు చేసుకోవడం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. వికెట్ తీస్తే చాలు రెండు చేతులను చాచుకుంటూ మైదానంలో కలియదిరుగుతాడు. అయితే తాహీర్ ఈ తరహా సెలబ్రేషన్స్‌ను చూడలేకపోతున్నామంటున్నాడు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కొలిన్ మున్రో. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా ఆదివారం ముల్తాన్ సుల్తాన్స్- ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్ తరఫున మున్రో ఆడుతుండగా, ముల్తాన్ సుల్తాన్స్ తరఫున తాహీర్ ఆడుతున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో మున్రోను ఔట్ చేసిన తర్వాత తాహీర్ తన సెలబ్రేషన్స్‌కు పని చెప్పాడు. ఈ క్రమంలోనే తాహీర్‌కు మున్రోకు మాటల యుద్ధం జరిగింది. పెవిలియన్‌కు వెళుతూ మున్రో ఏదో అనగా, దానికి తాహీర్ రిప్లే ఇచ్చాడు. అయితే దీనిపై పాకిస్తాన్ జర్నలిస్ట్ సాజ్ సాదిక్.. మున్రోను వివరణ కోరగా తాహీర్ ఓవరాక్షన్ చూడలేకపోతున్నామనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ‘ నేను తాహీర్ సెలబ్రేషన్స్ చూడలేకపోతున్నా. ఆ సెలబ్రేషన్స్ చూసి చూసి అలసిపోయా. సర్కస్‌లో చేసే ఫీట్లా ఉంటుంది అతని సెలబ్రేషన్. అది సరైన సెలబ్రేషన్స్ కాదు. అతను నాతో వాగ్వాదానికి దిగిన క్రమంలో ఎలా ప్రవర్తించాడో మీరు చూశారు కదా. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం’ అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) విజయం సాధించింది. ఇస్లామాబాద్ నిర్దేశించిన 92 పరుగుల టార్గెట్‌ను ముల్తాన్ సుల్తాన్స్ వికెట్ కోల్పోయి ఛేదించింది. జేమ్స్ విన్సే(61 నాటౌట్) ముల్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ముల్తాన్ సుల్తాన్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ ప్లేఆఫ్‌కు చేరడం ఇదే తొలిసారి. కాగా, ఈ సీజన్లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టు కూడా సుల్తాన్సే. -
కోహ్లి మెరుపు ఫీల్డింగ్.. మున్రో బ్యాడ్ లక్
వెల్లింగ్టన్: పరుగుల మెషీన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్‌తోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. అద్భుతమైన క్యాచ్‌లతో పాటు ఫీల్డింగ్‌లో పాదరసంలా కదులుతున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో నాల్గో టీ20లో కోహ్లి చేసిన రనౌట్ ఔరా అనిపించింది. సిక్స్‌లు, ఫోర్లతో విజృంభించి ఆడుతున్న న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మున్రోను కోహ్లి రనౌట్ చేసిన తీరు అబ్బురపరిచింది. శివం దూబే వేసిన 12 ఓవర్ నాల్గో బంతిని కవర్స్ మీదుగా షాట్ కొట్టాడు మున్రో. అయితే బౌండరీ లైన్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్ బంతిని అందుకున్న మరుక్షణమే షార్ట్ కవర్స్‌లో ఉన్న కోహ్లికి అందించాడు. (ఇక్కడ చదవండి: అజామ్ తర్వాత రాహులే..!) బంతిని అందుకున్న కోహ్లి అంతే వేగంతో స్ట్రైకింగ్ ఎండ్‌లోకి విసిరి వికెట్లను గిరటేశాడు. అప్పటికి ఒక పరుగు తీసి మరో పరుగు కోసం యత్నిస్తున్న మున్రో రనౌట్ అయ్యాడు. సాధారణంగా అయితే దానికి రెండు పరుగులు వచ్చేవి. కానీ ఠాకూర్, కోహ్లి ఎఫర్ట్‌తో అది పరుగు రాగా, న్యూజిలాండ్ కీలక వికెట్‌ను కోల్పోయింది. రెండు పరుగు తీసే క్రమంలో మున్రో కాస్త రిలాక్స్ కావడం కూడా భారత్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. ఇది నిజంగా మున్రో బ్యాడ్ లక్. 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు సాధించి మున్రో రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై టామ్ బ్రూస్ డకౌట్ అయ్యాడు. చహల్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు గప్టిల్(4) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. This is called commitment with your fielding 🔥 Gajab ka throw and kaam tamaam#INDvsNZ pic.twitter.com/s4S46BJNFf — AkshayManish (@AkshayManish2) January 31, 2020 -
మిస్ ఫీల్డ్.. హార్దిక్ పాండ్యా అసహనం
-
నెత్తికొట్టుకున్న పాండ్యా!
హామిల్టన్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ల మిస్ ఫీల్డ్‌పై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. కివీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఓ వైపు ఆ జట్టు బ్యాట్స్‌మెన్ దాటిగా ఆడుతుండగా.. మరోవైపు భారత ఫీల్డర్లు క్యాచ్‌లను చేజార్చి మంచి అవకాశాలను వదులుకున్నారు. హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్లో తొలి బంతిని మున్రో భారీ షాట్ ఆడగా.. ఖలీల్ సులువైన క్యాచ్‌ను చేజార్చాడు. మూడో బంతిని మళ్లీ మున్రో షాట్ ఆడగా శంకర్ మిస్ ఫీల్డ్‌తో బంతి బౌండరీకి వెళ్లింది. ఆ మరుసటి బంతినే మున్రో భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ వెంటనే మున్రో మరో క్యాచ్ ఇవ్వగా.. థర్డ్ మ్యాన్‌గా ఉన్న కుల్దీప్ అందుకోలేకపోయాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన హార్దిక్ నెత్తిని బాదుకున్నాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. భారత ఆటగాళ్ల తప్పిదాలతో మొత్తం ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. -
నైట్‌రైడర్స్‌దే టైటిల్
ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మరోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో గుయానా అమెజాన్ వారియర్స్ జట్టుపై గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫలితంగా ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను చేజిక్కించుకుంది. తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నైట్‌రైడర్స్ ఓపెనర్లు దినేశ్ రామ్‌దిన్(24), బ్రెండన్ మెకల్లమ్(39)లు మంచి ఆరంభాన్నివ్వగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు కొలిన్ మున్రో(68; 39 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టు టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. -
టీ20ల్లో రోహిత్ అరుదైన ఘనత
బ్రిస్టల్ : టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్లో మరో మైలురాయి అందుకున్నాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో రోహిత్ సెంచరీతో భారత్ 7 వికెట్లతో నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సెంచరీతో రోహిత్ టీ20ల్లో మూడు శతకాలు చేసిన రెండో ఆటగాడిగా కొలిన్ మున్రో (న్యూజిలాండ్) రికార్డును సమం చేశాడు. 2015లో దక్షిణాఫ్రికాతో తొలి సెంచరీ సాధించిన ఈ హిట్ మ్యాన్.. గతేడాది శ్రీలంకపై మరో సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌లో 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఓవరాల్ టీ20ల్లో (లీగ్స్ కలుపుకొని) రోహిత్‌కు ఇది 5వ సెంచరీ కావడం విశేషం. రెండో ఆటగాడిగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో ఘనతను అందుకున్నాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా ఈ ముంబై క్రికెటర్ గుర్తింపు పొందాడు. ఈ సిరీస్‌లోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఘనతను అందుకున్న విషయం తెలిసిందే. కోహ్లి 56 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకొవడంతో వేగంగా ఈ మైలురాయి అందుకున్న క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో ఓవరాల్‌గా రోహిత్ ఐదో స్థానంలో నిలవగా.. అతని కన్న ముందు మార్టిన్ గప్టిల్, మెకల్లమ్, షోయబ్ మాలిక్, కోహ్లిలున్నారు. అది నాకు తెలుసు.. ఇక ఈ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు అందుకున్న రోహిత్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ ఇది నాలో ఉన్న ప్రత్యేకమైన శైలితో కూడిన ఆట. ఇన్నింగ్స్ ఆరంభంలో పరిస్థితులను అర్థం చేసుకోవడం ముఖ్యం. మేం బంతిని ఎదుర్కొన్నప్పుడే పిచ్ షాట్ బౌండరీలకు సహకరిస్తుందని గ్రహించాం. భారీ షాట్లు ఆడటానికి సరైన ప్రణాళిక రూపొందించి అమలు చేశాం. కొద్ది సేపు కుదురుకుంటే చెలరేగొచ్చన్న విషం నాకు తెలుసు. అదే చేశాను’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ కోహ్లి, రోహిత్‌లు 57 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. -
ఒకేసారి 11 స్థానాలు ఎగబాకి...
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ 20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కొలిన్ మున్రో టాప్ ప్లేస్‌ను ఆక్రమించాడు. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ 20లో మున్రో(104) శతకం సాధించాడు. 53 బంతుల్లో 10 సిక్సర్లు, 3 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు. దాంతో టీ 20ల్లో మూడు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా మున్రో రికార్డు సాధించాడు. ఇదిలా ఉంచితే. టీ 20 ర్యాంకింగ్స్‌లో సైతం ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. తొలిసారి అతని కెరీర్లో టాప్కు చేరుకున్న మున్రో ఏకంగా ఒకేసారి 11 స్థానాలు ఎగబాకడం ఇక్కడ విశేషం. మరొకవైపు న్యూజిలాండ్ బౌలర్ ఇష్ సోథీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఒకేసారి తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్కు చేరుకున్నాడు. ఫలితంగా 2009, 2010 తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన ఆటగాళ్లు టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానం దక్కించుకోవడం ఇదే తొలిసారి. గతంలో బ్రెండన్ మెకల్లమ్, డానియల్ వెటోరీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానాల్లో్ నిలిచారు. ఆపై ఇంతకాలానికి వారి సరసన మున్రో, సోథీలు నిలిచారు. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమైన కోహ్లి 776 పాయింట్లతో ప్రస్తుతం మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరో భారత బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ మాత్రమే టాప్-10లో నిలిచాడు. ప్రస్తుతం రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ప్రధాన పేసర్ బూమ్రా ఒక ర్యాంకు కోల్పోయి నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మున్రో మెరుపులు...
మౌంట్ మాంగనీ: విండీస్ బౌలర్ల భరతం పట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మున్రో (53 బంతుల్లో 104; 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యధికంగా మూడు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో మున్రో బంగ్లాదేశ్‌పై (101), భారత్ (109 నాటౌట్)పై ఒక్కో సెంచరీ చేశాడు. మున్రో మెరుపులకు తోడు బౌలర్లు సౌతీ (3/21), బౌల్ట్ (2/29), సోధి (2/25) రాణింపుతో వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. రెండో టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇంతకుముందు టెస్టు, వన్డే సిరీస్‌లు కూడా న్యూజిలాండ్ ఖాతాలోకే వెళ్లడం విశేషం. దాంతో 1999–2000 తర్వాత తొలిసారి విండీస్ జట్టు న్యూజిలాండ్ గడ్డపై ఒక్క విజయం నమోదు చేయకుండానే వెనుదిరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు సాధించి టి20ల్లో తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. మున్రో, గప్టిల్ (38 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 11.1 ఓవర్లలో 136 పరుగులు జోడించడం విశేషం. గప్టిల్ అవుటయ్యాక మిగతా సహచరుల సహకారంతో మున్రో కదంతొక్కాడు. 47 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్న మున్రో ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు కివీస్ బౌలర్ల ధాటికి 16.3 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. టిమ్ సౌతీ తొలి ఓవర్లోనే విండీస్ ఓపెనర్లు క్రిస్‌గేల్, వాల్టన్ల ను డకౌట్ చేశాడు. ఫ్లెచర్ (32బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా మిగతా వారంతా విఫలమయ్యారు. ►3 అంతర్జాతీయ టి20ల్లో మున్రో సెంచరీలు. క్రిస్ గేల్, లెవిస్ (వెస్టిండీస్), మెకల్లమ్ (న్యూజిలాండ్), రోహిత్ శర్మ (భారత్) రెండేసి సాధించారు. ►1 ఈ సిరీస్ విజయంతో పాకిస్తాన్‌ను (124 పాయింట్లు) వెనక్కి నెట్టి న్యూజిలాండ్ 126 పాయింట్లతో టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ 121 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. -
మూడు సెంచరీలతో ప్రపంచ రికార్డు
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మున్రో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వెస్డిండీస్‌తో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో శతకం బాదాడు. మున్రో వీరవిహారం చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌కు టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. 104 పరుగులు చేసిన మున్రో చివరి ఓవర్ మొదటి బంతికి అవుటయ్యాడు. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు వాల్టన్, క్రిస్ గేల్ డకౌటయ్యారు. గతేడాది జనవరి 6న బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో మున్రో (101) తొలి సెంచరీ కొట్టాడు. నవంబర్ 4న రాజ్‌కోట్‌లో భారత్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 109 పరుగులతో అజేయంగా నిలిచి రెండో శతకాన్ని సాధించాడు. తాజాగా మూడో సెంచరీ చేసి ఇంటర్నేషనల్ టి20 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. -
అక్కడే భారత్ నడ్డి విరిగింది: మున్రో
రాజ్‌కోట్ : తొలి టీ20లో కడదాకా టీమిండియాతో పోరాడినా నెగ్గలేదన్న కసి.. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టులో రాజ్ కోట్లో జరిగిన రెండో టీ20లో స్పష్టంగా కనిపించింది. శనివారం జరిగిన ఆ మ్యాచ్‌లో కివీస్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ కొలిన్ మున్రో(58 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) భారత్ ఓటమికి అక్కడ బీజం పడిందంటున్నాడు. అదేమంటే.. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను స్వల్ప స్కోర్లకే ఔట్ చేసి తమ బౌలర్లు ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచారని పేర్కొన్నాడు. జట్టు భారీ స్కోర్ చేసినా.. కివీస్ బౌలర్లు రాణించడంతోనే తమ విజయం నల్లేరుపై నడకగా మారిందన్నాడు. 'ముఖ్యంగా కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సూపర్ ఫామ్‌లో ఉన్న ధావన్, రోహిత్ సహా నలుగురిని పెవిలియన్ బాట పట్టించి భారత్ పతనాన్ని శాసించాడు. తొలి ట్వంటీ20లో సెంచరీ (158) భాగస్వామ్యం నెలకొల్పిన భారత ఓపెనర్లు త్వరగా ఔట్ కావడంతో ప్రత్యర్థి జట్టు కాస్త వెనక్కి తగ్గింది. ఆరంభంలో కివీస్ పేసర్లు చెలరేగి వికెట్లు తీయగా, ఆపై స్పిన్నర్లు సమష్టిగా తమ పనిని పూర్తిచేశారు. పరుగులు రాబట్టడం కష్టంగా మారడంతో సాధించాల్సి రన్ రేట్ పెరిగిపోయి టీమిండియా ఆటగాళ్లపై పెరిగింది. దీంతో వారు వికెట్లను సమర్పించుకున్నారని' గత మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో మున్రో వివరించాడు. -
మున్రో మెరుపులు
52 బంతుల్లో సెంచరీ రెండో టి20లోనూ కివీస్ గెలుపు మౌంట్ మాంగనూ (న్యూజిలాండ్): కొలిన్ మున్రో (54 బంతుల్లో 101; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీతో విరుచుకుపడగా... బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టి20లో న్యూజిలాండ్ 47 పరుగుల తేడా తో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టి20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో దక్కించుకుంది. చివరి టి20 ఆదివారం ఇదే వేదికపై జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 195 పరుగులు చేసింది. టామ్ బ్రూస్ (39 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన ఆనందంలో ఉన్న బంగ్లా బౌలర్లను వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మున్రో ఓ ఆటాడుకున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ 52 బంతుల్లోనే మున్రో తన తొలి శతకం బాదాడు. రూబెల్ హŸస్సేన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 18.1 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఐష్ సోధికి మూడు, వీలర్, విలియమ్సన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. మున్రో శతకంతో టి20ల్లో అత్యధిక సెంచరీలు (మెకల్లమ్ రెండు, గప్టిల్, మున్రో ఒక్కోటి) సాధించిన జట్టుగా న్యూజిలాండ్ గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఖాతాలో మూడేసి సెంచరీలు ఉన్నాయి. -
మున్రో విధ్వసం
ఆక్లాండ్: దుమ్మురేపే బ్యాటింగ్‌తో చెలరేగిన న్యూజిలాండ్ జట్టు... శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. కొలిన్ మున్రో (14 బంతుల్లో 50 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు), మార్టిన్ గప్టిల్ (25 బంతుల్లో 63; 6 ఫోర్లు, 5 సిక్సర్లు)ల సంచలన ఆటతీరుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కివీస్ 9 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈడెన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాథ్యూస్ (49 బంతుల్లో 81 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దిల్షాన్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు)లు మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇలియట్ 4, సాంట్నెర్, మిల్నే చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ను లంక బౌలర్లు నిలువరించలేకపోయారు. దీంతో ఆతిథ్య జట్టు కేవలం 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 147 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు గప్టిల్, విలియమ్సన్ (21 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడుతూ 40 బంతుల్లోనే తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత మున్రో సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీ లైన్ దాటించేందుకు ప్రయత్నించాడు. ఫలితంగా 14 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. టి20ల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ కాగా, కివీస్ తరఫున వేగవంతమైన అర్ధసెంచరీ. అంతకుముందు గప్టిల్ కూడా 19 బంతుల్లోనే 50 పరుగులు చేసినా.. మున్రో జోరు ముందు తన రికార్డు (కివీస్ తరఫున ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ) 20 నిమిషాల్లోనే మరుగున పడిపోయింది. మున్రోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.