సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ప్రపంచ 12వ ర్యాంకర్ డెనీస్ షాపోలపోవ్, జన్నిక్ సిన్నర్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్ మధ్యలో డెనీస్ టాయిలెట్‌కు వెళ్లాలని చైర్ అంపైర్‌ను అడగ్గా.. అతను అనుమతి ఇవ్వలేదు. దీంతో డెనీస్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
'నన్ను టాయిలెట్‌కు వెళ్లనివ్వకపోతే ప్యాంటులోనే పోసేలా ఉన్నా..లేదంటే ఆ బాటిల్‌లో పోస్తా. మీరు ఆటగాళ్లను టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వరా? ఇదెక్కడి రూల్? నాకర్థం కావడం లేదు అంటూ విరుచుకుపడ్డాడు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదో సెట్ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా వీరిద్దరి మధ్య మ్యాచ్ ఫస్ట్ సెట్ నుంచే 3-6, 6-3,6-2,4-6,6-4తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డెనీస్ విజయం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment