quarter finals
-
జెస్సికా జోరు
న్యూయార్క్: ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ ‘ఫోబియా’ను అమెరికా టెన్నిస్ ప్లేయర్ జెస్సికా పెగూలా అధిగమించింది. సొంతగడ్డపై అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన జెస్సికా ఏకంగా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌ను బోల్తా కొట్టించింది. ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఈసారి అమెరికా క్రీడాకారులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి అడుగు పెట్టగా... మహిళల సింగిల్స్‌లోనూ ఇద్దరు అమెరికా క్రీడాకారిణులు జెస్సికా పెగూలా, ఎమ్మా నవారో సెమీఫైనల్‌కు చేరుకోవడం విశేషం.సినెర్, డ్రేపర్ తొలిసారి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), 25వ ర్యాంకర్ జాక్ డ్రేపర్ (బ్రిటన్) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సినెర్ 6–2, 1–6, 6–1, 6–4తో 2021 చాంపియన్, గత ఏడాది రన్నరప్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందగా... డ్రేపర్ 6–3, 7–5, 6–2తో పదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)ను ఓడించాడు. కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన డ్రేపర్ యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకున్న నాలుగో బ్రిటన్ ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో గ్రెగ్ రుసెద్‌స్కీ (1997), టిమ్ హెన్మన్ (2004), ఆండీ ముర్రే (2008, 2011, 2012) ఈ ఘనత సాధించారు. ఏడో ప్రయత్నంలో...కెరీర్లో 23వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న 30 ఏళ్ల జెస్సికా గతంలో ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఈ ఆరుసార్లూ ఆమె క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. కానీ ఏడో ప్రయత్నంలో జెస్సికా సఫలమైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో క్వార్టర్ ఫైనల్లో జెస్సికా 6–2, 6–4తో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్)ను కంగుతినిపించింది. 88 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 12 విన్నర్స్ కొట్టిన జెస్సికా 22 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘గతంలో పలుమార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఓడిపోయాను. సెమీఫైనల్ ఎప్పుడు చేరుకుంటావు అని నా శ్రేయోభిలాషులు అడుగుతుండేవారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. ఎట్టకేలకు క్వార్టర్ ఫైనల్‌ను దాటి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని జెస్సికా వ్యాఖ్యానించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)తో జెస్సికా; ఎమ్మా నవారో (అమెరికా)తో సబలెంకా (బెలారస్) తలపడతారు. -
క్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసిన భారత్ పోరు
చెంగ్డూ: థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో 10 సార్లు చాంపియన్ చైనా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ 21–15, 11–21, 14–21తో షి యుకి చేతిలో... రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 15–21, 21–11, 12–21తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 13–21, 21–8, 21–14తో లి షి ఫెంగ్‌పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్‌లో సాయిప్రతీక్–ధ్రువ్ కపిల 10–21, 10–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత పరాజయం ఖరారైంది. ఉబెర్ కప్ మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్లో ద్వితీయ శ్రేణి క్రీడాకారిణులతో బరిలోకి దిగిన భారత జట్టు 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో అషి్మత 10–21, 22–20, 15–21తో అయా ఒహోరి చేతిలో... ప్రియ–శ్రుతి మిశ్రా 8–21, 9–21తో నామి మత్సుయామ–చిహారు షిదా చేతిలో... ఇషారాణి 15–21, 12–21తో ఒకుహారా చేతిలో ఓడిపోయారు. -
Ranji Trophy: ఆంధ్ర సహా క్వార్టర్ ఫైనల్ చేరిన జట్లు ఇవే
Ranji Trophy 2023-24- Quarter Finals: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు సోమవారంతో ముగిశాయి. ఎలైట్ డివిజన్లో మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా (ఎ, బి,సి,డి; 8 జట్ల చొప్పున) విభజించారు. గ్రూప్ ‘బి’లో ముంబై జట్టు 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... ఆంధ్ర జట్టు 26 పాయింట్లతో (3 విజయాలు, 3 ‘డ్రా’, 1 ఓటమి) రెండో స్థానంలో నిలిచింది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌కంటే ముందే ఈ రెండు జట్లకు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ (33 పాయింట్లు), సౌరాష్ట్ర (28 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి తమిళనాడు (28 పాయింట్లు), కర్ణాటక (27 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి మధ్యప్రదేశ్ (32 పాయింట్లు), బరోడా (26 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఎలైట్ డివిజన్‌కు హైదరాబాద్ అర్హత కాగా 32 జట్లలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన మణిపూర్, గోవా జట్లు వచ్చే సీజన్‌కు ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోగా... ‘ప్లేట్’ డివిజన్లో ఫైనల్ చేరిన హైదరాబాద్, మేఘాలయ ఎలైట్ డివిజన్‌కు అర్హత పొందాయి. ఫిబ్రవరి 23 నుంచి క్వార్టర్ ఫైనల్స్ ►ఇక ఈనెల 23 నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటకతో విదర్భ (నాగ్‌పూర్‌లో- Vidarbha vs Karnataka, 1st Quarter Final) ►ముంబైతో బరోడా (ముంబైలో- Mumbai vs Baroda, 2nd Quarter Final) ►తమిళనాడుతో సౌరాష్ట్ర (కోయంబత్తూరులో- Tamil Nadu vs Saurashtra, 3rd Quarter Final) ►మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర (ఇండోర్‌లో- Madhya Pradesh vs Andhra, 4th Quarter Final ) తలపడతాయి. ఆటకు వీడ్కోలు ఇక రంజీ తాజా సీజన్ సందర్భంగా ఐదుగురు క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికారు. మనోజ్ తివారి(బెంగాల్), ధవళ్ కులకర్ణి(ముంబై), సౌరభ్ తివారి(జార్ఖండ్), ఫైజ్ ఫజల్(విదర్భ), వరుణ్ ఆరోన్(జార్ఖండ్) ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో? -
India Open 2024: క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–14, 21–15తో చింగ్ యావో లు–పో హాన్ యాంగ్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 20–22, 21–14, 21–14తో గెలుపొందాడు. -
క్వార్టర్స్‌లో పీవీ సింధు.. ఫామ్‌లోకి వచ్చినట్లేనా!
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతుంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్‌ను 21-14, 21-10 తేడాతో మట్టికరిపించింది. కేవలం 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన సింధు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సింధు ఆడిన గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. తాజాగా మాత్రం క్వార్టర్స్‌కు చేరుకోవడంతో ఫామ్‌లోకి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇక క్వార్టర్స్‌లో సింధు అమెరికాకు చెందిన నాలుగో సీడ్ బీవెన్ జాంగ్‌తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. రెండో రౌండ్లో శ్రీకాంత్.. చైనీస్ తైపీకి చెందిన సూ లీ యాంగ్‌ను 21-10, 21-17తో వరుస గేముల్లో ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇక మరో గేమ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన వై. చీని 21-19, 19-21, 21-13తో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక భారత్‌కే చెందిన మరో షట్లర్ ప్రియాన్షు రజావత్ ఆకట్టుకున్నాడు. రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జూ వెయ్‌పై 21-, 13-21, 21-19తో కష్టపడి గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక ప్రియాన్షు రజావత్.. క్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌తో తలపడనున్నాడు. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Matthew Wade: కళ్లు చెదిరే ఫీల్డింగ్.. 35 ఏళ్ల వయసులో విన్యాసాలేంటి బ్రో? -
క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. సింగిల్స్ విభాగంలో హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్‌లు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. డబుల్స్ విభాగంలో టాప్ షట్లర్లు స్వాతిక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి జోరు కనబరుస్తూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్ జపాన్‌కు చెందిన కాంటా సునేయమాపై 21-14, 21-16 వరుస గేముల్లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ జోడి డెన్మార్క్‌కు చెందిన జెప్ బే- లాసే మొల్హెగ్డే ద్వయంపై 21-17, 21-11 వరుస సెట్లలో ఖంగుతినిపించారు. Lakshya Sen 🇮🇳 sets the pace against Kanta Tsuneyama 🇯🇵.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/INyZMUO6HR — BWF (@bwfmedia) July 27, 2023 ఇక హెచ్ఎస్ ప్రణయ్.. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో మన దేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్‌పై 19-21, 21-9, 21-9 తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ప్రణయ్ తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికి ఆ తర్వాత ఫుంజుకొని రెండు వరుస గేములను గెలుచుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో భారత టాప్ జోడి ట్రీసా జోలీ-పుల్లెల గాయత్రి గోపిచంద్ జంట ప్రీక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. జపాన్‌కు చెందిన నమీ మత్సయుమా-చిమారు షీడా చేతిలో 21-13, 19-21తో ఓటమిపాలయ్యారు. చదవండి: SL Vs PAK 2nd Test: ఏడు వికెట్లతో చెలరేగిన 36 ఏళ్ల పాక్ బౌలర్.. సిరీస్ క్లీన్‌స్వీప్ Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! -
క్వార్టర్ ఫైనల్లో సింధు, లక్ష్యసేన్
కౌన్సిల్ బ్లఫ్స్ (అమెరికా): యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. శుక్రవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో సింధు చైనీస్ తైపీకి చెందిన సంగ్ షువో యన్ను 21-14, 21-12తో ఓడించింది. ఇక లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లో చెక్ రిపబ్లిక్కు చెందిన జాన్ లౌడాను 21-8, 23-21తో మట్టికరిపించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. అంతకముందు తొలి రౌండ్లో సింధు 21–15, 21–12తో దిశా గుప్తా (అమెరికా)పై నెగ్గింది. హైదరాబాద్ అమ్మాయి గద్దె రుతి్వక శివాని 14–21, 11–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. లక్ష్య సేన్ 21–8, 21–16తో కాలి కొల్జోనెన్ (ఫిన్లాండ్)పై, శంకర్ ముత్తుస్వామి 21–11, 21–16తో ఎన్‌హట్ నుగుయెన్ (ఐర్లాండ్)పై నెగ్గారు. హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ 15–21, 12–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ లి షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. చదవండి: #JyothiYarraji: జ్యోతి యర్రాజీకి సీఎం జగన్ అభినందనలు #YashasviJaiswal: 'ఇది ఆరంభం మాత్రమే.. చేయాల్సింది చాలా ఉంది' -
Madrid Spain Masters: క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
మాడ్రిడ్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో ప్రపంచ 38వ ర్యాంకర్ పుత్రి కుసుమ వర్దిని (ఇండోనేసియా)పై 36 నిమిషాల్లో విజయం సాధించింది. ఈ గెలుపుతో గత వారం స్విస్ ఓపెన్‌లో కుసుమ వర్దిని చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత్‌కే చెందిన అష్మిత చాలిహా 15–21, 15–21తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓడిపోగా... గాయం కారణంగా మాళవిక బన్సోద్ తన ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్)కు వాకోవర్ ఇచ్చింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–15, 21–12తో భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన కిరణ్ జార్జి 17–21, 12–21తో మాగ్నస్ జొహాన్సెన్ (డెన్మార్క్) చేతిలో, ప్రియాన్షు రజావత్ 14–21, 15–21తో తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సమీర్ వర్మ 15–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ఆరతి (భారత్) జోడీ 12–21, 13–21తో రుయ్ హిరోకామి–యునా కాటో (జపాన్) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జంట 16–21, 20–22తో షున్టారో మెజకి–హరుయ నిషిద (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
శభాష్ విహారి.. నీ పోరాటానికి సలాం, మణికట్టు గాయమైనా ఒంటి చేత్తో వీరోచిత పోరాటం
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో హనుమ విహారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ జట్టు వరుస విజయాలు నమోదు చేస్తూ, నిన్న (జనవరి 31) మధ్యప్రదేశ్‌తో మొదలైన క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగిస్తుంది. రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) అద్భుత శతకాలతో రెచ్చిపోగా.. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు విఫలమవ్వడంతో ఆంధ్ర టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్.. రెండో రోజు టీ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసి, ఏపీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 327 పరుగుల వెనుకంజలో ఉంది. యశ్ దూబే (20), హిమాన్షు మంత్రి (22) ఔట్ కాగా.. శుభమ్ శర్మ (5), రజత్ పాటిదార్ క్రీజ్‌లో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, పృథ్వీ రాజ్ యర్రాకు తలో వికెట్ పడింది. కాగా, రెండో రోజు ఆంధ్ర ఇన్నింగ్స్ ఆఖర్లో హనుమ విహారి (57 బంతుల్లో 27; 5 ఫోర్లు) కనబర్చిన వీరోచిత పోరాటం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. తొలి రోజు ఆటలో 16 పరుగుల వద్ద ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గాయపడిన విహారి.. మణికట్టు ఫ్రాక్చర్ కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అయితే రెండో రోజు ఆటలో కరణ్ షిండే, రికీ భుయ్ సెంచరీల తర్వాత వెనువెంటనే ఔట్ అయ్యాక.. ఆంధ్ర ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఏపీ టీమ్.. 30 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ దశలో (353/9) మణికట్టు ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన విహారి.. గతంలో సిడ్నీ టెస్ట్‌లో చేసిన వీరోచిత పోరాటాన్ని మళ్లీ గుర్తు చేశాడు. Hanuma vihari batting with left hand due to the fracture of his wrist pic.twitter.com/qywEd31S5o — cric_mawa (@cric_mawa_twts) February 1, 2023 కుడి చేయికి ఫ్రాక్చర్ కావడంతో ఎడమ చేత్తో, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన విహారి జట్టు స్కోర్‌కు అతిమూల్యమైన 26 పరుగులు జోడించి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. విహారి సాహసోపేతమైన పోరాటానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. సలాం విహారి.. నువ్వు నిజమైన పోరాట యోధుడివి, జట్టు మనిషివి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నొప్పిని భరిస్తూ.. ఎడమ చేతిని కాపాడుకుంటూ విహారి చేసిన బ్యాటింగ్ విన్యాసం చరిత్రలో నిలిచిపోతుందని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. గాయపడ్డాక బరిలోకి దిగిన విహారి రెండు బౌండరీలు బాదడం, అందులో ఒకటి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో కావడం మరో విశేషం. -
లక్ష్య సేన్ ఓటమి.. అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో కూడా ఇంటికే
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఓడిపోయారు. ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–15, 10–21, 13–21తో మూడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో స్కోరు 15–15తో సమంగా ఉన్నపుడు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే క్రిస్టీ పుంజుకొని వరుసగా రెండు గేముల్లో గెలిచి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా 13–21, 18–21తో యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: MS Dhoni: ఏ మాత్రం తగ్గని ధోని మేనియా T20 WC Ind Vs Eng: ఆసీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు! చరిత్రకు అడుగు దూరంలో భారత్. End of 🇮🇳's campaign. 📸: @badmintonphoto#IndonesiaMasters2023#Badminton pic.twitter.com/etm7svf1rQ — BAI Media (@BAI_Media) January 27, 2023 -
Caroline Garcia: గార్సియాకు ఊహించని షాక్! లినెట్టి తొలిసారి..
