Badminton Asia Team Championship
-
చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి ఫైనల్లో!
Badminton Asia Team Championships: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఈవెంట్లో తొలిసారిగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మలేషియా వేదికగా శనివారం జరిగిన సెమీస్‌లో జపాన్ బృందాన్ని భారత జట్టు ఓడించింది. తద్వారా 3-2 తేడాతో విజయ దుందుభి మోగించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరుగనున్న తుదిపోరులో థాయ్‌లాండ్‌తో భారత మహిళా జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. పసిడి పతకమే లక్ష్యంగా సింధు సారథ్యంలోని భారత బ్యాడ్మింటన్ జట్టు ముందుకు సాగుతోంది. కాగా అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్‌పై భారత మహిళా జట్టు గెలుపొందిన విషంయ తెలిసిందే. -
చైనాను చిత్తు చేసిన భారత్..
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్-2024 టోర్నీలో భారత మహిళా జట్టు అదరగొట్టింది. మలేషియాలో జరుగుతున్న ఈ ఈవెంట్లో టాప్ సీడ్ చైనా జట్టును ఓడించి టేబుల్ టాపర్‌గా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నమెంట్లో భాగంగా భారత్- చైనా మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భాగంగా తొలుత పీవీ సింధు.. చైనా ప్లేయర్ హాన్ యేతో తలపడింది. దాదాపు మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ఒలింపియన్ 21-17, 21-15తో హాన్‌ను ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించింది. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జంట అశ్విన్ పొన్నప్ప- తనీషా క్రాస్టోలను ఓడించిన చైనా ద్వయం లూయీ- టాన్ 1-1తో స్కోరు సమం చేసింది. అనంతరం.. అష్మిత చలీహా వాంగ్ జీ యీ చేతిలో ఓడటం(21-13, 21-15)తో చైనా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత ద్వయం త్రెసా- గాయత్రి.. లి- లువోల(10-21, 21-18, 21-17)ను ఓడించి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అన్మోల్ ఖర్బ్.. వూ లువో యూతో బుధవారం తలపడింది. భారత జట్టు టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పదిహేడేళ్ల ఈ యువ ప్లేయర్ పట్టుదలగా పోరాడింది. 472వ ర్యాంకర్ అయిన అన్మోల్.. 172వ ర్యాంకర్ లువోను 22-20, 14-21, 21-18తో ఓడించి జట్టు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చింది. ఈ క్రమంలో చైనాను 3-2తో చిత్తు చేసిన భారత మహిళా జట్టు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌లో ఇదొక చారిత్రక దినమంటూ అభిమానులు మురిసిపోతున్నారు. We enter quarterfinals as table toppers after beating 🇨🇳 3-2, let that sink in 🔥 Proud of you girls, keep it up! 👊#BATC2024#TeamIndia#IndiaontheRise#Badminton pic.twitter.com/ysFhXwICTw — BAI Media (@BAI_Media) February 14, 2024 -
సాత్విక్–చిరాగ్ జోడీ కొత్త చరిత్ర
దుబాయ్: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. 1965లో పురుషుల సింగిల్స్‌లో దినేశ్ ఖన్నా విజేతగా నిలిచి భారత్‌కు తొలిసారి పసిడి పతకం అందించాడు. 58 ఏళ్ల తర్వాత మళ్లీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ భారత్ పసిడి లోటు తీర్చింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి అద్భుత ఆటతీరుతో అదరగొట్టారు. 67 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంక్ సాతి్వక్–చిరాగ్ ద్వయం 16–21, 21–17, 21–19తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ ఒంగ్ యె సిన్–తియో ఈ యి (చైనీస్ తైపీ) జోడీని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. 1971లో దీపూ ఘోష్–రమణ్ ఘోష్ ద్వయం భారత్‌కు కాంస్య పతకం అందించింది. -
ఒకే గ్రూప్‌లో భారత్, చైనా
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ డ్రా విడుదల సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో చైనా, భారత్ ఒకే గ్రూప్‌లో ఆడబోతున్నాయి. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన డ్రాను మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పంచా యతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఈ నెల 15 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో పురుషుల విభాగంలో మొత్తం 14 జట్లు బరిలోకి దిగుతున్నాయి. చైనా, కొరియా, ఇండోనేషియా, జపాన్ టాప్-4 సీడ్స్గా బరిలోకి దిగుతున్నాయి. గ్రూప్-ఎలో చైనా, భారత్, సింగపూర్; గ్రూప్-బిలో జపాన్, మలేసియా, శ్రీలంక, నేపాల్; గ్రూప్-సిలో ఇండోనేషియా, చైనీస్‌తైపీ, థాయ్‌లాండ్, మాల్దీవ్స్; గ్రూప్-డిలో కొరియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్‌లు ఉన్నాయి. మహిళల విభాగంలో 12 జట్లు నాలుగు గ్రూప్‌లుగా తలపడతాయి. గ్రూప్-డిలో భారత్‌తో పాటు జపాన్, సింగపూర్; గ్రూప్-సిలో కొరియా, ఇండోనేషియా, మాల్దీవ్స్; గ్రూప్-బిలో థాయ్‌లాండ్, చైనీస్‌తైపీ, శ్రీలంక; గ్రూప్-ఎలో చైనా, మలేసియా, హాంకాంగ్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.