ATP Masters Series tournament
-
‘ఇండియన్ వెల్స్’ చాంప్స్ బదోసా, కామెరాన్ నోరి
కాలిఫోర్నీయా: ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్, ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో పౌలా బదోసా (స్పెయిన్), కామెరాన్ నోరి (బ్రిటన్) చాంపియన్స్‌గా అవతరించారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో పౌలా బదోసా 7–6 (7/5), 2–6, 7–6 (7/2)తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచింది. తాజా గెలుపుతో బదోసా 14 స్థానాలు ఎగబాకి 27వ ర్యాంక్ నుంచి 13వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 26వ ర్యాంకర్ కామెరాన్ నోరి 3–6, 6–4, 6–1తో బాసిలాష్ విలి (జార్జియా)పై గెలిచి ఈ టోర్నీ చరిత్రలో విజేతగా నిలిచిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా నిలిచాడు. చాంపియన్స్ బదోసా, నోరికి 12,09,730 డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. -
సెమీస్‌లో ఓడిన బోపన్న జంట
న్యూఢిల్లీ: మాంట్రియల్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో అన్‌సీడెడ్ రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. కెనడాలో ఆదివారం జరిగిన పురుషుల డబు ల్స్ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వ యం 6–7 (3/7), 6–7 (7/9)తో రాబిన్ హాస్–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) జోడీ చేతి లో ఓడిపోయింది. గంటా 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట నాలుగు ఏస్‌లు సంధించింది. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఓడిన బోపన్న జంటకు 76,300 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 54 లక్షల 11 వేలు)తోపాటు 360 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
బోపన్న జంట సంచలనం
మాంట్రియల్ (కెనడా): రోజర్స్ కప్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అన్‌సీడెడ్ బోపన్న–షపోవలోవ్ ద్వయం 4–6, 6–1, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ నికోలస్ మహుట్–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. బాసిలాష్విలి (జార్జియా)– స్ట్రఫ్ (జర్మనీ), ఎడ్మండ్ (బ్రిటన్)–టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) జోడీల మధ్య జరిగే తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట తలపడుతుంది. -
ప్రజ్నేశ్ మరో సంచలనం
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్లో భారత టెన్నిస్ నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మరో సంచలనం సృష్టించాడు. తన కెరీర్లో గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన ఈ చెన్నై ప్లేయర్... పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ నికోలజ్ బాసిలాష్విలి (జార్జియా)పై గెలిచి మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 97వ ర్యాంకర్, 29 ఏళ్ల ప్రజ్నేశ్ 6–4, 6–7 (6/8), 7–6 (7/4)తో బాసిలాష్విలిని ఓడించాడు. తొలి రౌండ్లో ప్రపంచ 69వ ర్యాంకర్ బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై ప్రజ్నేశ్ గెలిచిన సంగతి తెలిసిందే. గతేడాది çస్టుట్గార్ట్ ఓపెన్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్ డెనిస్ షపొవ లోవ్ (కెనడా)పై గెలుపొందడమే ప్రజ్నేశ్ కెరీర్లో సాధించిన గొప్ప విజయంగా ఉంది. బాసిలాష్విలితో జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ ఏకంగా పది ఏస్‌లు సంధించాడు. మరోవైపు బాసిలాష్విలి పది డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మూడో రౌండ్లో ప్రపంచ 89వ ర్యాంకర్, 40 ఏళ్ల ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)తో ప్రజ్నేశ్ తలపడతాడు. బోపన్న జంట ముందంజ... ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–షపొవలోవ్ (కెనడా) ద్వయం 6–4, 6–4తో రెండో సీడ్ బ్రూనో సొరెస్ (బ్రెజిల్)–జేమీ ముర్రే (బ్రిటన్) జంటపై గెలిచింది. -
రన్నరప్ బోపన్న జంట
మాంట్రియల్ (కెనడా): కెరీర్లో ఐదో మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. రోజర్స్ కప్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో రోహన్ బోపన్న–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో బోపన్న–డోడిగ్ ద్వయం 4–6, 6–3, 6–10తో హెర్బర్ట్–మహుట్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడింది. రన్నరప్ బోపన్న–డోడిగ్ జంటకు 1,35,630 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 86 లక్షల 95 వేలు)తోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. ఫైనల్లో ఫెడరర్ 3–6, 4–6తో 20 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఓడాడు. -
క్వార్టర్స్‌లో పేస్-వావ్రింకా జంట
సిన్సినాటి (అమెరికా) : వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో పేస్-వావ్రింకా జంట 7-6 (7/4), 3-6, 10-3(సూపర్ టైబ్రేక్)తో వాసెక్ పోస్పిసిల్ (కెనడా)-జాక్ సోక్ (అమెరికా) జోడీపై గెలిచింది. ఇదే టోర్నీలో ఆడుతున్న రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది.