హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్‌లో వెల్ష్ ఫైర్ బోణీ కొట్టింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్న (జులై 25) జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్.. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. సికందర్ రజా (13), జేమీ ఓవర్టన్ (23), స్కాట్ కర్రీ (26 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. డేవిడ్ విల్లే (20-12-14-3), జాషువ లిటిల్ (20-10-21-2) ఒరిజినల్స్ పతనాన్ని శాశించారు. డేవిడ్ పేన్, జేక్ బాల్, మేసన్ క్రేన్ తలో వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్ ఫైర్.. 57 బంతుల్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. టమ్ కొహ్లెర్ కాడ్‌మోర్ 18, జానీ బెయిర్‌స్టో 18, జో క్లార్క్ 33, టామ్ ఏబెల్ 11 పరుగులు చేశారు. ఒరిజినల్స్ బౌలర్లలో స్కాట్ కర్రీ, పాల్ వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు.
మరోవైపు మహిళల హండ్రెడ్ లీగ్‌లోనూ వెల్ష్ ఫైర్ బోణీ కొట్టింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్ననే జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్.. వొల్వార్డ్ట్ (37), ఎక్లెస్టోన్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేయగా.. సోఫీ డంక్లీ (69 నాటౌట్) సత్తా చాటడంతో వెల్ష్ ఫైర్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment