
టోక్యో: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–750 జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ ఆట ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్య పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్‌లో ఇండోనేసియాకు చెందిన ఐదో సీడ్ జొనాథన్ క్రిస్టీ 21–15, 13–21, 21–16 స్కోరుతో సేన్‌ను ఓడించాడు.
68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరు తొలి గేమ్‌లో క్రిస్టీ చేసిన పొరపాట్లతో సేన్ 7–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిన క్రిస్టీ 15–12తో ఆధిక్యంలోకి వచ్చేశాడు. రెండో గేమ్‌లో చక్కటి సర్వీస్, ర్యాలీలతో 11–5తో సేన్ ముందంజ వేశాడు. ఆపై పదునైన స్మాష్‌లతో చెలరేగి భారత షట్లర్ రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి గేమ్‌లో మాత్రం మొదటినుంచి ఆధిక్యం ప్రదర్శించిన క్రిస్టీ చివరి వరకు దానిని నిలబెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment