టీ20 వరల్డ్‌కప్ 2024లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. తొలి సెమీఫైనల్‌కు ట్రినిడాడ్ వేదిక కానుండగా.. రెండో సెమీస్ గయానా వేదికగా జరుగనుంది.
తొలి సెమీఫైనల్ భారతకాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 గంటకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీఫైనల్ గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్‌లో గెలిచే జట్లు జూన్ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఫైనల్ మ్యాచ్‌కు బార్బడోస్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం 29వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ (జూన్ 25) జరిగిన సూపర్-8 పోరుతో గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ ఖరారైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఖంగుతినిపించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించింది. వరుణుడి అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో గ్రూప్-1లో ఉన్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.
స్కోర్ వివరాలు..
ఆఫ్ఘనిస్తాన్ 115/5 (గుర్బాజ్ 43, రిషద్ హొసేన్ 3/26)
బంగ్లాదేశ్ 105 ఆటౌట్ (17.5 ఓవర్లలో) (లిటన్ దాస్ 54 నాటౌట్; నవీన్ ఉల్ హక్ 4/26, రషీద ఖాన్ 4/23)
8 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లా విజయ లక్ష్యం 19 ఓవర్లలో 114 పరుగులు)
Comments
Please login to add a commentAdd a comment