
చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి ఫైనల్లో(PC: BAI Media X)
Badminton Asia Team Championships: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఈవెంట్లో తొలిసారిగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మలేషియా వేదికగా శనివారం జరిగిన సెమీస్‌లో జపాన్ బృందాన్ని భారత జట్టు ఓడించింది.
తద్వారా 3-2 తేడాతో విజయ దుందుభి మోగించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరుగనున్న తుదిపోరులో థాయ్‌లాండ్‌తో భారత మహిళా జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. పసిడి పతకమే లక్ష్యంగా సింధు సారథ్యంలోని భారత బ్యాడ్మింటన్ జట్టు ముందుకు సాగుతోంది. కాగా అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్‌పై భారత మహిళా జట్టు గెలుపొందిన విషంయ తెలిసిందే.