ఇంగ్లండ్ పేస్ బౌలర్ డేవిడ్ విల్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు డేవిడ్ విల్లీ విడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి విల్లీ రిటైర్ కానున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా విల్లీ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విల్లీ.. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడడం మాత్రం కొనసాగించనున్నాడు.
వన్డే ప్రపంచకప్-2023లో కూడా విల్లీ తన బౌలింగ్‌తో పర్వాలేదనపిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన విల్లీ.. 5 వికెట్లతో పాటు 42 పరుగులు చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్లను విల్లీ ఔట్ చేశాడు.
ఐర్లాండ్‌పై అరంగేట్రం..
2015లో ఐర్లాండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విల్లీ.. జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక స్ధానాన్ని ఏర్పుచుకున్నాడు. కాగా విల్లీ కేవలం వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు 70 వన్డేలు, 43 టీ20ల్లో ఇంగ్లండ్ తరపున ఆడిన విల్లీ వరుసగా 94, 51 వికెట్లు పడగొట్టాడు.
భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా విల్లీ నిలిచాడు. ఆ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన అతడు 10 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: World cup 2023: దక్షిణాఫ్రికా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్ టార్గెట్ 358 పరుగులు
Comments
Please login to add a commentAdd a comment