రన్నరప్‌ బోపన్న జంట | Bopanna pair of runner-up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ బోపన్న జంట

Published Tue, Aug 15 2017 12:48 AM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

రన్నరప్‌ బోపన్న జంట

రన్నరప్‌ బోపన్న జంట

మాంట్రియల్‌ (కెనడా): కెరీర్‌లో ఐదో మాస్టర్స్‌ సిరీస్‌ డబుల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్నకు నిరాశ ఎదురైంది. రోజర్స్‌ కప్‌ ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో బోపన్న–డోడిగ్‌ ద్వయం 4–6, 6–3, 6–10తో హెర్బర్ట్‌–మహుట్‌ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో ఓడింది.

రన్నరప్‌ బోపన్న–డోడిగ్‌ జంటకు 1,35,630 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 86 లక్షల 95 వేలు)తోపాటు 600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. ఫైనల్లో ఫెడరర్‌ 3–6, 4–6తో 20 ఏళ్ల అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) చేతిలో ఓడాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement