
టీ20 వరల్డ్‌కప్-2024లో వెస్టిండీస్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను విజయంతో ముగించింది. సెయింట్ లూసియా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది.
219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్.. కరేబియన్ బౌలర్ల దాటికి 114 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. అకిల్ హుస్సేన్, మోటీ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
వీరితో పాటు రస్సెల్, జోషఫ్ కూడా చెరో వికెట్ సాధించారు. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్(38) మినహా మిగితందరూ దారుణంగా విఫలమయ్యారు.
పూరన్ ఊచకోత..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు.ఈ మ్యాచ్‌లో కేవలం 53 బంతులు ఎదుర్కొన్న పూరన్ 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 98 పరుగులు చేసి రనౌటయ్యాడు.
ఇక అతడితో పాటు చార్లెస్(43), హోప్(25), పావెల్(26) పరుగులతో రాణించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలా వికెట్ సాధించారు. కాగా గ్రూపు సి నుంచి అఫ్గానిస్తాన్, విండీస్ ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment