Minatsu Mitani
-
జపాన్ ఓపెన్‌లో సైనా ఓటమి
టోక్యో : జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. టోక్యోలోగురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి, అన్ సీడెడ్ మినాట్సు మితాని చేతిలో 21-13, 21-16 తేడాతో సైనా ఓటమి పాలైంది. 40 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో రెండు సెట్లలోనూ సైనాపై ప్రత్యర్ధి ఆధిపత్యం చెలాయించడం గమనార్హం. సింధుతో జరిగిన మ్యాచ్‌లోనూ మూడు సెట్ల పోరులో మితాని విజయం సాధించిన విషయం విదితమే. తాజాగా ప్రపంచ టాప్ ర్యాంకర్ సైనాను ఇంటిదారి పట్టించింది. సైనాపై గెలుపుతో 5-2 తేడాతో తన గెలుపోటముల రికార్డును మరింత మెరుగు పరుచుకుంది. -
రెండో మ్యాచ్ కోల్పోయిన సైనా నెహ్వాల్
కౌలాంపూర్: సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రెండో మ్యాచ్ కోల్పోయింది. తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ ఈ హైదరాబాద్ అమ్మాయి గురువారం జరిగిన రెండవ లీగ్ మ్యాచ్‌లో 27 నిమిషాల్లో 9-21, 14-21తో వరల్ఢ్ నెంబర్ వన్ జురుయ్ లీ( చైనా) చేతిలో ఓడిపోయింది. అయితే సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ఈ ఏడాది తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో 21-19, 22-24, 19-21తో మినత్సు మితాని (జపాన్) చేతిలో ఓడిపోయింది.