Lakshya Sen Enter Semifinal Japan Open, Satwik Chirag, Prannoy Knocked Out - Sakshi
Sakshi News home page

Japan Open 2023: సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్‌.. సాత్విక్‌-చిరాగ్‌ జోడి ఓటమి

Published Fri, Jul 28 2023 8:58 PM | Last Updated on Fri, Jul 28 2023 9:05 PM

Lakshya-Sen Enter-Semifinal-Japan Open-Satwik-Chirag-Prannoy Knocked-Out - Sakshi

భారత టాప్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ మరో టైటిల్‌కు దగ్గరయ్యాడు.జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్‌ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌కు చెందిన లోకల్‌ ప్లేయర్‌ కోకి వతాన్బేను 21-15, 21-19 వరుస గేముల్లో చిత్తు చేశాడు. ఇక రేపు(శనివారం) జరగనున్న సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జోనాథన్‌ క్రిస్టీతో తలపడనున్నాడు.

వరల్డ్‌ నెంబర్‌ పదో ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ పోరాటం క్వార్టర్స్‌లో ‍ముగిసింది. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నెంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ చేతిలో 21-19, 18-21,8-21తో ఓడిపోయాడు. అయితే తొలి గేమ్‌ను 21-19తో గెలిచి రెండో గేమ్‌లోనూ ఒక దశలో 7-1తో ఆధిక్యంలో కనిపించిన ప్రణయ్‌ ఆ తర్వాత అనవసర ఒత్తిడికి లోనయ్యాడు. ఆ తర్వాత 18-21తో రెండో గేమ్‌ కోల్పోయిన ప్రణయ్‌.. మూడో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు.

సాత్విక్‌-చిరాగ్‌ జోడి ఓటమి
భారత డబుల్స్‌ టాప్‌ షట్లర్స్‌ సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడి పోరాటం ముగిసింది. ఇటీవలే కొరియా ఓపెన్‌ నెగ్గి జోరు మీదున్న ఈ ద్వయం ఈ టోర్నీలో ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా గెలుస్తూ మరో టైటిల్‌ గెలిచేలా కనిపించింది. అయితే శుక్రవారం జరిగిన డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో చైనీస్‌ తైపీకి చెందిన ఒలింపిక్‌ చాంపియన్స్‌ లీ యాంగ్‌- వాంగ్‌ చీ-లాన్‌ చేతిలో 15-21, 25-23, 16-21తో ఓటమి పాలయ్యారు.

చదవండి: రోహిత్‌ చివరగా ఏడో స్థానంలో ఎప్పుడు బ్యాటింగ్‌కు వచ్చాడంటే?

Major League Cricket 2023: డికాక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. ఫైనల్లో సీటెల్‌ ఓర్కాస్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement