Satwik-Chirag
-
సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి
భారత టాప్ షట్లర్ లక్ష్యసేన్ మరో టైటిల్‌కు దగ్గరయ్యాడు.జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన లోకల్ ప్లేయర్ కోకి వతాన్బేను 21-15, 21-19 వరుస గేముల్లో చిత్తు చేశాడు. ఇక రేపు(శనివారం) జరగనున్న సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీతో తలపడనున్నాడు. Lakshya Sen enters semifinals of Japan Open, Satwik-Chirag out READ: https://t.co/XMwjavlFmc#LakshyaSen #Badminton #JapanOpen pic.twitter.com/oRgSxUuxR3 — TOI Sports (@toisports) July 28, 2023 వరల్డ్ నెంబర్ పదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నెంబర్‌వన్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో 21-19, 18-21,8-21తో ఓడిపోయాడు. అయితే తొలి గేమ్‌ను 21-19తో గెలిచి రెండో గేమ్‌లోనూ ఒక దశలో 7-1తో ఆధిక్యంలో కనిపించిన ప్రణయ్ ఆ తర్వాత అనవసర ఒత్తిడికి లోనయ్యాడు. ఆ తర్వాత 18-21తో రెండో గేమ్ కోల్పోయిన ప్రణయ్.. మూడో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి భారత డబుల్స్ టాప్ షట్లర్స్ సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి పోరాటం ముగిసింది. ఇటీవలే కొరియా ఓపెన్ నెగ్గి జోరు మీదున్న ఈ ద్వయం ఈ టోర్నీలో ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా గెలుస్తూ మరో టైటిల్ గెలిచేలా కనిపించింది. అయితే శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన ఒలింపిక్ చాంపియన్స్ లీ యాంగ్- వాంగ్ చీ-లాన్ చేతిలో 15-21, 25-23, 16-21తో ఓటమి పాలయ్యారు. చదవండి: రోహిత్ చివరగా ఏడో స్థానంలో ఎప్పుడు బ్యాటింగ్‌కు వచ్చాడంటే? Major League Cricket 2023: డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ -
క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. సింగిల్స్ విభాగంలో హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్‌లు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. డబుల్స్ విభాగంలో టాప్ షట్లర్లు స్వాతిక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి జోరు కనబరుస్తూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్ జపాన్‌కు చెందిన కాంటా సునేయమాపై 21-14, 21-16 వరుస గేముల్లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ జోడి డెన్మార్క్‌కు చెందిన జెప్ బే- లాసే మొల్హెగ్డే ద్వయంపై 21-17, 21-11 వరుస సెట్లలో ఖంగుతినిపించారు. Lakshya Sen 🇮🇳 sets the pace against Kanta Tsuneyama 🇯🇵.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/INyZMUO6HR — BWF (@bwfmedia) July 27, 2023 ఇక హెచ్ఎస్ ప్రణయ్.. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో మన దేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్‌పై 19-21, 21-9, 21-9 తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ప్రణయ్ తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికి ఆ తర్వాత ఫుంజుకొని రెండు వరుస గేములను గెలుచుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో భారత టాప్ జోడి ట్రీసా జోలీ-పుల్లెల గాయత్రి గోపిచంద్ జంట ప్రీక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. జపాన్‌కు చెందిన నమీ మత్సయుమా-చిమారు షీడా చేతిలో 21-13, 19-21తో ఓటమిపాలయ్యారు. చదవండి: SL Vs PAK 2nd Test: ఏడు వికెట్లతో చెలరేగిన 36 ఏళ్ల పాక్ బౌలర్.. సిరీస్ క్లీన్‌స్వీప్ Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! -
సింధు ఓటమి.. లక్ష్యసేన్ శుభారంభం; సాత్విక్-చిరాగ్ జోడి దూకుడు
తెలుగుతేజం పీవీ సింధు వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సింధు తాజాగా జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ తొలి రౌండ్‌కే పరిమితమైంది. బుధవారం రౌండ్ ఆఫ్ 32లో చైనాకు చెందిన జాంగ్ యిమాన్ చేతిలో పీవీ సింధు.. 21-12, 21-13తో ఓటమిపాలయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన 13 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో సింధు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. Zhang Yi Man 🇨🇳 takes on former world champion Pusarla V. Sindhu 🇮🇳.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/RzycVktT53 — BWF (@bwfmedia) July 26, 2023 లక్ష్యసేన్ శుభారంభం.. ఇక పురుషుల విభాగంలో టాప్ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో మన దేశానికే చెందిన ప్రియాన్షు రావత్‌పై 21-15, 12-21, 24-22తో గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీకి దూరంగా ఉన్న లక్ష్యసేన్ అంతకముందు జరిగిన కెనడా ఓపెన్ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో విజేతగా అవతరించాడు. జోరు మీదున్న సాత్విక్-చిరాగ్ జోడి ఈ ఆదివారం కొరియా ఓపెన్ డబుల్స్ టైటిల్స్ గెలిచి జోరు మీదున్న భారత డబుల్స్ స్టార్ షట్లర్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడి కూడా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాడో, డేనియల్ మార్టిన్ ద్వయంపై 21-16, 11-21, 21-13తో గెలిచి రెండో రౌండ్లో అడుగుపెట్టారు. Rankireddy/Shetty 🇮🇳 take to the court against Carnando/Marthin 🇮🇩.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/o2GfitVREC — BWF (@bwfmedia) July 26, 2023 చదవండి: IND Vs WI ODI Series: తొలి వన్డే.. సంజూ శాంసన్‌కు చోటు, ఇషాన్‌కు మొండిచెయ్యేనా! రెండు పెళ్లిళ్లు పెటాకులు! 69 ఏళ్ల వయసులో మూడోసారి! ఎవరీ బ్యూటీ? -
సాత్విక్-చిరాగ్ జోడీదే కొరియా ఓపెన్ డబుల్స్ టైటిల్
-
సాత్విక్–చిరాగ్ జోడీ కొత్త చరిత్ర
దుబాయ్: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. 1965లో పురుషుల సింగిల్స్‌లో దినేశ్ ఖన్నా విజేతగా నిలిచి భారత్‌కు తొలిసారి పసిడి పతకం అందించాడు. 58 ఏళ్ల తర్వాత మళ్లీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ భారత్ పసిడి లోటు తీర్చింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి అద్భుత ఆటతీరుతో అదరగొట్టారు. 67 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంక్ సాతి్వక్–చిరాగ్ ద్వయం 16–21, 21–17, 21–19తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ ఒంగ్ యె సిన్–తియో ఈ యి (చైనీస్ తైపీ) జోడీని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. 1971లో దీపూ ఘోష్–రమణ్ ఘోష్ ద్వయం భారత్‌కు కాంస్య పతకం అందించింది. -
దారుణ ఆటతీరు.. కొనసాగుతున్న వైఫల్యం
మహిళల బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్‌కే పరిమితమైంది. శుక్రవారం రెండో రౌండ్లో భాగంగా ఇండోనేషియాకు చెందిన అన్‌సీడెడ్ పుత్రీ కుసుమ వర్దానితో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ పీవీ సింధు.. 15-21, 21-12, 18-21 తేడాతో ఓడిపోయింది. మూడు గేములుగా సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను సింధు ఓటమి పాలైనప్పటికి.. రెండో గేమ్‌ను 21-12తో గెలుచుకుంది. అనంతరం కీలకమైన మూడో సెట్లో సింధు పుత్రి కుసుమ గేమ్‌కు తలవంచి ఓటమిపాలయ్యింది. ఈ ఏడాది ఒక్క టోర్నీలోనూ సింధు కనీసం క్వార్టర్స్‌కు చేరుకోలేకోపోయింది. ఇటీవలే జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లోనూ దారుణ ప్రదర్శన కనబరిచిన సింధు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. అయితే పరుషుల డబుల్స్‌లో మాత్రం భారత్‌కు అనుకూల ఫలితం వచ్చింది. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్లో తైవానిస్కు చెందిన ఫాంగ్-చిహ్ లీ జోడిని 12-21, 21-17, 28-26తో ఓడించారు. చదవండి: రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా? -
సాత్విక్ జోడీ ముందంజ
సార్‌బ్రుక్‌కెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 22–24, 21–15, 21–11తో రోరీ ఈస్టన్–జాక్ రస్ (ఇంగ్లండ్) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–18, 21–19తో జిలీ దెబోరా–చెర్లీ సీనెన్ (నెదర్లాండ్స్) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ (భారత్) 15–21, 21–14, 21–13 తో లూ గ్వాంగ్ జు (చైనా)పై కష్టపడి గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో భారత ప్లేయర్ మాళవిక క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో మాళవిక తొలి గేమ్‌ను 24–22తో సొంతం చేసుకొని, రెండో గేమ్‌లో 19–7తో ఆధిక్యంలో ఉన్నదశలో గిల్మోర్ గాయం కారణంగా వైదొలిగింది. చదవండి: T20 WC 2022: భారత్‌ను భయపెట్టాడు.. లిటన్ దాస్‌కు కోహ్లి అదిరిపోయే గిఫ్ట్ -
కాంస్యంతో ముగింపు
టోక్యో: కెరీర్లో నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న సాత్విక్–చిరాగ్ జోడీ కాంస్య పతకంతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 22–20, 18–21, 16–21తో ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) చేతిలో పోరాడి ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సాత్విక్–చిరాగ్ ప్రదర్శనతో వరుసగా తొమ్మిదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో పతకం చేరింది. 77 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో రెండు జోడీలు అద్భుతంగా ఆడినా కీలకదశలో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ పైచేయి సాధించి విజయాన్ని అందుకున్నారు. ఆరోన్ చియా–సో వుయ్ యిక్ జోడీ చేతిలో సాత్విక్–చిరాగ్ శెట్టిలకిది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. ‘ముఖ్యమైన మ్యాచ్‌లలో కీలకదశల్లో మాకు అదృష్టం కలిసి రావడంలేదు. కీలక సందర్భాల్లో అదృష్టం మావైపు ఉండాలంటే మేము మరిన్ని పూజలు చేసి దేవుడిని ప్రార్థించాలేమో. ఓవరాల్‌గా మా ప్రదర్శనపట్ల సంతృప్తిగా ఉన్నా సెమీఫైనల్ మ్యాచ్ ఫలితం మాత్రం నిరాశ కలిగించింది. తొలి గేమ్ గెలిచాక రెండో గేమ్‌లో మేము మలేసియా జోడీపై మరింత ఒత్తిడి పెంచాల్సింది. పతకం సాధించాలనే లక్ష్యంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు వచ్చాం. పతకం గెలిచినందుకు సంతోషంగా ఉన్నా ఫైనల్ చేరితే మా ఆనందం రెట్టింపు అయ్యేది. భవిష్యత్‌లో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాం’ అని సాత్విక్ వ్యాఖ్యానించాడు. -
సాత్విక్–చిరాగ్ జంట సంచలనం.. టైటిల్ సొంతం.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
India Open 2022: బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్లో ... అదీ సొంతగడ్డపై భారత షట్లర్లు అద్భుతం చేశారు. ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నమెంట్లో భారత్‌కు రెండు టైటిల్స్ అందించారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి ద్వయం ప్రపంచ రెండో ర్యాంక్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచిన మొహమ్మద్ ఎహ్సాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీని బోల్తా కొట్టించి టైటిల్ దక్కించుకోగా... పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్)ను కంగుతినిపించి భారత యువస్టార్ లక్ష్య సేన్ విజేతగా అవతరించాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ శెట్టి 21–16, 26–24తో టాప్ సీడ్ ఎహ్సాన్–సెతియవాన్ జోడీ ని ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టికిది రెండో సూపర్ –500 స్థాయి టైటిల్ కావడం విశేషం. 2019లో థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో విజేతగా నిలిచిన ఈ జోడీ అదే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఎహ్సాన్–సెతియవాన్ జంటతో 43 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం కీలకదశలో పట్టు కోల్పోకుండా ఓర్పుతో ఆడింది. తొలి గేమ్‌లో స్కోరు 13–13తో సమంగా ఉన్న దశలో సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–13తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో రెండు జోడీలు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడాయి. చివరకు భారత జోడీనే పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 31,600 డాలర్లు (రూ. 23 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత నెలలో కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన లో కీన్ యుతో 54 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 24–22, 21–17తో గెలుపొంది కెరీర్లో తొలి సూపర్–500 టైటిల్ సాధించాడు. గత నెలలో ప్రపంచ చాంపియన్ షిప్లో కాంస్యం నెగ్గిన 20 ఏళ్ల లక్ష్య సేన్ ఫైనల్లో ఆద్యంతం నిలకడగా ఆడాడు. తొలి గేమ్‌లో 19–20, 21–22 వద్ద రెండుసార్లు గేమ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కిన లక్ష్య సేన్ రెండో గేమ్‌లో మాత్రం లో కీన్ యుపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. విజేతగా నిలిచిన లక్ష సేన్‌కు 30 వేల డాలర్లు (రూ. 22 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు 14–21, 21–13, 10–21 తో సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. చదవండి: IPL 2022: ధోని ‘గుడ్ బై’.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!? How Lakshya Sen won his first World Tour 500 title on his debut at the India Open 🥇 (via @bwfmedia) pic.twitter.com/02od3Arg73 — ESPN India (@ESPNIndia) January 16, 2022 -
సుదిర్మన్ కప్ చిరాగ్–సాత్విక్ జోడి ఔట్!
Chirag Satwik Pair Withdraws From Sudirman Cup: భారత బ్యాడ్మింటన్ టాప్ పురుషుల డబుల్స్ జంట చిరాగ్ శెట్టి – సాత్విటక్ సాయిరాజ్ అనారోగ్య సమస్యలతో ఆదివారంనుంచి జరిగే సుదిర్మన్ కప్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వరల్డ్ నంబర్ 10 జోడీ అయిన వీరిలో చిరాగ్ అనారోగ్యంగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధికారి ఒకరు వెల్లడించారు. చదవండి: సన్‌రైజర్స్ అవుట్! -
బ్యాడ్మింటన్ సీజన్‌కు వేళాయె
కౌలాలంపూర్: గతేడాది ఆశించినరీతిలో రాణించలేకపోయిన భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు కొత్త సీజన్‌ను టైటిల్‌తో మొదలుపెట్టాలనే లక్ష్యంతో మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. గత సంవత్సరం పీవీ సింధు ప్రపంచ చాంపియన్ కావడం, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట థాయ్‌లాండ్ ఓపెన్‌లో టైటిల్ సాధించడం మినహా భారత్‌కు ఇతర గొప్ప ఫలితాలేవీ రాలేదు. మరో ఏడు నెలల కాలంలో టోక్యో ఒలింపిక్స్ జరగనుండటంతో సీజన్ ప్రారంభం నుంచే భారత క్రీడాకారులందరూ జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. మలేసియా మాస్టర్స్ టోర్నీలో తొలి రోజు పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్‌లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల, మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మలేసియాకు చెందిన ఓంగ్ యెవ్ సిన్–తియో ఈ యిలతో తలపడనుంది. మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పీవీ సింధు, సైనా... పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పారుపల్లి కశ్యప్, ప్రణయ్, సమీర్ వర్మ, సాయిప్రణీత్, శ్రీకాంత్ బరిలో ఉన్నారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట తమ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో.... గతవారం చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సెమీస్ చేరిన సాత్విక్–చిరాగ్ ద్వయం రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిది నుంచి ఏడో ర్యాంక్‌కు చేరుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ షట్లర్‌గా హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ అవతరించాడు. సాయిప్రణీత్ ఒక స్థానం పురోగతి సాధించి పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. సాయిప్రణీత్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇప్పటిదాకా పదో ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్ ర్యాంకర్‌గా ఉన్న కిడాంబి శ్రీకాంత్ మూడు స్థానాలు పడిపోయి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో టాప్–50లో ఎనిమిది మంది భారత ఆటగాళ్లు ఉండటం విశేషం. సమీర్ వర్మ (16వ స్థానం), కశ్యప్ (25వ), ప్రణయ్ (28వ), సౌరభ్ వర్మ (38వ), లక్ష్య సేన్ (42వ), శుభాంకర్ డే (44వ స్థానం) టాప్–50లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఆరో ర్యాంక్‌లో, సైనా తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. -
పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జంట
ఫుజౌ (చైనా): ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ... భారత యువ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంటకు ఓటమి తప్పలేదు. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ద్వయం పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 16–21, 20–22తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జంట కెవిన్ సంజయ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది. సెమీస్‌లో నిష్క్రమించిన సాత్విక్–చిరాగ్ జంటకు 9,800 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ ఆరంభంలోనే 7–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఇండోనేసియా ద్వయం నెమ్మదిగా తేరుకొని వరుస పాయింట్లు సాధించి విరామానికి 11–9తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత అదే ఊపులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో మాత్రం రెండు జోడీలు ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. కీలకదశలో అనుభవజ్ఞులైన కెవిన్–గిడియోన్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఓవరాల్‌గా కెవిన్–గిడియోన్ చేతిలో భారత జంటకిది వరుసగా ఎనిమిదో ఓటమికాగా... ఈ ఏడాది మూడోది. ఆగస్టులో థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గిన సాత్విక్–చిరాగ్... గతవారం ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. -
మళ్లీ సంచలనం
ఇన్నాళ్లూ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో భారత్ తరఫున సింగిల్స్ విభాగాల్లోనే గొప్ప ఫలితాలు కనిపించేవి. అయితే సింగిల్స్ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డబుల్స్ విభాగంలో అద్భుత ఆటతీరుతో అదరగొడుతూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. గతవారం ఫ్రెంచ్ ఓపెన్ లో రన్నరప్‌గా నిలిచే క్రమంలో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్స్ జోడీని ఓడించిన ఈ భారత జంట తాజాగా 2018 ప్రపంచ చాంపియన్స్ జంటను మట్టికరిపించి మరో సంచలనం సృష్టించింది. ఫుజౌ (చైనా): భారత సింగిల్స్ అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయిన నిరాశను మరిపిస్తూ పురుషుల డబుల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో స్ఫూర్తిదాయక విజయం సాధించింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–15తో 2018 ప్రపంచ చాంపియన్స్, మూడో ర్యాంక్ జోడీ లీ జున్ హుయ్–లియు యు చెన్ (చైనా)పై సంచలన విజయం సాధించింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ సాధికారిక ఆటను ప్రదర్శించారు. రెండు గేముల్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. తొలి గేమ్‌లో 15–11తో నాలుగు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న భారత జోడీకి ఆ తర్వాత గట్టిపోటీ ఎదురైంది. సొంతగడ్డపై, సొంత ప్రేక్షకుల మద్దతుతో పుంజుకున్న చైనా జంట 18–18తో స్కోరును సమం చేసింది. అయితే సాత్విక్–చిరాగ్ ఈ కీలకదశలో వరుసగా రెండు పాయింట్లు గెలిచి 20–18తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మరో పాయింట్ కోల్పోయినా... వెంటనే మరో పాయింట్ గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకున్నారు. ఇక రెండో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ జంటకు ఆరంభంలో ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 12–12 వద్ద భారత జంట వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 15–12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత జంట విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ద్వయం కెవిన్ సంజయ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా)లతో సాత్విక్–చిరాగ్ జంట ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 0–7తో వెనుకంజలో ఉంది. -
మరోసారి కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో...
న్యూఢిల్లీ: గతవారం ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ పురోగతి సాధించింది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ 11వ ర్యాంక్ నుంచి 9వ ర్యాంక్‌కు చేరుకుంది. రెండోసారి తమ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నిలిచింది. ఆగస్టులో థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో టైటిల్ సాధించాక ఈ ఇద్దరు తొలిసారి 9వ ర్యాంక్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత టాప్–10 నుంచి బయటకు వచ్చి...ఫ్రెంచ్ ఓపెన్‌లో రాణించి మళ్లీ టాప్–10లోకి వచ్చారు. -
రన్నరప్ సాత్విక్–చిరాగ్ జంట
పారిస్: వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న జోడీలను బోల్తా కొట్టించిన భారత యువ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తుది మెట్టుపై పోరాడి ఓడింది. ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట రన్నరప్‌గా నిలిచింది. కెరీర్లో తొలిసారి వరల్డ్ టూర్–750 స్థాయి టోర్నీ ఫైనల్ ఆడిన భారత జంట 18–21, 16–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జోడీ మార్కస్ ఫెర్నాల్డి గిడియోన్–కెవిన్ సంజయ సుకముల్జో (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. సాత్విక్–చిరాగ్ జంటకు 26,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 55 వేలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 121 వారాల నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న గిడియోన్–కెవిన్ జోడీ చేతిలో సాత్విక్–చిరాగ్‌లకు వరుసగా ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. ఆగస్టులో థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్–చిరాగ్‌లు ఈసారి ఫైనల్లో ఒత్తిడికి లోనయ్యారు. రెండు గేముల్లోనూ భారత జంట ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడింది. తొలి గేమ్‌లో 17–17తో స్కోరును కూడా సమం చేసింది. కానీ కీలకదశలో అనుభవజ్ఞులైన ఇండోనేసియా జంట పైచేయి సాధించింది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా సాగింది. మూడుసార్లు 6–6, 8–8, 11–11తో స్కోరు సమమైంది. ఈ గేమ్‌లోనూ కీలకదశలో ఇండోనేసియా జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకొని విజయాన్ని అందుకుంది. ఒకవేళ సాత్విక్–చిరాగ్ గెలిచుంటే 1983లో పార్థో గంగూలీ–విక్రమ్ సింగ్ బిష్త్ తర్వాత ఈ టైటిల్ నెగ్గిన భారత జంటగా గుర్తింపు పొందేది. గతంలో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (2017), మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2012) విజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో సాత్విక్–చిరాగ్ జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్స్ మొహమ్మద్ హసన్–సెతియావాన్ (ఇండోనేసియా)లను, క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంకర్స్ కిమ్ అస్ట్రప్–ఆండెర్స్ రస్‌ముసేన్ (డెన్మార్క్)లను, సెమీఫైనల్లో ఆరో ర్యాంకర్స్ హిరోయుకి ఎండో–యుటా వతనాబె (జపాన్)లను ఓడించింది. ఫైనల్లో మేము రెండు గేమ్‌లనూ నెమ్మదిగా ప్రారంభించాం. ఆరంభంలోనే ఆధిక్యాన్ని సమర్పించుకున్నాం. ఆ తర్వాత కోలుకొని స్కోరును సమం చేసినా కీలకదశలో తప్పిదాలు చేశాం. ఈ టోర్నీలో మా ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నాం. మా కెరీర్లో ఇది రెండో గొప్ప ప్రదర్శనగా చెబుతాం. థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ మా కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. –సాత్విక్, చిరాగ్ శెట్టి -
వరల్డ్ చాంపియన్‌షిప్ నుంచి ఔట్
ఇటీవలే థాయిలాండ్ ఓపెన్ గెలిచి ఊపు మీదున్న భారత డబుల్స్ బ్యాడ్మింటన్ జంట సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి అనూహ్యంగా వరల్డ్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకున్నారు. ‘సాతి్వక్ భుజం గాయంతో బాధపడుతుంటే నా పక్కటెముకల గాయం కూడా తగ్గలేదు. మా ఫామ్, ఫలితాలను బట్టి చూస్తే ఇది కఠిన నిర్ణయమే అయినా మాకు మరో అవకాశం లేదు’ అని చిరాగ్ శెట్టి వెల్లడించాడు. -
‘కామన్వెల్త్’ పతకంపై సాత్విక్ జంట దష్టి
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ డబుల్స్‌లో మెరుపులు మెరిపిస్తున్న తెలుగు ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ కామన్వెల్త్ క్రీడల్లో పతకంపై కన్నేశాడు. ఏప్రిల్‌లో గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్లో తొలిసారి చిరాగ్ శెట్టితో కలిసి బరిలో దిగుతున్న 17 ఏళ్ల సాత్విక్ డబుల్స్‌లో పతకం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనాలనేది మా నాన్న కల. ఈ క్రీడలకు ఎంపికైన విషయం తెలియగానే చాలా సంతోషం కలిగింది. మెగా ఈవెంట్లో పతకం సాధిస్తామనే నమ్మకం ఉంది. గత ఆరు నెలలుగా మేం మంచి ప్రదర్శన చేస్తున్నాం. దీన్ని గోల్డ్‌కోస్ట్‌లోనూ కొనసాగిస్తాం’ అని తెలిపాడు. మరో ఆటగాడు చిరాగ్ శెట్టి మాట్లాడుతూ... ‘ఇప్పటివరకు భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ కామన్వెల్త్ క్రీడల్లో పతకం నెగ్గలేదు. ప్రస్తుతం మా పూల్‌లో ఇంగ్లండ్, మలేసియాకు చెందిన హేమాహేమీల్లాంటి ఆటగాళ్లున్నారు. ప్రత్యర్థులు మాకంటే మెరుగ్గా ఉన్నా వంద శాతం శ్రమించి అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం’ అని అన్నాడు. చిరాగ్‌తో జోడీ కట్టిన తొలినాళ్లలో చాలా కష్టంగా ఉండేదని... కానీ ఇప్పుడు తమ జంట అద్భుతంగా రాణిస్తోందని సాత్విక్ అన్నాడు. ‘చిరాగ్‌తో జత కట్టిన మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని సార్లు ఎవరు ముందు ఆడాలి, ఎవరు వెనుక అనే విషయంలో కూడా స్పష్టత లోపించేది. ఇద్దరి మధ్య సమన్వయం కుదిరేది కాదు. కానీ ఇప్పుడు మేం మంచి మిత్రులయ్యాం. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం ద్వారా ఆట కూడా మెరుగైంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు’ అని సాత్విక్ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో ఈ జంట సెమీఫైనల్‌కు చేరింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ మంచి ప్రదర్శన చేసినా క్వార్టర్స్‌లో వెనుదిరిగింది. ఈ ఏడాది చివరికల్లా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–15కు చేరడమే తమ లక్ష్యమని ఈ జోడీ స్పష్టం చేసింది. -
డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు సాత్విక్–చిరాగ్ జంట
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ పురుషుల డబుల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. చిరాగ్ శెట్టితో కలిసి బరిలోకి దిగిన సాత్విక్ సోమవారం జరిగిన రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో గెలి చాడు. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 22–20, 21–9తో అల్తాఫ్ బారిక్–రీనార్డ్ (ఇండోనేసియా) జంటపై... రెండో రౌండ్లో 21–18, 21–16తో సబర్ కర్యామన్–ఫ్రెంగీ పుత్రా (ఇండోనేసియా) జోడీపై గెలిచింది. మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ రచనోక్ (థాయ్‌లాండ్)తో సైనా... పోర్న్‌పవీ (థాయ్‌లాండ్)తో సింధు ఆడతారు.