క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్ సమరానికి సమయం ఆసన్నమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలుకానుంది.
అమెరికా- కెనడా జట్ల మధ్య డల్లాస్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈసారి ఏకంగా 20 జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నా.. పోటీ మాత్రం ప్రధానంగా సూపర్-8 జట్ల మధ్యే ఉండనుంది.
ఆ నాలుగు జట్లకు మెజారిటీ ఓట్లు
టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ టైటిల్ రేసులో గట్టి పోటీదారులుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ఈసారి సెమీ ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేసిన విషయం తెలిసిందే.
ఊహించని పేరు చెప్పిన లారా
మెజారిటీ మంది టీమిండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పేర్లు చెప్పగా.. విండీస్ దిగ్గజం బ్రియన్ లారా మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. టీమిండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ జట్టుకు తన టాప్-4లో స్థానమిచ్చాడు.
గావస్కర్ టాప్-4 జట్లు ఇవే
అండర్‌డాగ్స్‌గా టీ20 ప్రపంచకప్-2024లో అడుగుపెట్టే అఫ్గన్.. ఈసారి కచ్చితంగా సెమీస్ చేరే అవకాశం ఉందని లారా అంచనా వేశాడు. మరోవైపు.. టీమిండియా లెజెండ్ సునిల్ గావస్కర్ ఇండియాతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఈసారి సెమీస్ చేరతాయని జోస్యం చెప్పాడు.
చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment