జపాన్ ఓపెన్లో సైనా ఓటమి
టోక్యో : జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. టోక్యోలోగురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో జపాన్ క్రీడాకారిణి, అన్ సీడెడ్ మినాట్సు మితాని చేతిలో 21-13, 21-16 తేడాతో సైనా ఓటమి పాలైంది. 40 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో రెండు సెట్లలోనూ సైనాపై ప్రత్యర్ధి ఆధిపత్యం చెలాయించడం గమనార్హం.
సింధుతో జరిగిన మ్యాచ్లోనూ మూడు సెట్ల పోరులో మితాని విజయం సాధించిన విషయం విదితమే. తాజాగా ప్రపంచ టాప్ ర్యాంకర్ సైనాను ఇంటిదారి పట్టించింది. సైనాపై గెలుపుతో 5-2 తేడాతో తన గెలుపోటముల రికార్డును మరింత మెరుగు పరుచుకుంది.