వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా పుణే వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 179 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, అదిల్ రషీద్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్ ఒక్క వికెట్ సాధించారు.
నెదర్లాండ్స్ బ్యాటర్లలో తేజ నిడమనూరు(41 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతుకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. బెన్ స్టోక్స్(108) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. స్టోక్స్‌తో పాటు డేవిడ్ మలాన్(87), క్రిస్ వోక్స్(51) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
డచ్ బౌలర్లలో బాస్ డీలీడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్యన్ దత్, వాన్ బీక్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో ఏడో స్ధానానికి చేరుకుంది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశాలను ఇంగ్లండ్ సజీవంగా నిలుపుకుంది.
చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
Comments
Please login to add a commentAdd a comment