
మాంట్రియల్ (కెనడా): రోజర్స్ కప్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్ బోపన్న–షపోవలోవ్ ద్వయం 4–6, 6–1, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ నికోలస్ మహుట్–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. బాసిలాష్‌విలి (జార్జియా)– స్ట్రఫ్ (జర్మనీ), ఎడ్మండ్ (బ్రిటన్)–టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) జోడీల మధ్య జరిగే తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment