వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్- ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.
ఈ మ్యాచ్‌కు కూడా ఇంగ్లీష్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. ఆఫ్గానిస్తాన్ మాత్రం తమ జట్టులో ఒకే మార్పు చేసింది. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న మిడిలార్డర్ బ్యాటర్ నజీబుల్ జద్రాన్‌ను ఆఫ్గాన్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో ఇక్రమ్ అలీఖిల్ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫారూఖీ
ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ
చదవండి: World Cup 2023: అంపైర్‌కు కండలు చూపించిన రోహిత్ శర్మ.. ఎందుకంటే? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment