japan open badminton
-
Japan Open 2023 badminton: పోరాడి ఓడిన లక్ష్యసేన్
టోక్యో: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–750 జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ ఆట ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్య పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్‌లో ఇండోనేసియాకు చెందిన ఐదో సీడ్ జొనాథన్ క్రిస్టీ 21–15, 13–21, 21–16 స్కోరుతో సేన్‌ను ఓడించాడు. 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరు తొలి గేమ్‌లో క్రిస్టీ చేసిన పొరపాట్లతో సేన్ 7–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిన క్రిస్టీ 15–12తో ఆధిక్యంలోకి వచ్చేశాడు. రెండో గేమ్‌లో చక్కటి సర్వీస్, ర్యాలీలతో 11–5తో సేన్ ముందంజ వేశాడు. ఆపై పదునైన స్మాష్‌లతో చెలరేగి భారత షట్లర్ రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి గేమ్‌లో మాత్రం మొదటినుంచి ఆధిక్యం ప్రదర్శించిన క్రిస్టీ చివరి వరకు దానిని నిలబెట్టుకున్నాడు. -
భారత్ కథ ముగిసింది.. సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టీ చేతిలో 21-15,13-21,21-16తో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌లో ఇద్దరు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడ్డారు. అయితే గేమ్ ఆఖర్లో లక్ష్యసేన్ పట్టు సడలించడంతో 21-15 తేడాతో జొనాథన్ మొదటి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో లక్ష్యసేన్ రెండో గేమ్‌ను కసిగా మొదలుపెట్టాడు. గేమ్ ఆద్యంతం ఎక్కడా జొనాథన్‌ను పైచేయి సాధించనీయలేదు. దాంతో 13-21 తేడాతో రెండో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో లక్ష్యసేన్ అదే జోరును కంటిన్యూ చేయలేకపోయాడు. చివరకు జొనాథన్ 21-16తో గేమ్‌ను గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాడు. Jonatan Christie 🇮🇩 and Lakshya Sen 🇮🇳 give it their all for a spot in the finals.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/0eSj6ZLOIH — BWF (@bwfmedia) July 29, 2023 చదవండి: ‘హండ్రెడ్’ టోర్నీకి జెమీమా 151 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్! వీడియో వైరల్ -
సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి
భారత టాప్ షట్లర్ లక్ష్యసేన్ మరో టైటిల్‌కు దగ్గరయ్యాడు.జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన లోకల్ ప్లేయర్ కోకి వతాన్బేను 21-15, 21-19 వరుస గేముల్లో చిత్తు చేశాడు. ఇక రేపు(శనివారం) జరగనున్న సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీతో తలపడనున్నాడు. Lakshya Sen enters semifinals of Japan Open, Satwik-Chirag out READ: https://t.co/XMwjavlFmc#LakshyaSen #Badminton #JapanOpen pic.twitter.com/oRgSxUuxR3 — TOI Sports (@toisports) July 28, 2023 వరల్డ్ నెంబర్ పదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నెంబర్‌వన్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో 21-19, 18-21,8-21తో ఓడిపోయాడు. అయితే తొలి గేమ్‌ను 21-19తో గెలిచి రెండో గేమ్‌లోనూ ఒక దశలో 7-1తో ఆధిక్యంలో కనిపించిన ప్రణయ్ ఆ తర్వాత అనవసర ఒత్తిడికి లోనయ్యాడు. ఆ తర్వాత 18-21తో రెండో గేమ్ కోల్పోయిన ప్రణయ్.. మూడో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి భారత డబుల్స్ టాప్ షట్లర్స్ సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి పోరాటం ముగిసింది. ఇటీవలే కొరియా ఓపెన్ నెగ్గి జోరు మీదున్న ఈ ద్వయం ఈ టోర్నీలో ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా గెలుస్తూ మరో టైటిల్ గెలిచేలా కనిపించింది. అయితే శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన ఒలింపిక్ చాంపియన్స్ లీ యాంగ్- వాంగ్ చీ-లాన్ చేతిలో 15-21, 25-23, 16-21తో ఓటమి పాలయ్యారు. చదవండి: రోహిత్ చివరగా ఏడో స్థానంలో ఎప్పుడు బ్యాటింగ్‌కు వచ్చాడంటే? Major League Cricket 2023: డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ -
క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. సింగిల్స్ విభాగంలో హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్‌లు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. డబుల్స్ విభాగంలో టాప్ షట్లర్లు స్వాతిక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి జోరు కనబరుస్తూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్ జపాన్‌కు చెందిన కాంటా సునేయమాపై 21-14, 21-16 వరుస గేముల్లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ జోడి డెన్మార్క్‌కు చెందిన జెప్ బే- లాసే మొల్హెగ్డే ద్వయంపై 21-17, 21-11 వరుస సెట్లలో ఖంగుతినిపించారు. Lakshya Sen 🇮🇳 sets the pace against Kanta Tsuneyama 🇯🇵.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/INyZMUO6HR — BWF (@bwfmedia) July 27, 2023 ఇక హెచ్ఎస్ ప్రణయ్.. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో మన దేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్‌పై 19-21, 21-9, 21-9 తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ప్రణయ్ తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికి ఆ తర్వాత ఫుంజుకొని రెండు వరుస గేములను గెలుచుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో భారత టాప్ జోడి ట్రీసా జోలీ-పుల్లెల గాయత్రి గోపిచంద్ జంట ప్రీక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. జపాన్‌కు చెందిన నమీ మత్సయుమా-చిమారు షీడా చేతిలో 21-13, 19-21తో ఓటమిపాలయ్యారు. చదవండి: SL Vs PAK 2nd Test: ఏడు వికెట్లతో చెలరేగిన 36 ఏళ్ల పాక్ బౌలర్.. సిరీస్ క్లీన్‌స్వీప్ Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! -
సింధు ఓటమి.. లక్ష్యసేన్ శుభారంభం; సాత్విక్-చిరాగ్ జోడి దూకుడు
తెలుగుతేజం పీవీ సింధు వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సింధు తాజాగా జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ తొలి రౌండ్‌కే పరిమితమైంది. బుధవారం రౌండ్ ఆఫ్ 32లో చైనాకు చెందిన జాంగ్ యిమాన్ చేతిలో పీవీ సింధు.. 21-12, 21-13తో ఓటమిపాలయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన 13 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో సింధు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. Zhang Yi Man 🇨🇳 takes on former world champion Pusarla V. Sindhu 🇮🇳.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/RzycVktT53 — BWF (@bwfmedia) July 26, 2023 లక్ష్యసేన్ శుభారంభం.. ఇక పురుషుల విభాగంలో టాప్ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో మన దేశానికే చెందిన ప్రియాన్షు రావత్‌పై 21-15, 12-21, 24-22తో గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీకి దూరంగా ఉన్న లక్ష్యసేన్ అంతకముందు జరిగిన కెనడా ఓపెన్ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో విజేతగా అవతరించాడు. జోరు మీదున్న సాత్విక్-చిరాగ్ జోడి ఈ ఆదివారం కొరియా ఓపెన్ డబుల్స్ టైటిల్స్ గెలిచి జోరు మీదున్న భారత డబుల్స్ స్టార్ షట్లర్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడి కూడా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాడో, డేనియల్ మార్టిన్ ద్వయంపై 21-16, 11-21, 21-13తో గెలిచి రెండో రౌండ్లో అడుగుపెట్టారు. Rankireddy/Shetty 🇮🇳 take to the court against Carnando/Marthin 🇮🇩.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/o2GfitVREC — BWF (@bwfmedia) July 26, 2023 చదవండి: IND Vs WI ODI Series: తొలి వన్డే.. సంజూ శాంసన్‌కు చోటు, ఇషాన్‌కు మొండిచెయ్యేనా! రెండు పెళ్లిళ్లు పెటాకులు! 69 ఏళ్ల వయసులో మూడోసారి! ఎవరీ బ్యూటీ? -
జపాన్ ఓపెన్‌లో ముగిసిన ప్రణయ్ పోరాటం
జపాన్ ఓపెన్-2022 సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్లు పోరాటం ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్లోనే స్టార్ షట్లర్లంతా నిష్క్రమించగా.. చివరగా ఆశలు పెట్టుకున్న హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఇంటిబాట పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్ చేతిలో 17-21, 21-15, 20-22 తేడాతో ప్రణయ్ ఓటమిపాలైయ్యాడు. కాగా ప్రణయ్ ప్రీక్వార్టర్స్‌లో సింగపూర్ ఆటగాడు కియాన్ యును వరుస సెట్లలో (22-20 21-19) మట్టికరిపించి క్వార్టర్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు ఈ టోర్నీ తొలి రౌండ్లో లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఇంటిబాట పట్టగా.. ఫ్రీ క్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలైయ్యాడు. చదవండి: Asia Cup 2022 Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్ కాంగ్‌ను పాక్ లైట్ తీసుకుంటే అంతే సంగతులు! -
ముగిసిన శ్రీకాంత్ పోరాటం.. బరిలో మిగిలింది ఒకే ఒక్కడు
జపాన్ ఓపెన్-2022 సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్ల పోరాటం దాదాపుగా ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్లోనే స్టార్ షట్లర్లంతా ఇంటిముఖం పట్టగా.. గురువారం కిదాంబి శ్రీకాంత్ పోరాటం సైతం ముగిసింది. భారత్ తరఫున హెచ్ఎస్ ప్రణయ్ మాత్రమే ఈ టోర్నీ బరిలో మిగిలాడు. పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో శ్రీకాంత్.. జపాన్‌కు చెందిన కంటే సునేయమ చేతిలో 10-21, 16-21 తేడాతో పోరాడి ఓడాడు. అంతకుముందు శ్రీకాంత్ తొలి రౌండ్లో వరల్డ్ నంబర్ 4 ఆటగాడు లీ జీ జియాకు షాకిచ్చి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. ఇక టోర్నీ బరిలో నిలిచిన ఏకైక భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ విషయానికొస్తే.. ఈ మాజీ వరల్డ్ నంబర్ 8 షట్లర్ ప్రీక్వార్టర్స్‌లో సింగపూర్ ఆటగాడు, మాజీ వరల్డ్ ఛాంపియన్ లో కియాన్ యును వరుస సెట్లలో (22-20 21-19) ఖంగుతినిపించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ప్రణయ్ తదుపరి రౌండ్లో తైపీ షట్లర్ చౌ టెన్ చెన్ను ఢీకొట్టాల్సి ఉంది. కాగా, ఈ టోర్నీ బరిలో భారత తురుపు ముక్క పీవీ సింధు బరిలో దిగని విషయం తెలిసిందే. చదవండి: వరల్డ్ నంబర్ 4కు షాకిచ్చిన శ్రీకాంత్.. సైనా, లక్ష్యసేన్ ఔట్ -
లెక్క సరిచేసిన శ్రీకాంత్
జపాన్ ఓపెన్‌లో కశ్యప్‌పై విజయం జయరామ్, ప్రణయ్ ముందంజ టోక్యో: రియో ఒలింపిక్స్ తర్వాత జరుగుతున్న తొలి సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, అజయ్ జయరామ్ శుభారంభం చేయగా... క్వాలిఫయర్ పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టారు. గత ఏడాది ఇదే టోర్నమెంట్‌లోని రెండో రౌండ్లో కశ్యప్ చేతిలో ఎదురైన ఓటమికి కిడాంబి శ్రీకాంత్ బదులు తీర్చుకున్నాడు. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 14-21, 21-14, 23-21తో ప్రపంచ 74వ ర్యాంకర్ కశ్యప్‌ను ఓడించాడు. గతంలో కశ్యప్‌తో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన శ్రీకాంత్ మూడో ప్రయత్నంలో మాత్రం సఫలమయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్ 21-19, 23-21తో సోనీ ద్వి కుంకోరో (ఇండోనేసియా)పై, ప్రణయ్ 23-21, 19-21, 21-18తో ఇస్కందర్ జుల్కర్నైన్ జైనుద్దీన్ (మలేసియా)పై గెలుపొందగా... సాయిప్రణీత్ 21-9, 21-23, 10-21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అజయ్ జయరామ్‌తో శ్రీకాంత్; రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతారు. -
జపాన్ ఓపెన్‌లో సైనా ఓటమి
టోక్యో : జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. టోక్యోలోగురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి, అన్ సీడెడ్ మినాట్సు మితాని చేతిలో 21-13, 21-16 తేడాతో సైనా ఓటమి పాలైంది. 40 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో రెండు సెట్లలోనూ సైనాపై ప్రత్యర్ధి ఆధిపత్యం చెలాయించడం గమనార్హం. సింధుతో జరిగిన మ్యాచ్‌లోనూ మూడు సెట్ల పోరులో మితాని విజయం సాధించిన విషయం విదితమే. తాజాగా ప్రపంచ టాప్ ర్యాంకర్ సైనాను ఇంటిదారి పట్టించింది. సైనాపై గెలుపుతో 5-2 తేడాతో తన గెలుపోటముల రికార్డును మరింత మెరుగు పరుచుకుంది. -
సైనా శుభారంభం
కశ్యప్, శ్రీకాంత్ కూడా.. సంధు, జ్వాలా జోడికి చుక్కెదురు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యా యి. స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ముందంజ వేయగా, పి.వి.సింధు, జ్వాలా జోడికి చుక్కెదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, రెండోసీడ్ సైనా 21-14, 22-20తో బుసానన్ ఒంగ్బుమరాంగ్పన్ (థాయ్‌లాండ్)పై నెగ్గి రెండోరౌండ్లోకి ప్రవేశించింది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభంలో తడబడ్డ హైదరాబాదీ కీలక సమయంలో బాగా పుంజుకుంది. తొలి గేమ్‌లో 1-4తో వెనుకబడ్డ సైనా...4-4, 8-8, 10-10తో స్కోరు సమం చేసింది. తర్వాత స్కోరు 13-14 ఉన్న దశలో భారత అమ్మాయి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గగా, ప్రత్యర్థి ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది. చివర్లో సైనా మరో మూడు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 4-4 ఉన్న దశలో సైనా వరుసగా ఐదు పాయింట్లు 9-4 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇక్కడి నుంచి సైనా ఒకటి, రెండు పాయింట్లు నెగ్గితే.. అవకాశం వచ్చినప్పుడల్లా బుసానన్ రెండు, మూడు పాయింట్లతో గట్టిపోటీ ఇచ్చింది. చివరకు స్కోరు 19-19 ఉన్న దశలో థాయ్ ప్లేయర్ అద్భుతమైన డ్రాప్ షాట్‌తో 20-19 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ దశలో సైనా గేమ్ పాయింట్‌ను కాపాడుకోవడంతో పాటు మరో రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మరో మ్యాచ్‌లో సింధు 13-21, 21-17, 11-21తో మినత్సు మితాని (జపాన్) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ తొలిరౌండ్లో జ్వాల-అశ్విని 20-22, 21-18, 13-21తో 8వ సీడ్ జావో యునెలి-జాంగ్ క్వినాక్సిన్ (చైనా) చేతిలో; ప్రద్య్నా గాద్రె-సిక్కి రెడ్డి 6-21, 17-21తో టాప్‌సీడ్ మిసాకి మట్సుటోమో-అయకా తకహషి (జపాన్) చేతిలో ఓడారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ స్కోరు 3-2 ఉన్న దశలో టకుమా ఉడే (జపాన్) మ్యాచ్ మధ్యలో నుంచి వైదొలిగాడు. మరో మ్యాచ్‌లో మూడోసీడ్ శ్రీకాంత్ 21-18, 21-15తో స్కాట్ ఇవాన్స్ (ఐర్లాండ్)పై; హెచ్.ఎస్.ప్రణయ్ 23-21, 22-20తో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై నెగ్గి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు. అజయ్ జయరామ్ 10-21, 10-21తో ఏడోసీడ్ విక్టర్ అక్సిల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు. సాయి ప్రణీత్ 21-23, 10-21తో లీ డాంగ్ కెన్ (జపాన్) చేతిలో ఓడాడు. రెండోరౌండ్లో కశ్యప్.. శ్రీకాంత్‌తో తలపడతాడు. -
మరోసారి మెరిసిన పి.వి.సింధు
టోక్యో: బలమైన స్మాష్‌లు... మెరుగైన డ్రాప్ షాట్లు... నెట్ వద్ద పూర్తి అప్రమత్తంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు... జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో మరోసారి మెరిసింది. . బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సింధు 21-12, 21-13తో యుకినో నకాయ్ (జపాన్)పై విజయం సాధించి తన సత్తాను చాటింది. కేవలం 29 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ మొత్తంలో ఏపీ అమ్మాయి ఆధిపత్యం కనబర్చింది. తొలి గేమ్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచిన సింధు తర్వాత చెలరేగింది. దీంతో స్కోరు 10-4కు వెళ్లింది. ఈ దశలో మరోసారి విజృంభించిన ఆమె వరుసగా ఏడు పాయింట్లు నెగ్గింది. యుకినో ఒకటి, రెండు పాయింట్లకే పరిమితం కావడంతో సింధు సులువుగా గేమ్‌ను సొంతం చేసుకుంది. 6-0తో రెండో గేమ్చ్లో ఆధిక్యంలోకి వచ్చాక సింధు కాస్త నెమ్మదించింది. దీంతో ఇరువురు ఒకటి, రెండు పాయింట్లతో సరిపెట్టుకున్నారు. అయితే స్కోరు 16-13 ఉన్న దశలో సింధు డ్రాప్ షాట్లతో ఐదు పాయింట్లు నెగ్గి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో నెట్ వద్ద 21 పాయింట్లు గెలుచుకుంది. ప్రిక్వార్టర్స్‌లో సింధు... క్వాలిఫయర్ అకానే యమగుచి (జపాన్)తో తలపడుతుంది.