semi finals
-
T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4కు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి ఊహించని జట్టు సెమీస్‌కు దూసుకువచ్చింది. కాగా బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సిన ఈ మెగా టోర్నీ వేదికను ఐసీసీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చిన విషయం తెలిసిందే.బంగ్లాలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తలెత్తిన అల్లర్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీపడ్డాయి.టీమిండియాకు కలిసి రాలేదుఅయితే, టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టు పేలవ ప్రదర్శనతో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో గ్రూప్-ఏలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4లో సగర్వంగా అడుగుపెట్టాయి. అయితే, గ్రూప్-బి టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్ ఊహించని రీతిలో ఒక్క మ్యాచ్ ఫలితంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.ఒక్క మ్యాచ్‌తో ఫలితం తారుమారువెస్టిండీస్తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హీథర్ నైట్ బృందం.. విండీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో గ్రూప్-బి పాయింట్ల పట్టిక తారుమారైంది. మొదటిస్థానంలో ఉన్న ఇంగ్లండ్ మూడో స్థానానికి, మూడో స్థానంలో ఉన్న వెస్టిండీస్ టాప్‌లోకి వచ్చింది. ఇరు జట్లు పాయింట్ల పరంగా(6) సమానంగా ఉన్నా.. నెట్‌రన్‌రేటులో వెస్టిండీస్(1.536).. ఇంగ్లండ్(1.091) కంటే మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం.ఫలితంగా గ్రూప్-బి నుంచి వెస్టిండీస్ సెమీస్‌కు వచ్చింది. మరోవైపు.. ఇదే గ్రూపులో ఉన్న సౌతాఫ్రికా కూడా ఆరు పాయింట్లే కలిగి ఉన్నా.. నెట్‌రన్‌రేటే(1.382) ఆ జట్టుకూ మేలు చేసి టాప్-4లో చేర్చింది. అలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా మహిళా టీ20 వరల్డ్‌కప్-2024లో తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.షెడ్యూల్, వేదికలు ఇవే👉మొదటి సెమీ ఫైనల్- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- అక్టోబరు 17, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్.👉రెండో సెమీ ఫైనల్- వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, అక్టోబరు 18, షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా.👉రెండు మ్యాచ్‌లూ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు మొదలవుతాయి.ఆస్ట్రేలియా జట్టుఅలిసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబీ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మొలినెక్స్, బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్, అన్నాబెల్ సదర్లాండ్, హీథర్ గ్రాహం, జార్జియా వేర్హామ్.సౌతాఫ్రికా జట్టులారా వోల్వార్డ్ (కెప్టెన్), అన్నేక్ బాష్, టాజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, మికే డి రైడర్, అయాండా హ్లూబీ, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయబోంగా ఖాకా, సునే లూస్, నోన్కులులెకో మ్లాబా, సెష్నీ నాయుడు, తుమీ సెఖుఖున్, క్లోయ్ ట్రియాన్.వెస్టిండీస్ జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), ఆలియా అల్లేన్, షమీలియా కాన్నెల్, డియోండ్రా డాటిన్, షెమైన్ కాంప్బెల్లె (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, స్టెఫానీ టేలర్, చినెల్ హెన్రీ, చెడియన్ నేషన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, కరిష్మా రాంహారక్, మాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్.న్యూజిలాండ్ జట్టుసోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గాజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవే, లీ తహుహు.చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’ -
T20 WC 2024: ఇంగ్లండ్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు టీమిండియా
India vs England 2nd Semi final Live Updates: ఫైనల్‌కు టీమిండియాటీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో గత టీ20 వరల్డ్‌కప్ సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ఆరంభంలోనే ఔటైనప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.ఆఖరిలో హార్దిక్ పాండ్యా(23), జడేజా(17), అక్షర్ పటేల్(10) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక జూన్ 29న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.జ ఆరో వికెట్ డౌన్..68 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్.. కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 68/649 పరుగులకే 5 వికెట్లు.. కష్టాల్లో ఇంగ్లండ్49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐదో వికెట్‌గా సామ్ కుర్రాన్ వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీగా కుర్రాన్ పెవిలియన్‌కు చేరాడు.ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్..ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో(0) క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జోస్ బట్లర్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.అదరగొట్టిన రోహిత్, సూర్య.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?ఇంగ్లండ్‌తో సెకెండ్ సెమీఫైనల్లో టీమిండియా బ్యాటింగ్‌లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారతత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(47), హార్దిక్ పాండ్యా(23) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.ఒకే ఓవర్లలో రెండు వికెట్లు..వరుస క్రమంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్ వేసిన జోర్డాన్ బౌలింగ్‌లో తొలుత హార్దిక్ పాండ్యా(23) ఔట్ కాగా.. అనంతరం శివమ్ దూబే(0) పెవిలియన్‌కు చేరాడు. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.సూర్యకుమార్ ఔట్...124 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. అర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.రోహిత్ శర్మ ఔట్..టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..13 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ(56), సూర్యకుమార్ యాదవ్(39) పరుగులతో ఉన్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్: 77/2మ్యాచ్ తిరిగి మళ్లీ ఆరంభమైంది. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(41), సూర్యకుమార్ యాదవ్(21) పరుగులతో ఉన్నారు.వర్షం అంతరాయం..గయానా వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న సెకెండ్ సెమీఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(13), రోహిత్ శర్మ(37) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రిషబ్ పంత్.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(26), సూర్యకుమార్ యాదవ్(5) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. టాప్లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..సెకెండ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్ రాత్రి 9.15 గంటలకు ప్రారంభం కానుంది.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీఅభిమానులకు గుడ్ న్యూస్అభిమానులకు గుడ్ న్యూస్. గయానాలో ఎండ కాస్తోంది. కవర్స్‌ను పూర్తిగి తొలిగించారు. భారత ప్లేయర్లు మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. అంపైర్లు 8.30 గంటలకు మైదానం, పిచ్‌ను పరిశీలిస్తారు.టీ20 వరల్డ్‌కప్-2024లో రెండో సెమీఫైనల్‌కు సమయం అసన్నమైంది. సెకెండ్ సెమీస్‌లో భాగంగా గయానా వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు.ప్రస్తుతం వర్షం అగినప్పటకి.. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. అయితే గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంకా పిచ్ సిద్దం కాకపోవడంతో టాస్ ఆలస్యం కానుంది. -
బాధగా ఉంది.. కానీ ఇది ఆరంభం మాత్రమే! ఎవరనైనా ఓడిస్తాము: రషీద్
టీ20 వరల్డ్‌కప్-2024లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ మెగా టోర్నీలో సంచలన విజయాలు నమోదు చేస్తూ ప్రత్యర్ధి జట్లను భయపెట్టిన అఫ్గాన్ జట్టు.. నాకౌట్ దశను దాటలేకపోయింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో 9 వికెట్ల తేడాతో అఫ్గాన్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన అఫ్గానిస్తాన్ కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 57 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టగా.. అఫ్గానిస్తాన్ ఇంటి బాట పట్టింది. ఇక ఈ ఓటమిపై అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు."ఈ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మేము బాగా ఆడటానికి ప్రయత్నించాము. కానీ ఇక్కడి పిచ్ మాకు పెద్దగా సహకరించలేదు. ఇక్కడి పరిస్థితులు బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉన్నాయి. అయితే మా ఓటమికి ఇదే నేను సాకుగా చెప్పాలనుకోవడం లేదు. ప్రస్తుత టీ20 క్రికెట్ అంటే ఎలా ఉంటుందంటే అన్ని పరిస్థితులకూ మనం సిద్ధంగా ఉండాలి.సౌతాఫ్రికా బౌలర్లు కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సెమీస్‌లో ఓడిపోయినప్పటకి ఈ టోర్నీలో మేము గొప్ప విజయాలు సాధించాము. ముజీబ్ ఆరంభంలోనే మా జట్టుకు దూరమైనప్పటికి మా సీమర్లు అతడి లోటును తెలియజేయలేదు. మా పేసర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. నబీ కూడా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీని మేం బాగా ఆస్వాదించాం. టాప్ క్లాస్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. కానీ ఇది మాకు ప్రారంభం మాత్రమే. ఏ జట్టునైనా ఓడించగలమన్న విశ్వాసం, నమ్మకం మాకు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని"పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రషీద్ పేర్కొన్నాడు. -
T20 World Cup 2024: పేలవ ఫామ్‌లో విరాట్.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..?
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి.ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌కు ముందు భారత క్రికెట్ అభిమానులను విరాట్ ఫామ్ కలవరపెడుతుంది. సెమీస్‌లో అయినా విరాట్ బ్యాట్ ఝులిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ విరాట్ ఇదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియా విజయావకాశాలు భారీగా దెబ్బ తింటాయి. విరాట్ ఎలాగైనా ఫామ్‌లోకి రావాలని టీమిండియా అభిమానులు దేవుళ్లకు ప్రార్ధిస్తున్నారు.ప్రస్తుత వరల్డ్‌కప్‌లో విరాట్ చేసిన స్కోర్లు..ఐర్లాండ్‌పై 1(5)పాక్‌పై 4 (3)యూఎస్ఏపై 0 (1)ఆఫ్ఘనిస్తాన్పై 24 (24)బంగ్లాదేశ్‌పై 37 (28)ఆస్ట్రేలియాపై 0 (5)కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్‌కు జతగా విరాట్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఓపెనర్‌గా ప్రమోషన్ లభించాక విరాట్ ఐపీఎల్ తరహాలో రెచ్చిపోతాడని అంతా అనుకున్నారు. అయితే విరాట్ పేలవ ఫామ్‌న ప్రదర్శిస్తూ అందరినీ నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్ 2024లో భీకర ఫామ్‌లో ఉండిన విరాట్ దేశం తరఫున ఆడాల్సి వచ్చే సరికి తేలిపోతుండటంతో అతని వ్యతిరేకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఏకంగా విరాట్‌ను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నారు. విరాట్ స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్ కీలకమైన సెమీస్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఫామ్‌లోకి రావాలి.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి. తొలి సెమీస్ ట్రినిడాడ్ వేదికగా రేపు (జూన్ 27) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. రెండో సెమీస్ గయానా వేదికగా రేపు రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. -
తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్.. భావోద్వేగాలు, సంబరాలు
ఒకప్పటి క్రికెట్ పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు చేరింది. THE WINNING MOMENT FOR AFGANISTAN. 🇦🇫- Pure raw emotions, the boys made it to the Semi Final. 🥹❤️pic.twitter.com/IMW34vfjbj— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఇవాళ (జూన్ 25) జరిగిన సూపర్-8 సమరంలో బంగ్లాను మట్టికరిపించిన ఆఫ్ఘన్లు.. ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించి, క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశారు. బంగ్లాపై గెలుపు అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. కోచ్ జోనాథన్ ట్రాట్, బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో కూడా ఆఫ్ఘన్ల గెలుపు సంబరాల్లో భాగమయ్యారు.THE CELEBRATIONS FROM JONATHAN TROTT AND DWAYNE BRAVO. 💥 pic.twitter.com/KXp81jGL9J— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఈ సందర్భాన్ని ఆఫ్ఘన్లతో పాటు ప్రతి క్రికెట్ ప్రేమికుడు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆఫ్ఘన్ పౌరుల సంబరాలు, భావోద్వేగాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నగర వీధులు తమ దేశ ఆటగాళ్ల నామస్మరణతో మార్మోగాయి. The joy on the face and happy tears on Afghanistan's fans. 🥹❤️ pic.twitter.com/3LOWLanIPP— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024AFGHANISTAN CELEBRATION IN TEAM BUS. 🔥- The Greatest day ever. [Bravo IG] pic.twitter.com/x3jHvdD0OZ— Johns. (@CricCrazyJohns) June 25, 2024Water brigade used on Afghanistan people to clear the road, but nobody moved. 😂🔥 pic.twitter.com/zFCnGmlTM7— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024 ఆఫ్ఘన్లు బహుశా తమకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. కాబుల్ సహా దేశంలోని ప్రతి నగరంలో జనాలు రోడ్లపైకి వచ్చి సమూహిక సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల గెలుపు సంబరాలు వైరలవుతున్నాయి.THE CELEBRATIONS IN PAKTIA PROVINCE. 🥶🇦🇫 pic.twitter.com/5wf2wucJjv— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024కాగా, వరుణుడి అంతరాయాల నడుమ సాగిన సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరగా.. గ్రూప్-1 నుంచి సెమీస్ రేసులో ఉండిన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.The madness in Afghanistan. 🤯🇦🇫 pic.twitter.com/MyYrAcFidr— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఇదిలా ఉంటే, బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్‌కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. Celebration time pic.twitter.com/0bub4dXREP— Byomkesh (@byomkesbakshy) June 25, 2024 -
T20 World Cup 2024: సెమీస్ బెర్త్‌లు ఖరారు.. టీమిండియా ప్రత్యర్ధి ఎవరంటే..?
టీ20 వరల్డ్‌కప్ 2024లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. తొలి సెమీఫైనల్‌కు ట్రినిడాడ్ వేదిక కానుండగా.. రెండో సెమీస్ గయానా వేదికగా జరుగనుంది. తొలి సెమీఫైనల్ భారతకాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 గంటకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీఫైనల్ గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్‌లో గెలిచే జట్లు జూన్ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఫైనల్ మ్యాచ్‌కు బార్బడోస్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం 29వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ (జూన్ 25) జరిగిన సూపర్-8 పోరుతో గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ ఖరారైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఖంగుతినిపించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించింది. వరుణుడి అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో గ్రూప్-1లో ఉన్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.స్కోర్ వివరాలు..ఆఫ్ఘనిస్తాన్ 115/5 (గుర్బాజ్ 43, రిషద్ హొసేన్ 3/26)బంగ్లాదేశ్ 105 ఆటౌట్ (17.5 ఓవర్లలో) (లిటన్ దాస్ 54 నాటౌట్; నవీన్ ఉల్ హక్ 4/26, రషీద ఖాన్ 4/23) 8 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లా విజయ లక్ష్యం 19 ఓవర్లలో 114 పరుగులు) -
World Cup Semis Race: టీమిండియాకు కూడా ఈజీ కాదు..!
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఏ జట్టుకు సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు కాలేదు. మరో నాలుగు మ్యాచ్‌లే ఆడాల్సి ఉన్నప్పటికీ 6 జట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. అన్ని జట్లతో పోలిస్తే టీమిండియాకు సెమీస్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ రేపటి వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఏ జట్టు ఏమరపాటుగా ఉన్నా సెమీస్ బెర్త్ గల్లంతవడం ఖాయం.గ్రూప్-1 విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్ సెమీస్ రేసులో ముందుంది. సూపర్-8లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన విజయాలు సాధించి గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుంది. సూపర్-8లో రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించినా టీమిండియాకు సైతం టెక్నికల్‌గా సెమీస్ బెర్త్ ఖరారు కాలేదు.ఒకవేళ భారత్.. రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఆసీస్ చేతిలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడి.. ఆతర్వాత బంగ్లాదేశ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 93 పరుగుల తేడాతో గెలిస్తే టీమిండియా సెమీస్ ఆశలు ఆవిరవుతాయి. ఇలా జరగడం దాదాపుగా అసాధ్యమే అయినప్పటికీ.. జరదని మాత్రం చెప్పలేని పరిస్థితి. కాబట్టి రేపు ఆసీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో గెలవాలనే టీమిండియా అనుకోవాలి.మరోవైపు ఇవాళ (జూన్ 23) ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంతో గ్రూప్-1లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటిదాకా సెమీస్ రేసులో లేని ఆఫ్ఘనిస్తాన్.. ఆసీస్‌పై గెలుపుతో ఒక్కసారిగా సెమీస్ రేసులోకి వచ్చింది. ఇప్పుడు ఆ జట్టు భవిష్యత్తు భారత్-ఆసీస్ మ్యాచ్‌పై ఆధారపడి ఉంది.ఇదిలా ఉంటే, గ్రూప్-2 సెమీస్ రేసు గ్రూప్-1 కంటే కఠినంగా ఉంది. గ్రూప్-1లో అయినా మొదటి సెమీస్ బెర్త్‌పై (భారత్) ఓ క్లారిటీ ఉంది. గ్రూప్-2లో అయితే అదీ లేదు. ఇప్పటివరకు అజేయ జట్టుగా ఉన్న సౌతాఫ్రికా గ్రూప్-2లో టాపర్‌గా ఉన్నా ఆ జట్టుకు కూడా సెమీస్ బెర్త్ అంత ఈజీగా దక్కేలా లేదు. ఆ జట్టు తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. సౌతాఫ్రికా, విండీస్‌లతో పోలిస్తే.. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్‌కు కాస్త మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో చిన్న జట్టైన యూఎస్ఏతో తలపడాల్సి ఉంది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మొత్తంగా చూస్తే ఈ సారి ప్రపంచకప్ సెమీస్ బెర్త్‌లు గతంలో ఎన్నడూ లేనంత కఠినంగా మారాయి. -
T20 WC 2024: బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. సెమీస్‌కు టీమిండియా?
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ తమ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖారారు చేసుకుంది. ఇక 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగల్గింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(37), పంత్(36), శివమ్ దూబే(34) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్, రిషద్ హోస్సేన్ తలా రెండు వికెట్లు సాధించారు. -
టైటిల్‌కు గెలుపు దూరంలో యూకీ బాంబ్రీ జోడీ..!
భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడో ఏటీపీ డబుల్స్ టైటిల్‌కు విజయం దూరంలో ఉన్నాడు. పారిస్‌లో జరుగుతున్న ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను బోల్తా కొట్టించింది. ఒక గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఏడు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.నేడు జరిగే ఫైనల్లో హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్)లతో యూకీ–ఒలివెట్టి పోటీపడతారు. యూకీ ఈ ఏడాది ఒలివెట్టితో కలిసి మ్యూనిక్ ఓపెన్‌లో, గత ఏడాది లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)తో కలిసి మలోర్కా ఓపెన్‌లో డబుల్స్ టైటిల్స్ గెలిచాడు.సచిన్ శుభారంభం బ్యాంకాక్: ఒలింపిక్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ సచిన్ సివాచ్ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన 57 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో సచిన్ 5–0తో అలెక్స్ ముకుకా (న్యూజిలాండ్)పై గెలుపొందాడు. పారిస్ ఒలింపిక్స్‌కు ఇదే చివరి అర్హత టోర్నమెంట్. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్న బాక్సర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు, మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు ఈ టోరీ్నలో పాల్గొంటున్నారు. భారత్ పరాజయం అంట్వెర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు 1–4తో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం చేతిలో పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో రక్షణ పంక్తి వైఫల్యాలతో భారత్ మూల్యం చెల్లించుకుంది. అందివచి్చన పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలోనూ విఫలమైంది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను అభిషేక్ (55వ ని.లో) ఆఖరి క్వార్టర్లో నమోదు చేశాడు. బెల్జియం బృందంలో హెండ్రిక్స్ అలెగ్జాండర్ (34వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా, ఫెలిక్స్ (22వ ని.), చార్లియెర్ సెడ్రిక్ (49వ ని.) చెరో గోల్ చేశారు. నేడు భారత్ మళ్లీ బెల్జియంతోనే తలపడుతుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో జ్యోతి సురేఖ జోడీయెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోరీ్నలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణంపై గురి పెట్టింది. ఇప్పటికే మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్ చేరిన జ్యోతి సురేఖ... మిక్స్డ్ టీమ్ కేటగిరీలో ప్రియాంశ్‌తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ రెండు ఫైనల్స్ నేడు జరుగుతాయి. శుక్రవారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ (భారత్) ద్వయం 158–157తో హాన్ సెంగ్యోన్–యాంగ్ జేవన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో ఒలివియా డీన్–సాయెర్ (అమెరికా)లతో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ తలపడతారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో ఎలిఫ్ బెరా గొకిర్ (టరీ్క)పై గెలిచింది. ఇవి చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్ -
ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ తక్కువ స్కోర్ (212) చేసినప్పటికీ.. ఆసీస్‌కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆసీస్ ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మరోసారి సెమీస్‌లో ఓడినందుకు బాధగా ఉంది. మాటల్లో చెప్పలేను. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్ కోసం వారికి శుభాకాంక్షలు. వారు ఈ రోజు అద్భుతంగా ఆడారు. మేము బ్యాట్‌తో, బంతితో ప్రారంభించిన విధానం బాగా లేదు. అక్కడే మ్యాచ్‌ను కోల్పోయాం. పరిస్థితులకు వారి నాణ్యమైన బౌలింగ్ అటాక్ తోడైంది. దీంతో వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే భారీ స్కోర్ సాధించడం చాలా కష్టం. అయినా మిల్లర్ (101), క్లాసెన్ (47) అద్భుతంగా ఆడి ఫైటింగ్ టోటల్‌ను ఇచ్చారు. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో మిల్లర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఛేదనలో ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. అదే మా కొంపముంచింది. మార్క్రమ్, మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టారు. మాకూ అవకాశాలు వచ్చాయి. అయితే మేము వాటిని ఒడిసిపట్టుకోలేకపోయాం. కొయెట్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడో యోధుడు. ఇతర సీమర్లతో కాని పనిని కొయెట్జీ ఈ రోజు చేసి చూపించాడు. అతడు తీసిన స్మిత్ వికెట్ నమ్మశక్యంగా లేదు. క్వింటన్ టైటిల్ గెలచి కెరీర్ ముగించాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఫలితం ఎలా ఉన్నా డికాక్ దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచిపోతాడు. -
హార్ధిక్‌కు ధన్యవాదాలు.. అతడు గాయపడకపోయుంటే షమీ వచ్చేవాడా..?
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్‌తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల ఘనత పక్కన పెడితే.. బౌలర్‌గా షమీ సాధించిన దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. షమీ షంషేర్లా విజృంభించి ఒంటిచేత్తో కివీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఈ మెరుపులు ఈ ఒక్క మ్యాచ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ టోర్నీలో అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగిపోయాడు. జట్టు సమీకరణల కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడని షమీ.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా గాయపడటంతో తుది జట్టులోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 5 వికెట్లతో విజృంభించిన షమీ.. ఆతర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లతో లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో షమీ సాధించిన ఘనత నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆసక్తికర పోస్ట్‌లు పెడుతున్నారు. హార్ధిక్‌కు థ్యాంక్స్ చెప్పాలి.. అతను గాయపడటం వల్లే షమీ తుది జట్టులోకి వచ్చాడు.. హార్ధిక్ గాయపడకుండా ఉండివుంటే షమీకి అవకాశం వచ్చేదేనా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వీరు చేస్తున్న కామెంట్లలోనూ నిజం లేకపోలేదు. హార్ధిక్ ఫిట్‌గా ఉండివుంటే షమీకి తుది జట్టులో అవకాశం వచ్చేది కాదు. జట్టు సమీకరణల పేరుతో గతంలో ఏం జరిగిందో అందరికి విధితమే. పేస్ బౌలర్ల కోటాలో బుమ్రా, సిరాజ్ తమతమ స్థానాలపై కర్ఛీఫ్‌లు వేసుకుని కూర్చున్నారు. హార్దిక్ జట్టులో ఉంటే మూడో పేసర్‌గా అతడే కొనసాగుతాడు. షమీ అవకాశం దాదాపుగా రాదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ ఉంటే, జట్టు మేనేజ్మెంట్ అదనపు స్పిన్నర్ లేదా బ్యాటర్ వైపే చూస్తుంది. వరల్డ్‌కప్ ముందు వరకు చాలా మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. -
CWC 2023 IND VS NZ Semi Final: టాస్ 'ఫిక్స్'..?
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (నవంబర్ 15) జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్‌మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో అద్బుతమైన పోరాటపటిమ కనబర్చిన న్యూజిలాండ్ చివరి వరకు గెలుపు కోసం ప్రయత్నించి విఫలమైంది. డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరు మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. pakistani 😂pic.twitter.com/gfhnpMhBOn — Keh Ke Peheno (@coolfunnytshirt) November 15, 2023 కాగా, కివీస్‌పై విజయం సాధించి టీమిండియా ఫైనల్స్‌కు చేరడాన్ని పాకిస్తాన్ అభిమానులు ఎప్పటిలాగే ఓర్వలేకపోతున్నారు. సోషల్‌మీడియా వేదికగా వారు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ ఏం సాధించినా ఇలా బద్నాం చేయడం వారికి పరిపాటిగా మారింది. నిన్నటి మ్యాచ్‌లో భారత్ అత్యంత కీలకమైన టాస్ గెలవడాన్ని పాకీలు ఇప్పుడు అస్త్రంగా మార్చుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ టాస్ ఫిక్సింగ్ అయ్యిందంటూ ఊదరగొడుతున్నారు. భారత్ టాస్ గెలవాలని ముందుగానే డిసైడ్ అయ్యిందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఓ పాక్ అభిమాని టాస్కు సంబంధించిన వీడియోకు కామెంట్రీ ఇస్తూ.. రోహిత్ శర్మ టాస్ ఎగరేస్తాడని, హిట్‌మ్యాన్ టాస్ కాయిన్‌ను దూరంగా విసురుతాడని, రిఫరీ వచ్చి రోహిత్ టాస్ గెలిచినట్లు చెప్పాడని, ఈ విషయం ముందుగానే తెలిసి కేన్ విలియమ్సన్ నవ్వుతున్నాడని కట్టుకథ అల్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. దీన్ని ఆధారం చేసుకుని పాకీలు రెచ్చిపోతున్నారు. టీమిండియాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందుకు భారత అభిమానులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు పాకీలను ఆడుకుంటున్నారు. -
ఒత్తిడిలోనూ మా వాళ్లు అద్భుతం.. వాళ్లు కూడా బాగా ఆడారు: రోహిత్ శర్మ
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగోసారి వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్‌మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ను డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) గెలిపించేందుకు ప్రయత్నించారు. ఓ దశలో వీరు ముగ్గురు టీమిండియాను భయపెట్టారు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారీ ఛేదనలో న్యూజిలాండ్ ఆటగాళ్లు శక్తివంచన లేకుండా ప్రతిఘటించారు. డారిల్ మిచెల్, విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓ దశలో వారు మాకు చాలా అవకాశాలు ఇచ్చారు. మేము వాటిని ఒడిసిపట్టుకోవడంలో విఫలమయ్యాం. మాపై ఒత్తిడి ఉండింది. అయినా ప్రశాంతంగా ఉండగలిగాం. బౌలింగ్ విషయానికొస్తే.. మా బౌలర్లందరూ చేయాల్సి ప్రతి ప్రయత్నం చేశారు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి సక్సెస్ సాధించాడు. మా టాపార్డర్ బ్యాటింగ్ అద్భుతం. అయ్యర్ సూపర్ టచ్‌లో ఉన్నాడు. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గిల్, రాహుల్ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. కోహ్లీ ఎప్పటిలాగే అద్భుతంగా ఆడాడు. తన ట్రేడ్‌మార్క్ ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా మా బ్యాటింగ్ సంతృప్తినిచ్చింది. మొదటి తొమ్మిది మ్యాచ్‌ల్లో (లీగ్ దశ) ఏం చేశామో ఈ మ్యాచ్‌లోనూ అదే చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ఫలితం సాధించాం. చదవండి: -
CWC 2023: టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన రాహుల్, జడేజా.. అదేంటీ..!
క్రికెట్లో క్యాచస్ విన్ మ్యాచస్ అనే నానుడు ఉంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్లో ఇదే జరిగింది. భారత ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలి అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకుని తమ జట్టు విజయంలో కీలకప్రాత పోషించారు. ముఖ్యంగా వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మైదానంలో మెరుపు వేగంగా కదిలి ఏకంగా 7 అద్బుతమైన క్యాచ్‌లు పట్టుకున్నారు. ఆఖర్లో జడేజా అయితే బంతి గాల్లోకి లేవడమే ఆలస్యం అన్నట్లు మైదానం నలుమూలలా తిరిగి క్యాచ్‌లు అందున్నాడు. రాహుల్ నేనేమీ తక్కువ కాదన్నట్లు వికెట్ల వెనక పక్షిలా గాల్లో ఎగురుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌లు పట్టుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో వీరికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని కొందరు అభిమానులు భావిస్తున్నారు. భారత గెలుపులో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), షమీ (9.5-0-57-7) పాత్ర ఎంత కీలకమో రాహుల్ ,జడ్డూ పాత్ర కూడా అంతే కీలకమని అభిప్రాయపడుతున్నారు. ఫీల్డర్లకు ఎంత గుర్తింపునిస్తే అన్ని అద్భుతాలు చేస్తారని అంటున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ఫీల్డర్ల పాత్ర వెలకట్టలేనిదని కామెంట్లు చేస్తున్నారు. షమీ డ్రాప్ క్యాచ్ (విలియమ్సన్) మినహాయించి, మ్యాచ్ మొత్తం టీమిండియా ఫీల్డర్లు మైదానంలో చిరుతల్లా కదిలారని కితాబునిస్తున్నారు. కాగా, ఉత్కంఠభరితంగా సాగిన నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి, నాలుగో సారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్, శుభ్‌మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి, శ్రేయస్, రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఏమాత్రం తగ్గకుండా టీమిండియాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయితే లక్ష్యం భారీది కావడంతో కివీస్ బ్యాటర్లు చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడినా 40 ఓవర్ల వరకు టీమిండియాను భయపెట్టింది. డారిల్ మిచెల్ (134) పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్‌లో పాతుకుపోయి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) సహకారంతో టీమిండియాకు దడ పుట్టించాడు. లక్ష్యం గనక కాస్త చిన్నది అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. -
న్యూజిలాండ్‌తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే?
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలించనుండటంతో టాస్ గెలిచిన రోహిత్ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. India in the World Cup Semi Finals: 2011 - India batted first, won the game. 2015 - India batted second, lost the game. 2019 - India batted second, lost the game. 2023 - India batting first. pic.twitter.com/hbqPkkRgSc — Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023 కాగా, వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో టీమిండియా గత రికార్డును పరిశీలిస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గత మూడు ఎడిషన్లలో తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. 2011 ఎడిషన్ సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సెమీస్ గండాన్ని అధిగమించడంతో పాటు ఫైనల్‌కు చేరి ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయింది. ఆతర్వాత వరుసగా రెండు ఎడిషన్ల (2015, 2019 సెమీస్‌లో రెండో బ్యాటింగ్ చేసిన భారత్ ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుత వరల్డ్‌కప్ సెమీస్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తుండటాన్ని భారత అభిమానులు శుభపరిణామంగా పరిగణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలుస్తుందంటూ చరిత్రను సాక్షిగా చూపిస్తున్నారు. -
CWC 2023: వర్ష సూచన.. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది..?
వర్షం కారణంగా వరల్డ్‌కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్‌లు రద్దైతే ఏం జరుగుందనే ప్రస్తావన ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతా వేదికగా నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఒకవేళ నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమై సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ రద్దైతే, ఆ మరుసటి రోజు (నవంబర్ 17, రిజర్వ్ డే) మ్యాచ్‌ను జరిపిస్తారు. ఇక ఆ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ లెక్కన లీగ్ దశలో సౌతాఫ్రికాకు ఆస్ట్రేలియా కంటే మెరుగైన రన్‌రేట్ ఉంది కాబట్టి సఫారీలు సెమీస్ గండాన్ని గట్టెక్కి ఫైనల్లోకి ప్రవేశిస్తారు. మరోవైపు ఇవాళ (నవంబర్ 15) జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రెండు రోజులు (రిజర్వ్ డే) సాధ్యపడకపోతే అప్పుడు లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ కలిగిన భారత్ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. వర్షం కారణంగా రెండు సెమీస్ మ్యాచ్‌లు రద్దైతే భారత్-సౌతాఫ్రికా ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ అంశం చర్చించుకోవడానికి బాగానే ఉంది కానీ, జరిగే పని మాత్రం కాదు. ఒకవేళ వర్షం కారణంగా షెడ్యూల్ అయిన రోజు మ్యాచ్ జరగకపోయినా, రిజర్వ్ డే రోజైనా తప్పక జరిగే అవకాశం ఉంటుంది. భారత్‌లో ఇది వర్షాకాలం కాదు కాబట్టి, ఎన్ని అల్పపీడనాలు ఏర్పడినా వాటి ప్రభావం నామమాత్రంగా ఉంటుంది. -
ఫుట్‌బాల్‌ను తాకిన క్రికెట్ ఫీవర్.. భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్‌కు విశిష్ట అతిథులు
క్రికెట్ ఫీవర్ యూనివర్సల్ గేమ్ ఫుట్‌బాల్‌ను కూడా తాకింది. ఇవాళ జరుగనున్న భారత్,న్యూజిలాండ్ వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు దిగ్గజ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్ హాజరుకానున్నాడని తెలుస్తుంది. బెక్‌హమ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు క్యూ కట్టనున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్, తలైవా రజినీకాంత్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్ చూసేందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంకు తరలిరానున్నారని ప్రచారం జరుగుతుంది. బెక్‌హమ్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ స్టైలిష్ ఫుట్‌బాలర్, క్రికెట్ పట్ల తనకున్న మక్కువను గతంలో చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. అలాగే బెక్‌హమ్‌కు ఇండియా అన్న ఈ దేశ క్రికెటర్లన్నా ప్రత్యేకమైన అభిమానం. ఓ సందర్భంలో అతను విరాట్ కోహ్లి పేరు ప్రస్తావించి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటగాడిగా ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాక పలు క్లబ్‌లకు కోచ్‌గా సేవలందించిన బెక్‌హమ్.. ప్రస్తుతం ఇంటర్ మయామీ ఫుట్‌బాల్ క్లబ్ కో ఓనర్‌గా ఉన్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. #WATCH | Tamil Nadu: Actor Rajinikanth leaves from Chennai airport to witness the World Cup semi-finals scheduled to be played at Wankhede Stadium in Mumbai. "I am going to see the match..," says Actor Rajinikanth pic.twitter.com/yWg1WpRHXX— ANI (@ANI) November 14, 2023 -
కలవరపెడుతున్న కోహ్లి ట్రాక్ రికార్డు.. పొంచి ఉన్న ప్రమాదం
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 15) తొలి సెమీఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు పోరాడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ తొమ్మిది వరుస విజయాలు సాధించి భీకర ఫామ్‌లో ఉన్నప్పటికీ.. అండర్ డాగ్స్‌గా పేరున్న న్యూజిలాండ్‌ను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మనవాళ్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నప్పటికీ.. కివీస్‌ను వారిదైన రోజున ఓడించడం అంత తేలక కాదు. మెజార్టీ శాతం సానుకూలతల నడుమ టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో కోహ్లికి ఉన్న ట్రాక్ రికార్డు. ప్రస్తుత టోర్నీలో అత్యుత్తమ ఫామ్‌లో ఉండి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతూ దాదాపు ప్రతి మ్యాచ్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లి వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్ అనగానే చతికిలబడతాడు. ఇప్పటివరకు కోహ్లి ఆడిన మూడు ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో ఇదే జరిగింది. మూడు సెమీఫైనల్స్‌లో కలిపి కోహ్లి చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. 2011 ఎడిషన్‌లో పాక్‌తో జరిగిన సెమీస్‌లో 9 పరుగులు చేసిన కోహ్లి.. 2015లో ఆ్రస్టేలియాతో జరిగిన సెమీస్‌లో ఒక్క పరుగు.. అనంతరం 2019 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఈ మూడు సెమీఫైనల్స్‌లో కోహ్లి ఎడంచేతి వాటం పేస్ బౌలర్ల (వహాబ్ రియాజ్, మిచెల్ జాన్సన్, ట్రెంట్ బౌల్ట్) చేతిలోనే ఔట్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్‌లో కోహ్లికి ట్రెంట్ బౌల్ట్ నుంచి మరోసారి ప్రమాదం పొంచి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలే కోహ్లికి బౌల్ట్ బౌలింగ్‌లో ట్రాక్ రికార్డు అంతంతమాత్రంగా ఉంది. దీనికి తోడు సెమీఫైనల్ ఒత్తిడి ఉండనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కోహ్లి ఏమేరకు రాణించగలడో అని భారత అభిమానులు కలవరపడుతున్నారు. ఈ అంశం యావత్ భారత దేశాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. -
CWC 2023 IND VS NZ Semi Final: ఏకైక మొనగాడు విరాట్ కోహ్లి..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి అరుదైన గుర్తింపు దక్కనుంది. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు సెమీస్ ఆడిన భారత ఆటగాడిగా విరాట్ రికార్డుల్లోకెక్కనున్నాడు. 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 15) జరుగనున్న సెమీఫైనల్లో ఆడటం ద్వారా విరాట్ ఈ రేర్ ఫీట్‌ను సాధించనున్నాడు. 35 ఏళ్ల విరాట్ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో నాలుగోసారి (2011, 2015, 2019, 2023) వన్డే సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఏ భారత ఆటగాడు నాలుగుసార్లు వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ ఆడలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (1996, 2003, 2011), ధోని (2011, 2015, 2019) మూడుసార్లు చొప్పున వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ ఆడారు. మొత్తంగా భారత్ 8 వన్డే సెమీఫైనల్స్ ఆడగా విరాట్ నాలుగింట భాగం కావడం విశేషం. ఇక భారత్ ఆడిన సెమీఫైనల్స్ విషయానికొస్తే.. ఇప్పటిదాకా మొత్తం 13 వన్డే ప్రపంచకప్‌లు (ప్రస్తుత వరల్డ్‌కప్‌తో కలుపుకుని) జరగ్గా భారత్ ఎనిమిదింట సెమీస్‌కు చేరింది. ఇందులో మూడుసార్లు (1983లో ఇంగ్లండ్‌పై, 2003లో కెన్యాపై, 2011లో పాకిస్తాన్‌పై) నెగ్గి ఫైనల్స్‌కు చేరగా.. నాలుగుసార్లు (1987లో ఇంగ్లండ్ చేతిలో, 1996లో శ్రీలంక చేతిలో, 2015లో ఆ్రస్టేలియా చేతిలో, 2019లో న్యూజిలాండ్ చేతిలో) ఓటమి పాలైంది. భారత్ ఫైనల్స్‌కు చేరిన మూడు సందర్భాల్లో రెండుసార్లు (1983, 2011) విజేతగా, ఓసారి (2003) రన్నరప్‌గా నిలిచింది. -
ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
వన్డే వరల్డ్‌కప్ 2023లో ఇవాళ (నవంబర్ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్,న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మరి ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాలి. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మ్యాచ్‌కు సంబంధించిన పలు విషయాలు మాట్లాడారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్‌లలో మేం లక్ష్యాన్ని ఛేదించగా, తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నట్లే. వాటితో పోలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు. ప్రపంచకప్‌లో సెమీస్ అయినా లీగ్ మ్యాచ్ అయినా ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. భారత క్రికెటర్లపై ఇది మరీ ఎక్కువ. ఆటగాళ్లంతా ఆ స్థితిని దాటుకునే వచ్చారు కాబట్టి బాగా ఆడటమే అన్నింటికంటే ముఖ్యం. న్యూజిలాండ్ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టు. ప్రత్యర్ధిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులో ఎవ్వరూ పుట్టనే లేదు. 2011లో సగం మంది క్రికెట్ మొదలు పెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్ మ్యాచ్‌లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరమని అన్నాడు. చదవండి: భారత్‌తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్ -
భారత్‌తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్
వన్డే వరల్డ్‌కప్ 2023 చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో విజేత ఎవరో తేలిపోతుంది. ముంబై వేదికగా ఇవాళ (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. అండర్ డాగ్స్‌గా పేరున్న న్యూజిలాండ్‌పై ఏమేరకు రాణించగలదో వేచి చూడాలి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే వ్యూహరచనలన్నిటినీ పూర్తి చేసుకున్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. ఈ కీలక సమరానికి ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన వాయిస్‌ను వినిపించాడు. విలియమ్సన్ ఏమన్నాడంటే.. భారత్‌తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్ అనేది వాస్తవం. ఆ టీమ్ చాలా బాగా ఆడుతోంది. అయితే టోర్నీలో ప్రతీ మ్యాచ్ భిన్నమైందే. తమదైన రోజున ఏ జట్టయినా ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. జట్టు బలంతో పాటు అప్పటి పరిస్థితులు, వాటి ప్రభావం కూడా అందుకు కారణమవుతాయి. లీగ్‌లో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామన్నది ముఖ్యం కాదు. నాకౌట్ దశను మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. వరుసగా గత రెండు వరల్డ్ కప్‌లలో మేం ఫైనల్ చేరినా మమ్మల్ని ఇంకా అండర్‌డాగ్స్‌గానే చూస్తుంటారు. మేం వీటికి అలవాటుపడిపోయాం కాబట్టి ఇబ్బందేమీ లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇక్కడా గెలవగలం కాబట్టి ఏదైనా జరగొచ్చు. 2019లాగే ఈసారి కూడా మైదానంలో అంతా భారత అభిమానులే ఉంటారు. మాకు మద్దతు పలకకపోయినా ఆ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. మా జట్టులో చాలా మందికి ఇది అలవాటే. అయినా భారత గడ్డపై భారత్‌తో సెమీస్‌లో తలపడటమే ఎంతో ప్రత్యేకం. -
CWC 2023 Semi Final: టీమిండియా జోరుకు కివీస్ అడ్డుకట్ట వేయగలదా..?
వన్డే వరల్డ్‌కప్ 2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇదివరకే (లీగ్ దశలో) న్యూజిలాండ్‌ను ఓసారి ఖంగుతినిపించిన భారత్ మరో విజయంపై ధీమాగా ఉంది. కివీస్ సైతం ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్‌కు స్వర్గధామం.. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు వేదిక అయిన వాంఖడే మైదానం అనాదిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తూ వస్తుంది. రేపు జరుగబోయే సెమీస్ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టేడియం చిన్నది కావడంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాదగలరు. ఈ పిచ్‌పై మరోసారి భారీ స్కోర్ నమోదు కావడం ఖాయం. ఇదే పిచ్‌పై శ్రీలంకతో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు పేట్రేగిపోయారు. ఆ మ్యాచ్‌లో భారత్ 357 పరుగులు చేసి, శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ అత్యంత కీలకం.. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకపాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు పూర్తి స్థాయిలో అనుకూలించనుండటంతో టాస్ గెలిచిన జట్టు తప్పక బ్యాటింగ్ ఎంచుకుంటుంది. భారత్‌దే పైచేయి.. గతంలో ఇరు జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్‌ల్లో జయాపజయాలను పరిశీలిస్తే.. న్యూజిలాండ్‌పై భారత్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు గతంలో 117 సందర్భాల్లో ఎదురెదురుపడగా భారత్ 59, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టై కాగా.. ఏడు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిసాయి. వరల్డ్‌కప్‌లో కివీస్‌దే ఆధిక్యత.. వరల్డ్‌కప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తొమ్మిది సార్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ 4, భారత్ 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. సెమీస్‌లో వరుసగా రెండోసారి.. భారత్, న్యూజిలాండ్ జట్లు వరల్డ్‌కప్ సెమీఫైనల్లో వరుసగా రెండోసారి తలపడుతున్నాయి. 2019 ఎడిషన్‌లో ఈ ఇరు జట్లు తొలిసారి సెమీఫైనల్లో ఎదురెదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. ఇరు జట్ల బలాలు, బలహీనతలు.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఫామ్‌ను బట్టి చూస్తే, న్యూజిలాండ్ కంటే టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. భారత్ అన్ని విభాగాల్లో న్యూజిలాండ్ కంటే మెరుగ్గా ఉంది. భారత బ్యాటింగ్ విభాగంలో ప్రతి ఒక్కరూ సూపర్ టచ్‌లో ఉన్నారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ టీమిండియాకు తిరుగులేదు. ఓవరాల్‌గా చూస్తే, ప్రస్తుతం భారత్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. జట్టులోని ఆటగాళ్లంతా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ ఊపులో భారత్ టైటిల్ గెలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. న్యూజిలాండ్ విషయానికొస్తే.. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలు సాధించి, ఆతర్వాత ఒక్కసారిగా పరాజయాల బాటపట్టిన న్యూజిలాండ్, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచి సెమీస్‌కు చేరింది. అంతంతమాత్రం ప్రదర్శనతో సెమీస్‌కు చేరిన కివీస్‌ను గాయాల సమస్య ప్రధానంగా వేధిస్తుంది. మొన్నటి దాకా కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలోనే న్యూజిలాండ్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ గాయంపాలై, ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించాడు. మరోవైపు ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. గాయాల బెదడతో పాటు న్యూజిలాండ్‌ను నిలకడలేమి కూడా వేధిస్తుంది. రచిన్ రవీంద్ర, అడపాదడపా డారిల్ మిచెల్ మినహా జట్టులోని ఆటగాళ్లంతా తరుచూ విఫలమవుతున్నారు. వీరిలో విలియమ్సన్ కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్ విభాగం వరకు న్యూజిలాండ్ పటిష్టంగా కనిపిస్తుంది. బౌల్ట్, ఫెర్గూసన్, సాంట్నర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్ కాన్వే వైఫల్యాలు కివీస్‌ను కలవరపెడుతున్నాయి. -
CWC 2023: లీగ్ దశ ముగిసాక పరిస్థితి ఇది.. విరాట్, జంపా టాప్‌లో..!
భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్ 2023 రౌండ్ రాబిన్ (లీగ్) దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. బుధవారం (నవంబర్ 15) జరిగే తొలి సెమీఫైనల్లో (ముంబై) నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా.. నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్‌కతా) మూడో స్థానంలో ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అనంతరం ఈ రెండు సెమీస్‌లో గెలిచే జట్లు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లీడింగ్ రన్ స్కోరర్‌గా విరాట్.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్‌లు ముగిసాక టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ దశలో విరాట్ 9 మ్యాచ్‌లు ఆడి 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 99 సగటున 594 పరుగులు చేశాడు. ఈ జాబితాలో డికాక్ (9 మ్యాచ్‌ల్లో 591 పరుగులు), రచిన్ రవీంద్ర (9 మ్యాచ్‌ల్లో 565 పరుగులు), రోహిత్ శర్మ (9 మ్యాచ్‌ల్లో 503 పరుగులు), డేవిడ్ వార్నర్ (9 మ్యాచ్‌ల్లో 499 పరుగులు) టాప్-5లో ఉన్నారు. లీగ్ దశలో డికాక్ 4 సెంచరీలతో టాప్‌లో ఉండగా.. రచిన్ 3, విరాట్, వార్నర్, డస్సెన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్ తలో 2 సెంచరీలు చేశారు. టాప్‌లో జంపా.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్‌లు ముగిసాక ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. జంపా 9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మధుషంక (9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు), షాహీన్ అఫ్రిది (9 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (7 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్-5లో నిలిచారు. భారత బౌలర్లు జడేజా (9 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు), షమీ (5 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. -
CWC 2023: పాక్ సెమీస్‌కు చేరి భారత్‌తో తలపడాలంటే ఇలా జరగాలి..
ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాక్‌లు మరోసారి (సెమీస్‌లో) తలపడే అవకాశాలు మినుకుమినుకుమంటున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణుడి కటాక్షంతో గట్టెక్కి,సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న పాక్, తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారీ తేడాతో నెగ్గితే సెమీస్‌కు చేరే ఛాన్స్ ఉంటుంది. పాక్ సెమీస్‌కు చేరి, భారత్‌తో తలపడాలంటే ఈ ఈక్వేషన్‌తో పాటు మరో రెండు ఈక్వేషన్స్ వర్కౌట్ అవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే.. న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడాలి. ఇలా జరిగితే పాక్ 10 పాయింట్లతో నాలుగో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న భారత్.. నాలుగో ప్లేస్‌లో ఉన్న పాక్ సెమీస్‌లో తలపడతాయి. అయితే ఇలా జరగడం అంత ఈజీ కూడా కాకపోవచ్చు. ఒకవేళ పాక్.. ఇంగ్లండ్‌పై గెలచి, మరోపక్క న్యూజిలాండ్.. శ్రీలంకను మట్టికరిపిస్తే అప్పుడు ఈ ఇరు జట్లలో మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుని భారత్‌తో తలపడుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లో ఏదో ఒక జట్టుపై భారీ తేడాతో గెలిచినా ఆ జట్టు కూడా సెమీస్ రేసులో నిలుస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా పాక్ సెమీస్‌కు చేరాలంటే ఆ జట్టు ఇంగ్లండ్‌పై విజయం సాధించి, న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడి, ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడితే సరిపోతుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ఎలిమినేషన్‌కు గురి కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం ఆసీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోటీ నడుస్తుంది. -
WC 2023: ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్ సెమీస్ చేరే ఛాన్స్! ఎలా?
ICC WC 2023- Pakistan Semis Chances Still Alive?: వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావించిన పాకిస్తాన్.. ఇప్పుడు కనీసం సెమీస్ చేరుతుందా లేదా అన్న స్థాయికి పడిపోయింది. ప్రపంచకప్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి.. విమర్శలు మూటగట్టుకుంటోంది. ఉప్పల్‌లో వరుస విజయాలు వన్డే ప్రపంచకప్ 13వ ఎడిషన్‌లో తొలుత పసికూన నెదర్లాండ్స్‌తో తలపడింది బాబర్ ఆజం బృందం. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐసీసీ టోర్నీలో శుభారంభం చేసింది. ఆ తర్వాత అదే వేదికపై శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. ఎప్పుడైతే దాయాది టీమిండియా చేతిలో పాక్ చిత్తైందో అప్పటి నుంచి జట్టు రాత మారిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చరిత్రను పునరావృతం చేస్తూ భారత జట్టు పాకిస్తాన్‌ను 8వసారి మట్టికరిపించింది. టీమిండియా దెబ్బ తర్వాత అన్నీ ఓటములే సొంతగడ్డపై చిరకాల ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఇది మొదలు.. టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్‌కు వరుసగా ఓటములే ఎదురయ్యాయి. చెపాక్‌లో ఘోర పరాభవాలు.. ఎన్నడూ లేని విధంగా బెంగళూరులో ఆస్ట్రేలియా చేతిలో 62 పరుగుల తేడాతో ఓడిన బాబర్ బృందం.. వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ ముందు కూడా తలవంచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరీ దారుణంగా 8 వికెట్ల తేడాతో అఫ్గన్ భంగపాటుకు గురైంది. ఈ క్రమంలో సెమీస్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ సీన్ రిపీట్ అయింది. చెపాక్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్‌లో అదృష్టం సౌతాఫ్రికాను వరించడంతో పాకిస్తాన్‌కు మరో ఓటమి తప్పలేదు. ఈ శతాబ్దంలో వరల్డ్‌కప్‌లో పాక్ తొలిసారి సఫారీల చేతిలో పరాజయం పాలైంది. దీంతో సెమీస్ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే! అయితే, సాంకేతికంగా పాకిస్తాన్ ఇంకా రేసులో ఉన్నట్లే! ఎలా అంటే.. ఈ టోర్నీలో పాకిస్తాన్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో జరుగనున్న మ్యాచ్‌లలో పాక్ భారీ విజయాలు సాధించి రన్‌రేటును మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. తద్వారా పాకిస్తాన్ ఖాతాలో 10 పాయింట్లు చేరతాయి. అయినప్పటికీ నేరుగా సెమీస్ చేరే ఛాన్స్ ఉండదు. ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే సౌతాఫ్రికా(భారీ రన్‌రేటు), టీమిండియా 10 పాయింట్లో పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడిన పాక్ భవితవ్యం న్యూజిలాండ్ 8, ఆస్ట్రేలియా 6 పాయింట్లతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మిగిలిన మ్యాచ్‌లన్నింటి(ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాక్, శ్రీలంక)లో ఓడిపోతే.. కేవలం ఎనిమిది పాయింట్లతో ఉంటుంది. అప్పుడు పాక్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే విధంగా.. ఆస్ట్రేలియా కూడా తమకు మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిపోతే పాక్‌కు ఛాన్స్ ఉంటుంది. తమ తదుపరి మ్యాచ్‌లలో ఆసీస్ న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడి.. బంగ్లాదేశ, అఫ్గనిస్తాన్‌లలో ఏదో ఒకదానిపై గెలిచినా 8 పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి ఈ అవకాశం పాక్‌కు దక్కుతుంది. ఇంతదాకా తెచ్చుకోవడం ఎందుకు? చూద్దాం అలా కాక కేవలం న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో కంగారూలు ఓడి అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లపై గెలుపొందితే.. పాకిస్తాన్‌తో పాటు రన్‌రేటుతో పోటీపడాల్సి ఉంటుంది. ఇదేమీ కాకుండా ఆసీస్ మూడూ గెలిచినా.. న్యూజిలాండ్ రెండు, సౌతాఫ్రికా, టీమిండియా తమకు మిగిలిన మ్యాచ్‌లలో కనీసం రెండు గెలుపొందినా పాక్ ఇంటిబాటపట్టాల్సిందే! అదీ సంగతి.. గత నాలుగు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి దాపురించేది కాదు! కెప్టెన్ బాబర్ ఆజం అన్నట్లు ఏం జరుగుతుందోనంటూ పాక్ అభిమానులు వేచి చూడాల్సిందే. చదవండి: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే! View this post on Instagram A post shared by ICC (@icc)