గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో టొరంటో నేషనల్స్ బోణీ కొట్టింది. నిన్న (జులై 25) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో వాంకోవర్ నైట్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాంకోవర్.. జునైద్ సిద్దిఖీ (3.3-0-24-4), రోహిద్ ఖాన్ (4-0-29-2), సాద్ బిన్ జాఫర్ (4-0-11-2), బెహ్రెన్‌డార్ఫ్ (4-0-20-1) ధాటికి 19.3 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది.
వాంకోవర్ ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ (23), మునీర్ అహ్మద్ (22) మాత్రమే అతి కష్టం మీద 20 పరుగుల మార్కును దాట గలిగారు. కెప్టెన్ ఉస్మాన్ ఖ్వాజా 3, హర్ష్ థాకెర్ 0, నితీశ్ కుమార్ 0, ప్రిటోరియస్ 16, రిప్పన్ 1, సందీప్ లామిచ్చేన్ 15, ఆమిర్ 0, వాన్ మీకెరెన్ 12 పరుగులు చేసి ఔటయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టొరొంటో.. కొలిన్ మున్రో (44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ డెర్ డస్సెన్ (31 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో 14.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉన్ముక్త్ చంద్ 23 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వాంకోవర్ బౌలర్లలో వాన్ మీకెరెన్, సందీప్ లామిచ్చేన్ తలో వికెట్ పడగొట్టారు. ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో మాంట్రియల్ టైగర్స్, బంగ్లా టైగర్స్ పోటీ పడతాయి.
Comments
Please login to add a commentAdd a comment