Denis Shapovalov
-
పోరాడి ఓడిన బోపన్న జోడీ..
స్టుట్గార్ట్ (జర్మనీ): బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 6–7 (1/7), 6–7 (5/7)తో మూడో సీడ్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)–మ్యాట్ పావిచ్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు పదిసార్లు అవకాశం లభించినా బోపన్న–షపోవలోవ్ ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేకపోయారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ 6–4, 3–6, 11–9తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్)–ఐజామ్ ఉల్ హఖ్ ఖురేషీ (పాకిస్తాన్)లపై విజయం సాధించారు. సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీకి 11,480 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 43 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: Mary Kom: కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగిన భారత దిగ్గజ బాక్సర్ -
ఓటమి అంచుల్లో నుంచి నెగ్గిన నాదల్
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో తొమ్మిదిసార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) అతికష్టమ్మీద క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. డెనిస్ షపవలోవ్ (కెనడా)తో 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ నాదల్ 3–6, 6–4, 7–6 (7/3)తో గెలుపొంది ఊపిరి పీల్చుకున్నాడు. రెండో సెట్లో 0–3తో... మూడో సెట్లో 1–3తో వెనుకబడిన నాదల్ చివరకు 5–6 స్కోరు వద్ద తన సర్వీస్‌లో ఏకంగా రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాపాడుకొని గట్టెక్కాడు. -
'నన్ను వెళ్లనివ్వకపోతే ప్యాంటులోనే పోసేస్తా'
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ప్రపంచ 12వ ర్యాంకర్ డెనీస్ షాపోలపోవ్, జన్నిక్ సిన్నర్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్ మధ్యలో డెనీస్ టాయిలెట్‌కు వెళ్లాలని చైర్ అంపైర్‌ను అడగ్గా.. అతను అనుమతి ఇవ్వలేదు. దీంతో డెనీస్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'నన్ను టాయిలెట్‌కు వెళ్లనివ్వకపోతే ప్యాంటులోనే పోసేలా ఉన్నా..లేదంటే ఆ బాటిల్లో పోస్తా. మీరు ఆటగాళ్లను టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వరా? ఇదెక్కడి రూల్? నాకర్థం కావడం లేదు అంటూ విరుచుకుపడ్డాడు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదో సెట్ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా వీరిద్దరి మధ్య మ్యాచ్ ఫస్ట్ సెట్ నుంచే 3-6, 6-3,6-2,4-6,6-4తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డెనీస్ విజయం సాధించాడు. -
క్వార్టర్స్‌లో బోపన్న జంట
న్యూఢిల్లీ : రోటర్‌డామ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట శుభారంభం చేసింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–6 (7/0), 6–7 (5/7), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ 12 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హొరియా టెకావ్ (రొమేనియా) ద్వయంతో బోపన్న జంట ఆడుతుంది. -
బోపన్న జంట సంచలనం
మాంట్రియల్ (కెనడా): రోజర్స్ కప్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అన్‌సీడెడ్ బోపన్న–షపోవలోవ్ ద్వయం 4–6, 6–1, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ నికోలస్ మహుట్–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. బాసిలాష్విలి (జార్జియా)– స్ట్రఫ్ (జర్మనీ), ఎడ్మండ్ (బ్రిటన్)–టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) జోడీల మధ్య జరిగే తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట తలపడుతుంది. -
అంపైర్‌ను బంతితో కొట్టాడు!
-
అంపైర్‌ను బంతితో కొట్టాడు!
ఒట్టావా: కెనడా టెన్నిస్ స్టార్ డెనిస్ షపోవాలవ్.. తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేక బంతితో అంపైర్‌ను బలంగా కొట్టిన ఘటన డేవిస్ కప్ లో చోటు చేసుకుంది. బ్రిటన్ ఆటగాడు కేల్ ఎడ్మండ్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో వరుసగా రెండు సెట్లు కోల్పోయిన షపోవాలవ్.. మూడో సెట్లో కూడా వెనుకబడిపోయాడు. మూడో సెట్లో షపోవాలవ్ 1-2తో వెనుకంజలో ఉన్న సమయంలో ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఆ క్రమంలోనే అతిగా స్పందించి బంతిని అంపైర్ గాబస్ కూర్చొన్న స్టాండ్ వైపు గట్టిగా కొట్టాడు. ఆ బంతి కాస్తా అంపైర్ ముఖానికి బలంగా తాకడంతో అతను విలవిల్లాడిపోయాడు. తొలుత అతనికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఒట్టావాలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంపైర్ ఎడమ కన్నుపై తీవ్రంగా వాచినట్లు కెనడా డేవిస్ కప్ సభ్యుడొకరు తెలిపారు. కాగా, అంపైర్ ను బంతితో కొట్టిన డెనిస్ షపోవాలవ్ ను డేవిస్ కప్ నుంచి బహిష్కరించారు.