సాత్విక్‌ జోడీ ముందంజ  | Satwik-Chirag fight their way into Hylo Open quarters | Sakshi
Sakshi News home page

Hylo Open Badminton: సాత్విక్‌ జోడీ ముందంజ 

Published Fri, Nov 4 2022 9:34 AM | Last Updated on Fri, Nov 4 2022 9:34 AM

Satwik-Chirag fight their way into Hylo Open quarters - Sakshi

సార్‌బ్రుక్‌కెన్‌ (జర్మనీ): హైలో ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 22–24, 21–15, 21–11తో రోరీ ఈస్టన్‌–జాక్‌ రస్‌ (ఇంగ్లండ్‌) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) ద్వయం 21–18, 21–19తో జిలీ దెబోరా–చెర్లీ సీనెన్‌ (నెదర్లాండ్స్‌) జోడీని ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ (భారత్‌) 15–21, 21–14, 21–13 తో లూ గ్వాంగ్‌ జు (చైనా)పై కష్టపడి గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో భారత ప్లేయర్‌ మాళవిక క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్రిస్టీ గిల్మోర్‌ (స్కాట్లాండ్‌)తో జరిగిన మ్యాచ్‌లో మాళవిక తొలి గేమ్‌ను 24–22తో సొంతం చేసుకొని, రెండో గేమ్‌లో 19–7తో ఆధిక్యంలో ఉన్నదశలో గిల్మోర్‌ గాయం కారణంగా వైదొలిగింది.
చదవండి: T20 WC 2022: భారత్‌ను భయపెట్టాడు.. లిటన్‌ దాస్‌కు కోహ్లి అదిరిపోయే గిఫ్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement