దుబాయ్: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. 1965లో పురుషుల సింగిల్స్‌లో దినేశ్ ఖన్నా విజేతగా నిలిచి భారత్‌కు తొలిసారి పసిడి పతకం అందించాడు. 58 ఏళ్ల తర్వాత మళ్లీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ భారత్ పసిడి లోటు తీర్చింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి అద్భుత ఆటతీరుతో అదరగొట్టారు.
67 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంక్ సాతి్వక్–చిరాగ్ ద్వయం 16–21, 21–17, 21–19తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ ఒంగ్ యె సిన్–తియో ఈ యి (చైనీస్ తైపీ) జోడీని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. 1971లో దీపూ ఘోష్–రమణ్ ఘోష్ ద్వయం భారత్‌కు కాంస్య పతకం అందించింది.
Comments
Please login to add a commentAdd a comment