David Willey
-
రాణించిన డేవిడ్ విల్లే.. వెల్ష్ ఫైర్‌కు తొలి విజయం
హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్‌లో వెల్ష్ ఫైర్ బోణీ కొట్టింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్న (జులై 25) జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్.. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. సికందర్ రజా (13), జేమీ ఓవర్టన్ (23), స్కాట్ కర్రీ (26 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. డేవిడ్ విల్లే (20-12-14-3), జాషువ లిటిల్ (20-10-21-2) ఒరిజినల్స్ పతనాన్ని శాశించారు. డేవిడ్ పేన్, జేక్ బాల్, మేసన్ క్రేన్ తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్ ఫైర్.. 57 బంతుల్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. టమ్ కొహ్లెర్ కాడ్మోర్ 18, జానీ బెయిర్‌స్టో 18, జో క్లార్క్ 33, టామ్ ఏబెల్ 11 పరుగులు చేశారు. ఒరిజినల్స్ బౌలర్లలో స్కాట్ కర్రీ, పాల్ వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు.మరోవైపు మహిళల హండ్రెడ్ లీగ్‌లోనూ వెల్ష్ ఫైర్ బోణీ కొట్టింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్ననే జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్.. వొల్వార్డ్ట్ (37), ఎక్లెస్టోన్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేయగా.. సోఫీ డంక్లీ (69 నాటౌట్) సత్తా చాటడంతో వెల్ష్ ఫైర్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. -
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాక్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ డేవిడ్ విల్లే లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు భారత్‌కు రాకుండా స్వదేశమైన ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. గత రెండు నెలలుగా ఇంటర్నేషనల్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉండిన విల్లే.. పీఎస్ఎల్ ఫైనల్ అనంతరం వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతూ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని లక్నో హెడ్ కోచ్ ఇవాళ (మార్చి 20) వెల్లడించాడు. కొంతకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్న విల్లే కుటుంబంతో కొద్ది రోజులు గడిపి తిరిగి భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అందుకే లక్నో మేనేజ్మెంట్ విల్లేకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయలేదు. ఏది ఏమైనా విల్లే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడం ఖాయంగా తెలుస్తుంది. విల్లేను ఐపీఎల్ 2024 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. విల్లే ఉన్నపళంగా హ్యాండ్ ఇవ్వడంతో ఎల్ఎస్జీ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇదివరకే మరో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ స్వదేశీ బోర్డు అంక్షలు విధించడంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు వుడ్‌పై వర్క్ లోడ్ పడకూడదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనికి ఐపీఎల్ ఆడేందుకు అనుమతి నిరాకరించింది. వుడ్ స్థానాన్ని ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ విండీస్ నయా పేస్ సంచనలం షమార్ జోసఫ్‌తో భర్తీ చేసింది. వుడ్ స్థానాన్ని భర్తీ చేసుకున్నామనుకునే లోపే విల్లే రూపంలో లక్నోకు మరో షాక్ తగిలింది. విల్లే గత రెండు సీజన్ల పాటు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. లక్నో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. జైపూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో లక్నో.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. తొలి విడతలో ప్రకటించిన షెడ్యూల్ వరకు లక్నో మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. 30న పంజాబ్‌తో (లక్నో), ఏప్రిల్ 2న ఆర్సీబీతో (బెంగళూరు), ఏప్రిల్ 7న గుజరాత్‌తో తలపడనుంది. లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, మొమ్మద్ అర్షద్ ఖాన్. -
వరల్డ్‌కప్‌లో ఘోర ప్రదర్శన. ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం
ఇంగ్లండ్ పేస్ బౌలర్ డేవిడ్ విల్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు డేవిడ్ విల్లీ విడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి విల్లీ రిటైర్ కానున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా విల్లీ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విల్లీ.. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడడం మాత్రం కొనసాగించనున్నాడు. వన్డే ప్రపంచకప్-2023లో కూడా విల్లీ తన బౌలింగ్‌తో పర్వాలేదనపిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన విల్లీ.. 5 వికెట్లతో పాటు 42 పరుగులు చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్లను విల్లీ ఔట్ చేశాడు. ఐర్లాండ్‌పై అరంగేట్రం.. 2015లో ఐర్లాండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విల్లీ.. జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక స్ధానాన్ని ఏర్పుచుకున్నాడు. కాగా విల్లీ కేవలం వైట్‌బాల్ క్రికెట్లో మాత్రం ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు 70 వన్డేలు, 43 టీ20ల్లో ఇంగ్లండ్ తరపున ఆడిన విల్లీ వరుసగా 94, 51 వికెట్లు పడగొట్టాడు. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా విల్లీ నిలిచాడు. ఆ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన అతడు 10 వికెట్లు పడగొట్టాడు. చదవండి: World cup 2023: దక్షిణాఫ్రికా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్ టార్గెట్ 358 పరుగులు -
కోహ్లి టీమ్‌లో చేరిన ధోని నేస్తం.. KGFపై భారం తగ్గిస్తాడా..?
మహేంద్రసింగ్ ధోని స్నేహితుడు, మాజీ సీఎస్కే సభ్యుడు కేదార్ జాదవ్‌ను ఆర్సీబీ తమ జట్టులో చేర్చుకుంది. గత మ్యాచ్ సందర్భంగా గాయపడిన డేవిడ్ విల్లేకు రీప్లేస్‌మెంట్‌గా జాదవ్ ఆర్సీబీలోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం సోమవారం (మే 1) ప్రకటించింది. 38 ఏళ్ల జాదవ్‌ను ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. జాదవ్ సేవలను ఆర్సీబీ కోటి రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. చదవండి: సంజూ చీటింగ్ చేశాడా.. రోహిత్ శర్మకు అన్యాయం!? video 2010లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన జాదవ్.. ఢిల్లీ క్యాపిటల్స్, కొచ్చి టస్కర్స్, ఆర్సీబీ, సీఎస్కే, సన్‌రైజర్స్ తరఫున 93 మ్యాచ్‌ల్లో 123.17 స్ట్రయిక్ రేట్‌తో 1196 పరుగులు చేశాడు. జాదవ్ 2016, 2017 సీజన్లలో ఆర్సీబీ తరఫున 17 మ్యాచ్‌లు ఆడి అద్భుతంగా రాణించాడు (143.54 స్ట్రయిక్ రేట్‌తో 267 పరుగులు). జాదవ్ రాకతో ఆర్సీబీ బ్యాటింగ్ బలం పెరుగుతుందని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తుంది. జాదవ్ జట్టులో చేరడం వల్ల KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్)పై భారం తగ్గుతుందని ఆర్సీబీ అంచనా వేస్తుంది. జాదవ్‌కు పార్ట్ టైమ్ స్పిన్ బౌలర్‌గా సత్తా చాటే సామర్థ్యం కూడా ఉంది. అయితే ఐపీఎల్లో మాత్రం అతను ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. జాదవ్ మంచి వికెట్‌కీపర్ కూడా. జాదవ్‌కు ధోనికి మంచి స్నేహం ఉందని క్రికెట్ సర్కిల్స్‌లో టాక్ ఉంది. ధోని సీఎస్కే యాజమాన్యాన్ని ఒప్పించి మరీ అప్పట్లో జాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు టాక్ నడిచింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ (మే 1) ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. చదవండి: జడేజాను ట్రై చేశారు.. కానీ ఏం లాభం? కెప్టెన్‌గా అతడే సరైనోడు: పాక్ దిగ్గజం -
Ind Vs Eng: నేను గనుక పంత్ స్థానంలో ఉంటే కచ్చితంగా సిక్స్ కొట్టేవాడిని!
India Vs England ODI Series 2022- India Win: ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో అదరగొట్టిన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చిన పంత్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా సహా వసీం జాఫర్ వంటి పలువురు మాజీ ఆటగాళ్లు కొనియాడుతున్నారు. మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంత్.. 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా 42 ఓవర్లో డేవిడ్ విల్లే బౌలింగ్‌లో వరుసగా ఐదు ఫోర్లు బాది వారెవ్వా అనిపించాడు. దీంతో బిక్క మొహం వేయడం విల్లే వంతైంది. నేను గనుక పంత్ స్థానంలో ఉండి ఉంటే! అయితే, పంత్ ఈ ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీయడంపై టీమిండియా మాజీ ఓపెనర్, విధ్వంసకర బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానే గనుక పంత్ స్థానంలో ఉండి ఉంటే ఆఖరి బంతికి ఫోర్ లేదంటే సిక్స్ కొట్టేవాడినని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు మ్యాచ్ అనంతరం సోనీ స్పోర్ట్స్ షోలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ 42వ ఓవర్ చివరి బంతికి పంత్ గనుక ఫోర్ కొట్టి ఉంటే మ్యాచ్ అపుడే ముగిసేది. అదనంగా పరుగు తీయాల్సిన అవసరం కూడా లేదు. అయితే, పంత్.. ఆ బంతిని ఫోర్ కాదు.. ఏకంగా సిక్స్‌గా మలచాల్సింది. ఒకవేళ నేనే గనుక రిషభ్ పంత్ స్థానంలో ఉంటే కచ్చితంగా ఫోర్ లేదంటే సిక్సర్ బాదేవాడిని’’ అని పేర్కొన్నాడు. ఇక వన్డేల్లో పంత్‌కు ఇదే మొదటి శతకం కావడంతో.. వన్డే క్రికెట్లో రిషభ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామన్న వీరూ భాయ్.. ఈ మ్యాచ్‌లో అద్భుతం చేశాడని కొనియాడాడు. కాగా 43వ ఓవర్ మొదటి బంతికి పంత్ ఫోర్ కొట్టడంతో టీమిండియా విజయం ఖరారైంది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ మీద గెలుపొంది సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: Rohit Sharma: ఇంగ్లండ్ గడ్డ మీద గెలవడం అంత ఈజీ కాదు! అంతా వాళ్లిద్దరి వల్లే.. -
ఒకే ఓవర్లో 5 ఫోర్లు.. విల్లీకి చుక్కలు చూపించిన పంత్.. వీడియో వైరల్!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన వన్డే కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు విఫలమైన చోట.. పంత్ అద్భుతమైన సెంచరీతో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో 125 పరుగులు చేసిన పంత్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీను పంత్ ఓ ఆట ఆడుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 42 ఓవర్ వేసిన బౌలింగ్‌లో పంత్ వరుసగా 5 ఫోర్లు బాదాడు. ఇక జో రూట్ వేసిన తర్వాత ఓవర్ తొలి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ను పంత్ ఫినిష్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో వన్డే వేదిక: మాంచెస్టర్ టాస్: ఇండియా- బౌలింగ్ ఇంగ్లండ్ స్కోరు: 259 (45.5) ఇండియా స్కోరు: 261/5 (42.1) విజేత: భారత్.. 5 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రిషబ్ పంత్(125 పరుగులు- నాటౌట్) చదవండి: ENG vs IND: సెంచరీతో చెలరేగిన పంత్..వన్డేల్లో అరుదైన రికార్డు..! Total madness from Rishab pant 🔥🔥#INDvsEND #RishabhPant #HardikPandya #ViratKohli pic.twitter.com/8lPcvIIlIy — Shadow (@shadow_1713) July 17, 2022