photo credit: IPL Twitter
మహేంద్రసింగ్ ధోని స్నేహితుడు, మాజీ సీఎస్‌కే సభ్యుడు కేదార్ జాదవ్‌ను ఆర్సీబీ తమ జట్టులో చేర్చుకుంది. గత మ్యాచ్ సందర్భంగా గాయపడిన డేవిడ్ విల్లేకు రీప్లేస్‌మెంట్‌గా జాదవ్ ఆర్సీబీలోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం సోమవారం (మే 1) ప్రకటించింది. 38 ఏళ్ల జాదవ్‌ను ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. జాదవ్ సేవలను ఆర్సీబీ కోటి రూపాయలు వెచ్చించి దక్కించుకుంది.
చదవండి: సంజూ చీటింగ్ చేశాడా.. రోహిత్ శర్మకు అన్యాయం!? video
2010లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన జాదవ్.. ఢిల్లీ క్యాపిటల్స్, కొచ్చి టస్కర్స్, ఆర్సీబీ, సీఎస్‌కే, సన్‌రైజర్స్ తరఫున 93 మ్యాచ్‌ల్లో 123.17 స్ట్రయిక్ రేట్‌తో 1196 పరుగులు చేశాడు. జాదవ్ 2016, 2017 సీజన్లలో ఆర్సీబీ తరఫున 17 మ్యాచ్‌లు ఆడి అద్భుతంగా రాణించాడు (143.54 స్ట్రయిక్ రేట్‌తో 267 పరుగులు). జాదవ్ రాకతో ఆర్సీబీ బ్యాటింగ్ బలం పెరుగుతుందని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తుంది. జాదవ్ జట్టులో చేరడం వల్ల KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్)పై భారం తగ్గుతుందని ఆర్సీబీ అంచనా వేస్తుంది.
జాదవ్‌కు పార్ట్ టైమ్ స్పిన్ బౌలర్‌గా సత్తా చాటే సామర్థ్యం కూడా ఉంది. అయితే ఐపీఎల్‌లో మాత్రం అతను ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. జాదవ్ మంచి వికెట్‌కీపర్ కూడా. జాదవ్‌కు ధోనికి మంచి స్నేహం ఉందని క్రికెట్ సర్కిల్స్‌లో టాక్ ఉంది. ధోని సీఎస్‌కే యాజమాన్యాన్ని ఒప్పించి మరీ అప్పట్లో జాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు టాక్ నడిచింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ (మే 1) ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.
చదవండి: జడేజాను ట్రై చేశారు.. కానీ ఏం లాభం? కెప్టెన్‌గా అతడే సరైనోడు: పాక్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment