
న్యూఢిల్లీ : రోటర్‌డామ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట శుభారంభం చేసింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–6 (7/0), 6–7 (5/7), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ 12 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హొరియా టెకావ్ (రొమేనియా) ద్వయంతో బోపన్న జంట ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment