![CWC 2023 IND VS NZ Semi Final: Virat Kohli Will Be The First Indian Cricketer To Play 4 ODI WC Semi Final - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/15/dsdfssdf.jpg.webp?itok=6vUIh4N8)
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి అరుదైన గుర్తింపు దక్కనుంది. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు సెమీస్ ఆడిన భారత ఆటగాడిగా విరాట్ రికార్డుల్లోకెక్కనున్నాడు. 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 15) జరుగనున్న సెమీఫైనల్లో ఆడటం ద్వారా విరాట్ ఈ రేర్ ఫీట్‌ను సాధించనున్నాడు.
35 ఏళ్ల విరాట్ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో నాలుగోసారి (2011, 2015, 2019, 2023) వన్డే సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఏ భారత ఆటగాడు నాలుగుసార్లు వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ ఆడలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (1996, 2003, 2011), ధోని (2011, 2015, 2019) మూడుసార్లు చొప్పున వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ ఆడారు. మొత్తంగా భారత్ 8 వన్డే సెమీఫైనల్స్ ఆడగా విరాట్ నాలుగింట భాగం కావడం విశేషం.
ఇక భారత్ ఆడిన సెమీఫైనల్స్ విషయానికొస్తే.. ఇప్పటిదాకా మొత్తం 13 వన్డే ప్రపంచకప్‌లు (ప్రస్తుత వరల్డ్‌కప్‌తో కలుపుకుని) జరగ్గా భారత్ ఎనిమిదింట సెమీస్‌కు చేరింది. ఇందులో మూడుసార్లు (1983లో ఇంగ్లండ్‌పై, 2003లో కెన్యాపై, 2011లో పాకిస్తాన్‌పై) నెగ్గి ఫైనల్స్‌కు చేరగా.. నాలుగుసార్లు (1987లో ఇంగ్లండ్ చేతిలో, 1996లో శ్రీలంక చేతిలో, 2015లో ఆ్రస్టేలియా చేతిలో, 2019లో న్యూజిలాండ్ చేతిలో) ఓటమి పాలైంది. భారత్ ఫైనల్స్‌కు చేరిన మూడు సందర్భాల్లో రెండుసార్లు (1983, 2011) విజేతగా, ఓసారి (2003) రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment