ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన స్టార్ ప్లేయర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 13–21, 21–16, 9–21తో ప్రపంచ 8వ ర్యాంకర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను కోల్పోయినా వెంటనే తేరుకొని రెండో గేమ్‌ను దక్కించుకుంది.
అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో గ్రెగోరియా ధాటికి సింధు చేతులెత్తేసింది. గతంలో గ్రెగోరియాపై 10 సార్లు గెలిచిన సింధు మూడుసార్లు ఓటమిని మూటగట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధుకు 4,675 డాలర్ల (రూ. 3 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment