భారత్‌ కథ ముగిసింది.. సెమీస్‌లో లక్ష్యసేన్‌ ఓటమి | Lakshya Sen Lost-Match-Three-Setter-Jonatan Christie In-Semi Final | Sakshi
Sakshi News home page

Japan Open 2023: భారత్‌ కథ ముగిసింది.. సెమీస్‌లో లక్ష్యసేన్‌ ఓటమి

Published Sat, Jul 29 2023 2:50 PM | Last Updated on Sat, Jul 29 2023 2:59 PM

Lakshya Sen Lost-Match-Three-Setter-Jonatan Christie In-Semi Final  - Sakshi

భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ జపాన్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో ఇండోనేషియాకు చెందిన జొనాథన్‌ క్రిస్టీ చేతిలో 21-15,13-21,21-16తో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌లో ఇద్దరు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడ్డారు. అయితే గేమ్‌ ఆఖర్లో లక్ష్యసేన్ పట్టు సడలించడంతో 21-15 తేడాతో జొనాథన్‌ మొదటి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.

దాంతో లక్ష్యసేన్‌ రెండో గేమ్‌ను కసిగా మొదలుపెట్టాడు. గేమ్‌ ఆద్యంతం ఎక్కడా జొనాథన్‌ను పైచేయి సాధించనీయలేదు. దాంతో 13-21 తేడాతో రెండో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో లక్ష్యసేన్‌ అదే జోరును కంటిన్యూ చేయలేకపోయాడు. చివరకు జొనాథన్‌ 21-16తో గేమ్‌ను గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాడు.

చదవండి: ‘హండ్రెడ్‌’ టోర్నీకి జెమీమా 

151 కి.మీ వేగంతో బౌలింగ్‌.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement