కౌన్సిల్ బ్లఫ్స్ (అమెరికా): యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌లు క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. శుక్రవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో సింధు చైనీస్ తైపీకి చెందిన సంగ్ షువో యన్‌ను 21-14, 21-12తో ఓడించింది. ఇక లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాన్ లౌడాను 21-8, 23-21తో మట్టికరిపించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.
అంతకముందు తొలి రౌండ్‌లో సింధు 21–15, 21–12తో దిశా గుప్తా (అమెరికా)పై నెగ్గింది. హైదరాబాద్ అమ్మాయి గద్దె రుతి్వక శివాని 14–21, 11–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. లక్ష్య సేన్ 21–8, 21–16తో కాలి కొల్జోనెన్ (ఫిన్‌లాండ్)పై, శంకర్ ముత్తుస్వామి 21–11, 21–16తో ఎన్‌హట్ నుగుయెన్ (ఐర్లాండ్)పై నెగ్గారు. హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ 15–21, 12–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ లి షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు.
చదవండి: #JyothiYarraji: జ్యోతి యర్రాజీకి సీఎం జగన్ అభినందనలు
#YashasviJaiswal: 'ఇది ఆరంభం మాత్రమే.. చేయాల్సింది చాలా ఉంది'
Comments
Please login to add a commentAdd a comment