కేఎల్ రాహుల్ (PC: BCCI/IPL)
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.
ఇక సమిష్టి ప్రదర్శనతో లక్నోపై గెలుపుతో లీగ్ దశను ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఏడు విజయాలు సాధించింది. వెళ్తూ వెళ్తూ లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసింది.
వాళ్లిద్దరు పట్టుదలగా నిలబడ్డారు
ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ చేతిలో ఓటమిపై స్పందించాడు. ‘‘40 ఓవర్ల పాటు వికెట్ ఒకే విధంగా ఉంది. తొలి ఓవర్లోనే మేము జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను అవుట్ చేసి శుభారంభం అందుకున్నాం.
అయితే, దానిని మేము నిలబెట్టుకోలేకపోయాం. షాయీ హోప్, అభిషేక్ పోరెల్ పట్టుదలగా నిలబడ్డారు. ఇక్కడ 200 పెద్ద స్కోరేమీ కాదు. అయినా, లక్ష్య ఛేదనలో మేము తడబడ్డాం.
సీజన్ మొత్తం మాకు అదే సమస్య
నిజానికి ఇది పూర్తి చేయదగిన టార్గెట్. ఈ సీజన్ ఆసాంతం పవర్ ప్లేలో త్వరగా వికెట్లు కోల్పోవడం మాకు ఇబ్బందికరంగా మారింది. బ్యాటింగ్ పరంగా మాకు ఎప్పుడూ శుభారంభం లభించలేదు.
స్టొయినిస్, పూరన్‌లకు మేము సహకారం అందించలేకపోయాం. అందుకే మేము ఇప్పుడిలా విపత్కర పరిస్థితిలో కూరుకుపోయాం’’ అని కేఎల్ రాహుల్ విచారం వ్యక్తం చేశాడు.
కాగా ఈ మ్యాచ్‌లో రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.
ఢిల్లీ వర్సెస్ లక్నో స్కోర్లు
👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం.. ఢిల్లీ
👉టాస్: లక్నో.. బౌలింగ్
👉ఢిల్లీ స్కోరు: 208/4 (20)
👉లక్నో స్కోరు: 189/9 (20)
👉ఫలితం: 19 పరుగుల తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:ఇషాంత్ శర్మ(3/34).
చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
A clinical win at home to finish off their season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/kekvx9uuZK
— IndianPremierLeague (@IPL) May 15, 2024
Comments
Please login to add a commentAdd a comment