అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా ఒమర్జాయ్ రికార్డులకెక్కాడు.
టీ20 వరల్డ్‌కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 36 పరుగులిచ్చిన ఒమర్జాయ్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసున్నాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన ఒమర్జాయ్‌కు నికోలస్ పూరన్ చుక్కలు చూపించాడు.
ఆ ఓవర్‌లో పూరన్ 3 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 26 పరుగులు రాబట్టగా.. ఒమర్జాయ్ ఎక్స్‌ట్రాస్( వైడ్+4, నో బాల్, 4 లెగ్ బైస్)రూపంలో 10 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా ఆ ఓవర్‌లో 36 పరుగులు వచ్చాయి.
ఇక ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వరుసగా 6 సిక్స్‌లు బాది 36 పరుగులు రాబాట్టాడు.
మళ్లీ 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్‌లో 36 పరుగులు వచ్చాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అఫ్గాన్‌పై 104 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. అయితే ఇరు జట్లు ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment