దారుణ ఆటతీరు.. కొనసాగుతున్న వైఫల్యం | PV Sindhu Exits-Satwik-Chirag Shetty Duo Enters Quarters Swiss Open | Sakshi
Sakshi News home page

PV Sindhu: దారుణ ఆటతీరు.. కొనసాగుతున్న వైఫల్యం

Published Fri, Mar 24 2023 1:01 PM | Last Updated on Fri, Mar 24 2023 1:04 PM

PV Sindhu Exits-Satwik-Chirag Shetty Duo Enters Quarters Swiss Open - Sakshi

మహిళల బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో రెండో రౌండ్‌కే పరిమితమైంది. శుక్రవారం రెండో రౌండ్‌లో భాగంగా ఇండోనేషియాకు చెందిన అన్‌సీడెడ్‌ పుత్రీ కుసుమ వర్దానితో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ పీవీ సింధు.. 15-21, 21-12, 18-21 తేడాతో ఓడిపోయింది.

మూడు గేములుగా సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను సింధు ఓటమి పాలైనప్పటికి.. రెండో గేమ్‌ను 21-12తో గెలుచుకుంది. అనంతరం కీలకమైన మూడో సెట్‌లో సింధు పుత్రి కుసుమ గేమ్‌కు తలవంచి ఓటమిపాలయ్యింది. ఈ ఏడాది ఒక్క టోర్నీలోనూ సింధు కనీసం క్వార్టర్స్‌కు చేరుకోలేకోపోయింది. ఇటీవలే  జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ దారుణ ప్రదర్శన కనబరిచిన సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది. 

అయితే పరుషుల డబుల్స్‌లో మాత్రం భారత్‌కు అనుకూల ఫలితం వచ్చింది. సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో తైవానిస్‌కు చెందిన ఫాంగ్‌-చిహ్‌ లీ జోడిని  12-21, 21-17, 28-26తో ఓడించారు. 

చదవండి: రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement