తెలుగుతేజం పీవీ సింధు వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన సింధు తాజాగా జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ తొలి రౌండ్‌కే పరిమితమైంది. బుధవారం రౌండ్ ఆఫ్ 32లో చైనాకు చెందిన జాంగ్ యిమాన్ చేతిలో పీవీ సింధు.. 21-12, 21-13తో ఓటమిపాలయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన 13 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.
Zhang Yi Man 🇨🇳 takes on former world champion Pusarla V. Sindhu 🇮🇳.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/RzycVktT53
— BWF (@bwfmedia) July 26, 2023
లక్ష్యసేన్ శుభారంభం..
ఇక పురుషుల విభాగంలో టాప్ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో మన దేశానికే చెందిన ప్రియాన్షు రావత్‌పై 21-15, 12-21, 24-22తో గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీకి దూరంగా ఉన్న లక్ష్యసేన్ అంతకముందు జరిగిన కెనడా ఓపెన్ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో విజేతగా అవతరించాడు.
జోరు మీదున్న సాత్విక్-చిరాగ్ జోడి
ఈ ఆదివారం కొరియా ఓపెన్ డబుల్స్ టైటిల్స్ గెలిచి జోరు మీదున్న భారత డబుల్స్ స్టార్ షట్లర్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడి కూడా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాడో, డేనియల్ మార్టిన్ ద్వయంపై 21-16, 11-21, 21-13తో గెలిచి రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు.
Rankireddy/Shetty 🇮🇳 take to the court against Carnando/Marthin 🇮🇩.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/o2GfitVREC
— BWF (@bwfmedia) July 26, 2023
చదవండి: IND Vs WI ODI Series: తొలి వన్డే.. సంజూ శాంసన్‌కు చోటు, ఇషాన్‌కు మొండిచెయ్యేనా!
రెండు పెళ్లిళ్లు పెటాకులు! 69 ఏళ్ల వయసులో మూడోసారి! ఎవరీ బ్యూటీ?
Comments
Please login to add a commentAdd a comment