టీ20 వరల్డ్‌కప్ 2024లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గ్రూప్-సిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌పై అదే గ్రూప్‌కు చెందిన ఉగాండ, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా చేసిన స్కోర్ల కంటే.. విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ఒక్కడు (ఆఫ్ఘనిస్తాన్‌పై) చేసిన స్కోరే అధికంగా ఉంది.
ఆఫ్ఘనిస్తాన్‌పై ఉగాండ 58 పరుగులకు, న్యూజిలాండ్ 75, పపువా న్యూ గినియా 95 పరుగులకు ఆలౌట్ కాగా.. అదే ఆఫ్ఘనిస్తాన్‌పై పూరన్ ఒక్కడు 98 పరుగులు చేశాడు. జట్టు మొత్తం చేయలేని పరుగులు పూరన్ ఒక్కడు చేయడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘన్ బౌలర్లపై (ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో) ఏ ఒక్క జట్టు కనీసం 100 పరుగుల మార్కును కూడా తాక లేకపోగా.. విండీస్ మాత్రం ఏకంగా 218 పరుగులు చేసింది.
విండీస్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. పూరన్ (98), జాన్సన్ ఛార్లెస్ (43), హోప్ (25), పావెల్ (26) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. విండీస్ బౌలర్ల ధాటికి 114 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా విండీస్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గ్రూప్-సి నుంచి విండీస్, ఆఫ్ఘనిస్తాన్ ఇదివరకే సూపర్-8కు క్వాలిఫై కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది.
గ్రూప్-ఏ నుంచి భారత్ (A1), యూఎస్‌ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించగా,, గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.
సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.
సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్‌ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.
సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..
జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)
జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)
జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)
జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)
సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..
జూన్ 19- యూఎస్‌ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)
జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)
జూన్ 21- యూఎస్‌ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)
జూన్ 23- యూఎస్‌ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)
జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
Comments
Please login to add a commentAdd a comment