ఒకే గ్రూప్‌లో భారత్, చైనా
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ డ్రా విడుదల
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో చైనా, భారత్ ఒకే గ్రూప్‌లో ఆడబోతున్నాయి. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన డ్రాను మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పంచా యతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఈ నెల 15 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో పురుషుల విభాగంలో మొత్తం 14 జట్లు బరిలోకి దిగుతున్నాయి. చైనా, కొరియా, ఇండోనేషియా, జపాన్ టాప్-4 సీడ్స్‌గా బరిలోకి దిగుతున్నాయి.
గ్రూప్-ఎలో చైనా, భారత్, సింగపూర్; గ్రూప్-బిలో జపాన్, మలేసియా, శ్రీలంక, నేపాల్; గ్రూప్-సిలో ఇండోనేషియా, చైనీస్‌తైపీ, థాయ్‌లాండ్, మాల్దీవ్స్; గ్రూప్-డిలో కొరియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్‌లు ఉన్నాయి. మహిళల విభాగంలో 12 జట్లు నాలుగు గ్రూప్‌లుగా తలపడతాయి. గ్రూప్-డిలో భారత్‌తో పాటు జపాన్, సింగపూర్; గ్రూప్-సిలో కొరియా, ఇండోనేషియా, మాల్దీవ్స్; గ్రూప్-బిలో థాయ్‌లాండ్, చైనీస్‌తైపీ, శ్రీలంక; గ్రూప్-ఎలో చైనా, మలేసియా, హాంకాంగ్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.