టీ20 వరల్డ్‌కప్-2024లో వెస్టిండీస్ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మంగళవారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను 104 పరుగులతో విండీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
విండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఆరంభంలోనే ఓపెనర్ కింగ్ వికెట్ కోల్పోయినప్పటకి.. పూరన్, చార్లెస్ మాత్రం విండీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి విండీస్ స్కోర్ బోర్డు 92 పరుగులకు చేరింది.
చరిత్ర సృష్టించిన విండీస్..
తద్వారా వెస్టిండీస్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీ20 వరల్ఢ్‌కప్ మ్యాచ్‌లో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా విండీస్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ పేరిట ఉండేది.
టీ20 వరల్డ్‌కప్-2024లో ఐర్లాండ్‌పై పవర్‌ప్లేలో నెదర్లాండ్స్ 91 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో అఫ్గాన్‌పై పవర్‌ప్లేలో 92 పరుగులు చేసిన విండీస్.. డచ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. కాగా ఈ మెగా టోర్నీ తొలి రౌండ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన కరేబియన్ జట్టు గ్రూపు-సి నుంచి అగ్రస్ధానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment