ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ డేవిడ్ విల్లే లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు భారత్‌కు రాకుండా స్వదేశమైన ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. గత రెండు నెలలుగా ఇంటర్నేషనల్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉండిన విల్లే.. పీఎస్‌ఎల్ ఫైనల్ అనంతరం వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతూ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని లక్నో హెడ్ కోచ్ ఇవాళ (మార్చి 20) వెల్లడించాడు.
కొంతకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్న విల్లే కుటుంబంతో కొద్ది రోజులు గడిపి తిరిగి భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అందుకే లక్నో మేనేజ్‌మెంట్ విల్లేకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయలేదు. ఏది ఏమైనా విల్లే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడం ఖాయంగా తెలుస్తుంది. విల్లేను ఐపీఎల్ 2024 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. విల్లే ఉన్నపళంగా హ్యాండ్ ఇవ్వడంతో ఎల్‌ఎస్‌జీ దిక్కుతోచని స్థితిలో ఉంది.
ఇదివరకే మరో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ స్వదేశీ బోర్డు అంక్షలు విధించడంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు వుడ్‌పై వర్క్ లోడ్ పడకూడదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనికి ఐపీఎల్ ఆడేందుకు అనుమతి నిరాకరించింది. వుడ్ స్థానాన్ని ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్ విండీస్ నయా పేస్ సంచనలం షమార్ జోసఫ్‌తో భర్తీ చేసింది. వుడ్ స్థానాన్ని భర్తీ చేసుకున్నామనుకునే లోపే విల్లే రూపంలో లక్నోకు మరో షాక్ తగిలింది. విల్లే గత రెండు సీజన్ల పాటు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. లక్నో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. జైపూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో లక్నో.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. తొలి విడతలో ప్రకటించిన షెడ్యూల్ వరకు లక్నో మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. 30న పంజాబ్‌తో (లక్నో), ఏప్రిల్ 2న ఆర్సీబీతో (బెంగళూరు), ఏప్రిల్ 7న గుజరాత్‌తో తలపడనుంది.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, మొమ్మద్ అర్షద్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment