భారత స్టార్ షెట్లర్ లక్ష్యసేన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇటీవలే కెనడా ఓపెన్‌ను గెలిచి దూకుడు మీదున్న లక్ష్యసేన్ మరో టైటిల్ గెలిచేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మన దేశానికే చెందిన శంకర్ ముత్తుస్వామిపై 21-10, 21-17తో వరుస గేముల్లో గెలిచిన లక్ష్యసేన్ సెమీస్‌కు చేరుకున్నాడు.
మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు మాత్రం క్వార్టర్స్‌లోనే తన పోరాటాన్ని ముగించింది. క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన గావో ఫాంగ్ జీ చేతిలో 22-20, 21-13తో సింధు ఓటమి పాలయ్యింది. ప్రపంచ 36వ ర్యాంకర్ అయిన గావో ఫాంగ్ జీ తొలి గేమ్‌ను గెలవడానికి కష్టపడినప్పటికి.. రెండో గేమ్‌ను మాత్రం సులువుగానే నెగ్గింది.
చదవండి: #BAN Vs AFG: ఈజీగా గెలవాల్సిన మ్యాచ్.. చచ్చీ చెడీ చివరకు
Comments
Please login to add a commentAdd a comment