జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. సింగిల్స్ విభాగంలో హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్‌లు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. డబుల్స్ విభాగంలో టాప్ షట్లర్లు స్వాతిక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి జోరు కనబరుస్తూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో కామన్‌వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్ జపాన్‌కు చెందిన కాంటా సునేయమాపై 21-14, 21-16 వరుస గేముల్లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ జోడి డెన్మార్క్‌కు చెందిన జెప్ బే- లాసే మొల్హెగ్డే ద్వయంపై 21-17, 21-11 వరుస సెట్లలో ఖంగుతినిపించారు.
Lakshya Sen 🇮🇳 sets the pace against Kanta Tsuneyama 🇯🇵.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/INyZMUO6HR
— BWF (@bwfmedia) July 27, 2023
ఇక హెచ్‌ఎస్ ప్రణయ్.. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో మన దేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్‌పై 19-21, 21-9, 21-9 తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ప్రణయ్ తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికి ఆ తర్వాత ఫుంజుకొని రెండు వరుస గేములను గెలుచుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.
ఇక మహిళల డబుల్స్ విభాగంలో భారత టాప్ జోడి ట్రీసా జోలీ-పుల్లెల గాయత్రి గోపిచంద్ జంట ప్రీక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. జపాన్‌కు చెందిన నమీ మత్సయుమా-చిమారు షీడా చేతిలో 21-13, 19-21తో ఓటమిపాలయ్యారు.
చదవండి: SL Vs PAK 2nd Test: ఏడు వికెట్లతో చెలరేగిన 36 ఏళ్ల పాక్ బౌలర్.. సిరీస్ క్లీన్‌స్వీప్
Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె!
Comments
Please login to add a commentAdd a comment