Australian Open 2023: మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) కథ ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ 45వ ర్యాంకర్ మగ్దా లినెట్టి (పోలాండ్) 7–6 (7/3), 6–4తో గార్సియాను ఓడించింది. ఈ గెలుపుతో 30 ఏళ్ల మగ్దా లినెట్టి తన 30వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 7–5, 6–2తో 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)పై, డొనా వెకిచ్ (క్రొయేషియా) 6–2, 1–6, 6–3తో ఫ్రువిర్తోవా (చెక్ రిపబ్లిక్)పై, 30వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–0, 6–4తో షుయె జాంగ్ (చైనా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. చదవండి: KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. SA20 2023: ఐపీఎల్లో నిరాశపరిచినా.. ఆ లీగ్‌లో మాత్రం దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్ -
సంచలనం సృష్టించిన అన్‌సీడెడ్ క్రీడాకారులు.. జొకోవిచ్‌తో పాటు..
Australian Open 2023- మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పదోసారి విజేతగా నిలిచేందుకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మూడు విజయాల దూరంలో ఉన్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–2, 6–1, 6–2తో 22వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 126 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ కేవలం ఐదు గేమ్‌లను మాత్రమే తన ప్రత్యర్థికి కోల్పోయాడు. ఆరుసార్లు అలెక్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 26 విన్నర్స్ కొట్టాడు. నెట్ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి 14 సార్లు పాయింట్లు నెగ్గిన అతను తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా ప్రత్యర్థికి బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. గట్టెక్కి రెండోసారి.. మరోవైపు.. ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) ఐదు సెట్ల హోరాహోరీ పోరులో గట్టెక్కి రెండోసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్ 6–3, 3–6, 6–3, 4–6, 7–6 (11/9)తో హోల్గర్ రూన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. సంచలనం సృష్టించి.. జొకోవిచ్‌తో పాటు అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారులు టామీ పాల్, బెన్ షెల్టన్ తమ సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టామీ పాల్ 6–2, 4–6, 6–2, 7–5తో 24వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై, బెన్ షెల్టన్ 6–7 (5/7), 6–2, 6–7 (4/7), 7–6 (7/4), 6–2తో జేజే వుల్ఫ్ (అమెరికా)పై గెలిచారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రుబ్లెవ్తో జొకోవిచ్; బెన్ షెల్టన్‌తో టామీ పాల్ తలపడతారు. చదవండి: Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. -
Malaysia Open 2023: క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రణయ్ 21–9, 15–21, 21–16 స్కోరుతో చికో అరా వర్డొయో (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ 21–19, 22–20తో 49 నిమిషాల్లోనే షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా)ను చిత్తు చేశారు. అయితే మహిళల డబుల్స్‌లో మాత్రం భారత్ కథ ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో భారత ద్వయం పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 13–21, 21–15, 17–21 తేడాతో గాబ్రియా స్టోవా – స్టెఫానీ స్టోవా (బల్గేరియా) చేతిలో ఓటమిపాలయ్యారు. -
పోర్చు‘గోల్స్’ మోత
దోహా: ఆరంభం నుంచి సూపర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను ఆడించకపోయినా... తమ జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదని నిరూపిస్తూ పోర్చుగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో కళ్లు చెదిరే ప్రదర్శనతో మెరిసింది. ఆద్యంతం దూకుడుగా ఆడుతూ, పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ రొనాల్డో లేకున్నా పోర్చుగల్ జట్టు భవిష్యత్‌కు ఢోకా లేదని నిరూపించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన చివరి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 6–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను చిత్తుగా ఓడించి 16 ఏళ్ల తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోర్చుగల్ తరఫున తొలి ప్రపంచకప్‌లో ఆడుతున్న 21 ఏళ్ల గొన్సాలో రామోస్ (17వ, 51వ, 67వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేయగా... పెపె (33వ ని.లో), రాఫెల్ గెరెరో (55వ ని.లో), రాఫెల్ లియా (90+2వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్విట్జర్లాండ్ జట్టుకు మాన్యుయెల్ అకాంజీ (58వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. చివరిసారి 1954లో ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్విట్జర్లాండ్ ఆ తర్వాత ఐదుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరోవైపు ఎనిమిదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 1966లో మూడో స్థానంలో నిలిచిన పోర్చుగల్, 2006లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 10న జరిగే క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో పోర్చుగల్ తలపడుతుంది. తొలిసారి సబ్‌స్టిట్యూట్‌గా రొనాల్డో... వరుసగా ఐదో ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి తుది 11 మంది జట్టులో చోటు కోల్పోయాడు. రొనాల్డో స్థానంలో గొన్సాలో రామోస్‌ను తొలి నిమిషం నుంచి ఆడించాలని కోచ్ ఫెర్నాండో సాంటోస్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జాతీయ జట్టుకు ఒక్క మ్యాచ్ ఆడకుండానే నేరుగా ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించిన రామోస్ ఘనా, ఉరుగ్వేలతో మ్యాచ్‌ల్లో సబ్‌స్టిట్యూట్‌గా చివరి నిమిషాల్లో బరిలోకి దిగాడు. అయితే కీలకమైన మ్యాచ్‌లో అత్యంత అనుభవజ్ఞుడు, 37 ఏళ్ల రొనాల్డోను కాదని రామోస్‌ను ఆరంభం నుంచే ఆడించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే తన ఎంపిక సరైనదేనని రామోస్ నిరూపించుకున్నాడు. మూడు గోల్స్ చేయడమే కాకుండా గెరెరో గోల్ చేయడానికి రామోస్ సహాయపడ్డాడు. పోర్చుగల్ ఖాతాలో ఐదు గోల్స్ జమయ్యాక.. 74వ నిమిషంలో రొనాల్డోను జావో ఫెలిక్స్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి పంపించారు. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో రొనాల్డో రిజర్వ్ బెంచ్‌కు పరిమితమై మ్యాచ్ మధ్యలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
FIFA WC: నరాలు తెగే ఉత్కంఠ.. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16కు చేరిన జట్లు నాకౌట్ దశ కావడంతో గెలిచిన జట్టు ముందుకు.. ఓడిన జట్టు ఇంటికి చేరుతుంది. ఈ దశలో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన రౌండ్ ఆఫ్ 16లో మెస్సీ బృందం 2-0తో విజయం సాధించింది. గత మ్యాచ్‌లో గోల్ చేయడంలో విఫలమైన మెస్సీ ఈ మ్యాచ్‌లో మాత్రం కీలక దశలో మెరిశాడు. ఆట 35వ నిమిషంలో లెఫ్ట్ కార్నర్ నుంచి గోల్ కొట్టడంతో అర్జెంటీనా బోణీ చేసింది. ఆ తర్వాత తొలి హాఫ్‌టైమ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్థభాగం మొదలయిన కాసేపటికే ఆట 57వ నిమిషంలో ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాథ్యూ రేయాన్‌ను బోల్తా కొట్టిస్తూ సింపుల్ గోల్ చేయడంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కు పెరిగింది. ఆ తర్వాత ఆట 77వ నిమిషంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఫెర్నాండేజ్ సెల్ఫ్‌గోల్ చేయడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. అయితే ఆ తర్వాత పలుమార్లు ఇరుజట్లు గోల్‌పోస్ట్‌పై దాడులు చేయడంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు అర్జెంటీనా 2-1తో విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక మెస్సీకి తన కెరీర్లో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా డిసెంబర్ 10న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. • Messi's 🤌🏻 placement 🎯 • Alvarez's alertness 🚨 • Goodwin with a glimmer of hope 🙏 Watch all the 3️⃣ goals from #ARGAUS & keep watching the #FIFAWorldCup on #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/3gOHiOknZq — JioCinema (@JioCinema) December 3, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు FIFA WC: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి -
World Wrestling Championships: కాంస్యం రేసులో బజరంగ్
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించేందుకు మరో అవకాశం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో భారత స్టార్ రెజర్ల్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత బజరంగ్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. శనివారం జరిగిన 65 కేజీల విభాగంలో 28 ఏళ్ల బజరంగ్ క్వార్టర్ ఫైనల్లో 0–10తో జాన్ మైకేల్ డియాకొమిహాలిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు బజరంగ్ ప్రిక్వా ర్టర్ ఫైనల్లో 5–4తో అలెజాంద్రో ఎన్రిక్ వాల్డెస్ (క్యూబా)పై గెలుపొందాడు. బజరంగ్‌ను ఓడించిన జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ద్వారా బజరంగ్‌కు కాంస్య పతకం గెలిచే అవకాశం వచ్చింది. వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా), వ్లాదిమిర్ దుబోవ్ (బల్గేరియా) మధ్య విజేతతో నేడు జరిగే ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో బజరంగ్ తలపడతాడు. ఈ బౌట్లో బజరంగ్ గెలిస్తే కాంస్య పతకం కోసం సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)తో ఆడతాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో మూడు పతకాలు సాధించాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. మరోవైపు పురుషుల 74 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాగర్ జగ్లాన్ కాంస్య పతకం సాధించలేకపోయాడు. ఆసియా చాంపియన్ యూనస్ అలీఅక్బర్ (ఇరాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో సాగర్ 0–6తో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన విక్కీ (97 కేజీలు), పంకజ్ (61 కేజీలు) తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. వీరిద్దరిని ఓడించిన రెజ్లర్లు తదనంతరం ఫైనల్ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం సాధించే అవకాశం లేకుండా పోయింది. -
US Open 2022: అల్కరాజ్ అద్భుతం
న్యూయార్క్: 315 నిమిషాలు... 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్, 21 ఏళ్ల జన్నిక్ సిన్నర్ మధ్య జరిగిన యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ సమరమిది. యూఎస్ ఓపెన్ చరిత్రలో రెండో సుదీర్ఘ పోరుగా రికార్డులకెక్కిన ఈ మ్యాచ్‌లో ఇరువురు ఆటగాళ్లు కొదమసింహాల్లా తలపడగా చివరకు అల్కరాజ్దే పైచేయి అయింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ముగిసిన ఈ మ్యాచ్‌లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (7/9), 6–7 (0/7), 7–5, 6–3 స్కోరుతో 11వ సీడ్ సిన్నర్ (ఇటలీ)పై చిరస్మరణీయ విజయం సాధించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా 1990 (పీట్ సంప్రాస్) తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. సెమీ ఫైనల్లో అల్కరాజ్ 22వ సీడ్ ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)తో తలపడతాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో టియాఫో 7–6 (7/3), 7–6 (7/0), 6–4 తేడాతో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించి సెమీస్ చేరాడు. 2006 (ఆండీ రాడిక్) తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన తొలి అమెరికా ఆటగాడు టియాఫో కావడం విశేషం. ప్రతీ షాట్లో పోరాటం... ఈ ఏడాది వింబుల్డన్‌లో సిన్నర్ చేతిలో ఓడిన అల్కరాజ్ ప్రతీకారం తీర్చుకునే దిశగా తొలి సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్ చేసి ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెట్లో కోలుకున్న సిన్నర్ గట్టి పోటీనిచ్చాడు. నాలుగు సెట్ పాయింట్లు కాపాడుకున్న అతను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. ఇక్కడా మరో సెట్ పాయింట్‌ను కాచుకొని స్కోరు సమం చేశాడు. మూడో సెట్లో కూడా ఇదే ఫలితం పునరావృతమైంది. అయితే ఈ సారి అల్కరాజ్ ముందుగా 4–2తో, ఆపై 6–5తో ఆధిక్యంలోకి వెళ్లి కూడా సెట్‌ను కోల్పోయాడు. సిన్నర్ పదునైన డిఫెన్స్‌తో స్పెయిన్ ఆటగాడిని అడ్డుకోగలిగాడు. నాలుగో సెట్ మళ్లీ హోరాహోరీగా సాగింది. ఇప్పుడు దురదృష్టం సిన్నర్‌ను పలకరించింది. 5–4తో ఆధిక్యంలో ఉండి సెమీస్ చేరేందుకు సర్వీస్ చేసిన అతను అనూహ్యంగా పట్టు కోల్పోయాడు. పుంజుకున్న అల్కరాజ్ పదో గేమ్‌తో పాటు మరో రెండు గేమ్‌లు వరుసగా నెగ్గి ఫలితాన్ని చివరి సెట్‌కు తీసుకెళ్లాడు. అ ప్పటికే ఇద్దరూ తీవ్రంగా అలసిపోగా...అల్కరాజ్ మాత్రం పట్టుదల కనబర్చి ఏకపక్షంగా సెట్‌ను సాధించి మ్యాచ్ గెలుచుకున్నాడు. సిన్నర్ 8, అల్కరాజ్ 5 ఏస్‌ల చొప్పున కొట్టగా... అల్కరాజ్ అనవసర తప్పిదాలు(38)తో పోలిస్తే సిన్నర్ (61) ఎక్కువ తప్పులతో మూల్యం చెల్లించుకున్నాడు. నంబర్‌వన్ జోరు... మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అరైనా సబలెంకా (బెలారస్) సెమీస్‌లోకి అడుగు పెట్టారు. స్వియాటెక్ 6–3, 7–6 (7/4) స్కోరుతో ఎనిమిదో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించగా...ఆరో సీడ్ సబలెంకా 6–1, 7–6 (7/4)తో కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. -
వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు!
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ సహనం కోల్పోయాడు. ఓడిపోయాననే బాధలో టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి కొట్టడం వైరల్‌గా మారింది. ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ పేరు సంపాదించిన కిర్గియోస్ ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో చాలాసార్లు తన కోపాన్ని ప్రదర్శించాడు. తాజాగా యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరగడంతో కిర్గియోస్లో కోపం కట్టలు తెంచుకుంది. విషయంలోకి వెళితే.. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్థరాత్రి జరిగిన క్వార్టర్స్‌లో రష్యన్ టెన్నిస్ ప్లేయర్ కచనోవ్ చేతిలో 7-5, 4-6,7-5, 6-7(3-7)తో కిర్గియోస్ ఓటమి పాలయ్యాడు. దీంతో గ్రాండ్‌స్లామ్ కొట్టాలన్న అతని కల క్వార్టర్స్‌కే పరిమితం కావడంతో కోపం నషాళానికి అంటింది. ప్లేయర్‌కు, అంపైర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన అనంతరం తన బ్యాగు వద్దకు వెళ్లిన కిర్గియోస్.. చేతిలోని రాకెట్‌ను కోపంతో నేలకేసి బాదాడు. అయినా కోపం తగ్గలేదనుకుంటా.. మరో టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. అనంతరం బ్యాగు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రాప్ స్వాప్ అనే సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. ''కోపం నషాళానికి అంటింది.. కిర్గియోస్ తన రెండు రాకెట్లను ముక్కలు చేశాడు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన నిక్ కిర్గియోస్ ఓటమిపై స్పందించాడు. ''నేను ఓడిపోవడం బాధ కలిగించింది. నేను గెలవాలని చాలా మంది మద్దతు ఇచ్చారు. కానీ వారి ఆశలను వమ్ము చేశాను. అందుకే కోపంతో టెన్నిస్ రాకెట్‌ను విరగొట్టాల్సి వచ్చింది. అయితే కచనోవ్ పోరాటం మెచ్చుకోదగినది. ఈరోజు అతనిలో ఒక ఫైటర్, వారియర్ కనిపించాడు. ఇక ముందు కూడా ఇదే పోరాట పటిమను కనబరిచి గ్రాండ్‌స్లామ్ నెగ్గాలని ఆశిస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు. ఇక సెమీస్‌కు చేరుకున్న కచనోవ్ నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో తలపడనున్నాడు. ఇప్పటికే నాదల్, మెద్వదేవ్‌లు వెనుదిరగ్గా.. తాజాగా కిర్గియోస్ కూడా క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టడంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. Nick Kyrgios restringing his racket after the match pic.twitter.com/Q2TDri1mxa — PropSwap (@PropSwap) September 7, 2022 చదవండి: FIH Awards: ‘ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్ సింగ్ -
బెస్ట్ ఫ్రెండ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు నాదల్..
యూఎస్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ దూసుకుపోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు ప్రవేశించిన నాదల్ 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకునేందుకు మరింత దగ్గరయ్యాడు. భారత కాలామన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో నాదల్.. తన స్నేహితుడైన రిచర్డ్ గాస్కెట్‌ను 6-0, 6-1, 7-5తో మట్టికరిపించాడు. కాగా యూఎస్ ఓపెన్‌లో నాదల్ క్వార్టర్స్ చేరడం ఇది 18వ సారి కాగా.. తన మిత్రుడిపై ఆధిక్యం కూడా 18-0నే కావడం విశేషం. 47వ విజయం.. షూ విరగొట్టిన అల్కరాజ్ ఇక 19 ఏళ్ల టెన్నిస్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ ఈ సీజన్లో 47వ విజయాన్ని అందుకున్నాడు. మూడో రౌండ్లో అమెరికాకు చెందిన జెన్సన్ బ్రూక్స్‌ను 6-3, 6-3, 6-3తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. ఈ సీజన్లో 47 విజయాలతో రికార్డు బ్రేక్ చేసిన ఆనందలో అల్కరాజ్ తన షూస్‌ను విరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్వార్టర్స్‌లో 2014 చాంపియన్ మారిన్ సిలిచ్‌ను ఎదుర్కోనున్నాడు. ముగురుజాకు షాక్.. క్వార్టర్స్ చేరిన స్వియాటెక్ ఇక మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ వరుసగా రెండో ఏడాది క్వార్టర్స్‌కు చేరుకుంది. మూడో రౌండ్లో అన్ సీడెడ్ అయిన లారెన్ డేవిస్‌ను 6-3, 6-4తో మట్టికరిపించి నాలుగో రౌండ్‌కు చేరుకుంది. ఇక తొమ్మిదో సీడ్ గార్బిన్ ముగురుజాకు మూడో రౌండ్లో చుక్కెదురైంది. మూడో రౌండ్లో పెట్రో క్విటోవా చేతిలో 5-7, 6-3, 7-6(12-10)తో ఓడిపోయిన ముగురజా ఇంటిబాట పట్టింది. కాగా క్వార్టర్స్‌లో క్విటోవా.. అమెరికాకు చెందిన జెస్సీకా పెగులాతో తలపడనుంది. 🎾🇪🇸 نُقطة المُباراة والفوز رقم 1066 لرافاييل نادال بمسيرته الإحترافية والرقم 38 لهُ بهذا الموسم 👏🏻 #RafaelNadal𓃵 pic.twitter.com/jpxVTtmDOM — عشاق التنس Arab Tennis (@ArabTennis20) September 4, 2022 -
BWF 2022: ప్రణయ్ జోరుకు తెర
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన జపాన్ స్టార్, టైటిల్ ఫేవరెట్ కెంటో మొమోటాపై సంచలన విజయంతో పతకం ఆశలు రేపిన హెచ్.ఎస్.ప్రణయ్ ‘షో’కు క్వార్టర్ ఫైనల్లో తెరపడింది. పురుషుల సింగిల్స్‌లో చైనా ఆటగాడు జావో జన్ పెంగ్ 19–21, 21–6, 21–18తో ప్రణయ్ ఆశల్ని క్వార్టర్స్‌లోనే తుంచేశాడు. తొలి గేమ్ ఆరంభంలో బాగా ఆడిన ప్రణయ్ ఒక దశలో 19–13తో ఆధిక్యంలో ఉన్నాడు. కానీ అదే పనిగా చేసిన తప్పిదాలతో అనూహ్యంగా ప్రత్యర్థి 19–19తో పుంజుకున్నాడు. కానీ ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు చేసి గేమ్ కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో భారత ఆటగాడు పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో చైనీస్ షట్లర్ 11–1తో దూసుకెళ్లాడు. అదే జోరుతో గేమ్ గెలిచాడు. మూడో గేమ్‌లో ప్రత్యర్థికి దీటుగా రాణించినప్పటికీ కీలక తరుణంలో పాయింట్లు చేసిన చైనా ఆటగాడు గేమ్‌తో పాటు మ్యాచ్ గెలిచి సెమీస్ చేరాడు. గతేడాది స్పెయిన్‌లో జరిగిన ఈవెంట్లోనూ ప్రణయ్ ఆట క్వార్టర్స్‌లోనే ముగిసింది. -
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత్ సరికొత్త చరిత్ర
-
పతకాలకు విజయం దూరంలో...
టోక్యో: ఈ ఏడాది థామస్ కప్‌లో భారత్ తొలిసారి చాంపియన్‌గా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ దూసుకుపోతున్నాడు. వరుసగా రెండో ఏడాది ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ కేరళ ప్లేయర్ మరో విజయం సాధిస్తే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–16, 21–17తో ప్రపంచ 10వ ర్యాంకర్, గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన జావో జున్ పెంగ్‌తో ఆడతాడు. గత ఏడాది ఈ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఈసారి మాత్రం ఒకరికి సెమీఫైనల్ బెర్త్‌తోపాటు పతకం కూడా లభించనుంది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ఎం.ఆర్. అర్జున్–ధ్రువ్ కపిల జోడీలు చరిత్ర సృష్టించేందుకు విజయం దూరంలో నిలిచాయి. ఈ రెండు జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–12, 21–10తో జెప్పా బే–లాసె మోల్హెడె (డెన్మార్క్) జోడీపై... అర్జున్–ధ్రువ్ జోడీ 18–21, 21–15, 21–16తో టెరీ హీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయంపై గెలుపొందాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా)లతో అర్జున్–ధ్రువ్... రెండో సీడ్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పురుషుల డబుల్స్ విభాగంలో ఒక్కసారి కూడా పతకం రాలేదు. సైనాకు నిరాశ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 17–21, 21–16, 13–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. బుసానన్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. -
Taipei Open: పోరాడి ఓడిన పారుపల్లి కశ్యప్
తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 40వ ర్యాంకర్ కశ్యప్ 12–21, 21–12, 17–21తో 59వ ర్యాంకర్ సూంగ్ జూ వెన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. కశ్యప్‌నకు 3 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 39 వేలు), 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తనీషా–ఇషాన్ (భారత్) జంట 19–21, 12–21తో హూ పాంగ్ రోన్–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తనీషా–శ్రుతి (భారత్) ద్వయం 16–21, 22–20, 18–21తో ఎన్జీ సాజ్ యా– సాంగ్ హి యాన్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
Taipei Open 2022: క్వార్టర్స్‌లో కశ్యప్
తైపీ: భారత సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. డబుల్స్‌లో తనీషా క్రాస్టో రెండు విభాగాల్లో క్వార్టర్స్ చేరింది. మహిళల, మిక్స్డ్ డబుల్స్‌లో దూసుకెళుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్లో మూడో సీడ్ కశ్యప్ 21–10, 21–19తో చియ హో లీ (తైపీ)పై గెలుపొందగా, మిథున్ 24–22, 5–21, 17–21తో నాలుగో సీడ్ నరవొక (జపాన్) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో సామియా ఫారుఖీ 18–21, 13–21తో వెచ్ చి హూ (తైపీ) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో తనీషా–సృష్టి జోడీ 21–14, 21–8తో జియా యిన్–లిన్ యూ (తైపీ)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా–ఇషాన్ ద్వయం 21–14, 21–17తో చెంగ్ కై వెన్– వాంగ్ యూ (తైపీ)పై నెగ్గింది. -
51 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్.. క్వార్టర్‌కు కశ్యప్
తైవాన్ వేదికగా జరుగుతున్న తైపీ ఓపెన్‌లో పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్ చేరాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో తైవాన్ కు చెందిన లి చియా హోతో తలపడిన కశ్యప్.. అతడిని ఓడించి క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్ లో కశ్యప్.. 21-10, 21-19 తేడాతో లి చియా ను ఓడించాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన కశ్యప్.. క్వార్టర్స్ కు చేరాడు. కశ్యప్ మినహా మిగతా భారత బృందం రెండో రౌండ్ లో తడబడింది. మిథున్ మంజునాథన్, ప్రియాన్షు రజవత్, కిరణ్ జార్జ్ లు రెండో రౌండ్ గండాన్ని దాటలేకపోయారు. ఇక మహిళల సింగిల్స్ లో ఏకైక ఆశాకిరణం సమియా ఫరూఖీ కూడా ఓడింది. మహిళల సింగిల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భారత ఏకైక క్రీడాకారిణి సమియా ఫరూఖీ.. తైవాన్ కే చెందిన వెన్ చి చేతిలో 18-21, 13-21 తో ఓటమిపాలైంది. మెన్స్ డబుల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భట్నాగర్-ప్రతీక్ జోడీ తైవాన్ కే చెందిన యాంగ్-చి లిన్ చేతిలో ఓడింది. మిక్సడ్ డబుల్స్ లో భట్నాగర్-తనీషా క్రాస్టోల జోడీ రెండో రౌండ్ లో 21-14, 21-17 తేడాతో కై వెన్-యు కియా జోడీని మట్టికరిపించి క్వార్టర్స్ కు దూసుకెళ్లింది.