కెనడా టెన్నిస్ స్టార్ డెనిస్ షపోవాలవ్.. తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేక బంతితో అంపైర్ను బలంగా కొట్టిన ఘటన డేవిస్ కప్ లో చోటు చేసుకుంది. బ్రిటన్ ఆటగాడు కేల్ ఎడ్మండ్తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో వరుసగా రెండు సెట్లు కోల్పోయిన షపోవాలవ్.. మూడో సెట్లో కూడా వెనుకబడిపోయాడు.